శ్రీముఖికి బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆఫర్: ఏకంగా ఆ స్టార్ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్
తెలుగులో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా బుల్లితెరపై రచ్చ చేస్తున్నారు. అందులో కొందరు మాత్రమే తమ అందం, అభినయం, హోస్టింగ్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. తద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటున్నారు. అలాంటి వారిలో నిజామాబాద్ పిల్ల శ్రీముఖి ఒకరు. ముందుగా సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా స్థిరపడింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కొత్త షోలో భాగం అయింది. ఇక, ఇందులో శ్రీముఖికి ఓ బాలీవుడ్ ప్రొడ్యూసర్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా పరిచయమైన అమ్మాయి
యాంకర్‌గా మారడానికి ముందే శ్రీముఖి సినిమాల్లోకి వచ్చింది. అల్లు అర్జున్ నటించిన ‘జులాయి'తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈమె.. ఆ తర్వాత ‘నేను శైలజ', ‘జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘బాబు బాగా బిజీ' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రత్యేకమైన ఇమేజ్‌ను కూడా అందుకుందామె.

హోస్టుగా మారి యమ సక్సెస్
సినిమా ఆఫర్లతో సత్తా చాటుతోన్న సమయంలోనే శ్రీముఖి యాంకర్‌గా మారింది. ‘అదుర్స్' అనే షోతో మొదలైన ఆమె ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతోంది. సుదీర్ఘమైన కెరీర్‌లో ఈ బ్యూటీ ‘అదుర్స్ 2', ‘మనీ మనీ', ‘సూపర్ మామ్', ‘సూపర్ సింగర్', ‘జోలకటక', ‘కామెడీ నైట్స్', ‘బొమ్మ అదిరింది', ‘పటాస్' వంటి షోలలను హోస్ట్ చేసి గుర్తింపు పొందింది.

అప్పటి నుంచి స్పీడు పెంచి
యాంకర్‌గా బుల్లతెరపై సందడి చేస్తోన్నప్పుడే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో మూడో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఫినాలేలో ఓడిపోయింది. కానీ, ఈ షో వల్ల తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో షో తర్వాత మరింత ఉత్సాహంగా తన కెరీర్‌ను పక్కా ప్లాన్‌తో నడిపిస్తోంది.

చేతి నిండా సినిమాలతో బిజీ
ఆ మధ్య ఇకపై సినిమాలు చేయనంటూ శ్రీముఖి బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం వెండితెరపై కనిపించలేదు. అయితే, ఇప్పుడు మాత్రం నిర్ణయాన్ని మార్చుకుంది. గత ఏడాది ఆమె ‘క్రేజీ అంకుల్స్', ‘మాస్ట్రో'లో నటించింది. ఇప్పుడు చిరంజీవి ‘భోళా శంకర్' సహా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు చేయడానికి సన్నద్ధం అవుతోంది.

ఆ షోలో భాగమై.. సందడి చేసి
కొంత కాలంగా బుల్లితెరపై కొంత గ్యాప్ తీసుకున్న శ్రీముఖి.. ఇప్పుడు మరోసారి స్పీడు పెంచేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లలో తళుక్కున మెరిసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం కాబోతున్న ‘సరిగమప ద సింగింగ్ సూపర్‌స్టార్' కొత్త సీజన్‌కు హోస్టుగా వ్యవహరిస్తోంది. గతంలో దీనికి ప్రదీప్ యాంకర్‌గా చేసిన విషయం తెలిసిందే.

‘వలిమై' యూనిట్‌తో రచ్చ
ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న ‘సరిగమప ద సింగింగ్ సూపర్‌స్టార్' ఎపిసోడ్‌కు ‘వలిమై' మూవీ యూనిట్ సభ్యులు అతిథులుగా వచ్చారు. ముందుగా అందులో విలన్‌గా చేసిన కార్తికేయ గుమ్మకొండ ఎంట్రీ ఇవ్వగానే అతడి సిక్స్ ప్యాక్ చూపించమని కోరింది శ్రీముఖి. ఆ తర్వాత బోనీ కపూర్, యువన్ శంకర్ రాజాలు కూడా వచ్చారు. వాళ్లతో కలిసి ఆమె తెగ సందడి చేసేసింది.
Recommended Video

బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆఫర్
బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ చివర్లో ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో శ్రీముఖి మాట్లాడుతూ.. ‘సార్.. హీరోయిన్‌గా ఏదైనా ఆఫర్ ఉంటే ఇవ్వండి' అని అందరి ముందే అడిగేసింది. దీనికాయన ‘సౌత్‌లో నేను హీరోగా చేస్తా. నాకు జోడీగా నిన్ను తీసుకుంటా' అని ఫన్నీగా కామెంట్ చేశారు. దీంతో వెంటనే శ్రీముఖి ఆయనను హగ్ చేసుకుంది. ఇప్పుడీ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











