నన్ను పిండకు తల్లి.. కావాలంటే దాన్ని పిండుకో.. అరియానాకు సోహైల్ మొర

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 52వ రోజు వినోదం, అల్లరి సమపాళ్లలో కనిపించాయి. టాస్క్‌లో భాగంగా అరియానా చేసిన అల్లరి, మంచి పనులను లాస్యకు చెబుతూ కనిపించాడు. ఇక గేమ్‌లో భాగంగా ఎవరికి వారు తమ వ్యూహాలను రచిస్తూ ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా అర్ధమైంది. ఈ సందర్భంగా అరియానా గురించి సోహైల్ చెప్పిన విషయాలు ఇవే..

అరియానా మంచి పాప..

అరియానా మంచి పాప..


బీబీ డే కేర్ టాస్క్ సందర్భంగా ఇంట్లో జరిగిన విషయాల గురించి ఇంటి సభ్యుల నుంచి సంచాలకులు లాస్య ఫీడ్‌బ్యాక్ తీసుకొన్నది. ఇంటి సభ్యులందరితో మాట్లాడుతూ వారి అనుభవాలు చెప్పమన్నది. దాంతో ప్రతీ ఒక్కరు తమకు ఎదురైన అనుభవాలను చెబుతూ కనిపించారు. ఈ సందర్భంగా అరియానా మంచి పాప, అల్లరితోపాటు చాలా విషయాలు కూడా నేర్చుకొన్నది అంటూ సోహైల్ చెప్పిన విషయాలు ఆకట్టుకొన్నాయి.

అరియానా బొమ్మలు బాగా వేసింది

అరియానా బొమ్మలు బాగా వేసింది


మా పాప అరియానా గ్లోరి చాలా చక్కగా పాఠాలు నేర్చుకొన్నది. క్లాస్‌లో అన్ని విషయాలు బాగా చెప్పింది. ఏ, బీ, సీ, డీ గురించి పూర్తిగా వివరించింది. బొమ్మలు కూడా బాగా వేసింది. ఆటల్లోనూ, పాటల్లోనూ మంచి టాలెంట్ చూపింది అంటూ సోహైల్ చెబుతుంటే.. మంచి విషయాలే కాకుండా చెడు విషయాలు కూడా చెప్పాలి అంటూ లాస్య సూచించింది.

ముఖంపైన పిండి కొట్టింది

ముఖంపైన పిండి కొట్టింది

అరియానా మంచితోపాటు చెడు, అల్లరి విషయాలు బాగానే చేసింది. ముఖంపైన పిండి కొట్టింది. ముఖంపై పెన్సిల్ రుద్దింది అంటూ సోహైల్ చెప్పాడు. అలా చెబుతూ పిండి ముఖంపై వెయ్యొద్దు. పిండి మనకు చాలా తక్కువగా వస్తున్నది. కాబట్టి పిండిని వేస్ట్ చేయవద్దు అంటూ సోహౌల్ బుద్ది చెప్పాడు. అరియానా కావాలంటే నిమ్మకాయ పిండుకో. నన్ను పిండకు అంటూ కామెంట్ చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 10 Highlights
నేల మీద కూడా నడువు తల్లి

నేల మీద కూడా నడువు తల్లి


నా మీద ఎక్కువగా ఎక్కుతున్నావు. పదే పదే నన్ను ఎత్తుకోమని గొడవ చేస్తున్నావు. అలా చేయవద్దు. కాబట్టి నేల మీద కూడా కొంచెం నడవాలి. నేల మీద నడవడం నేర్చుకోవాలి అని సోహైల్ అంటే.. నా కాళ్లు నొప్పి లేస్తాయి. నడవడం నాకు సరిగా రాదు అని అరియానా అంటే.. వెరీ గుడ్.. టైమ్‌కు తింటుంది. అలాగే సమయానికి డైపర్లు, డ్రెస్ కూడా మార్చుకొంటుంది అంటూ సోహైల్ తన బాధలు చెప్పుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X