లాగేసుకొన్నావా? దొంగతనం చేశావా? హారికపై అభిజిత్ ఫైర్

బిగ్‌బాస్ తెలుగులో 52వ రోజు కూడా బీబీ డే కేర్ టాస్క్ కొనసాగింది. ఇంటి సభ్యుల్లో అరియానా, అవినాష్, మెహబూబ్, హారిక చక్కటి హాస్యాన్ని పండించారు. అంతేకాకుండా ఇంటిలో టాస్క్ సందర్భంగా ఒకరిపై మరొకరి మాటలు రువ్వుకొన్నారు. ముఖ్యంగా హారిక తీరు వల్ల అభిజిత్, అమ్మా రాజశేఖర్ గట్టిగా గొడవ పడ్డారు. 52 రోజు ఇంటిలో ఇంకా ఏం జరిగిందంటే..

చాక్లెట్లను గిఫ్గుగా ఇచ్చిన యాంకర్ లాస్య

చాక్లెట్లను గిఫ్గుగా ఇచ్చిన యాంకర్ లాస్య

బీబీ డే కేర్ సందర్భంగా ప్రిన్స్‌పాల్‌గా వ్యవహరించిన లాస్య ఇంటి సభ్యులకు గిఫ్టులుగా చాక్లెట్లు ఇచ్చారు. గేమ్ సందర్భంగా తనను ఇంప్రెస్ చేసుకొంటూ వెళ్లిన ప్రతీ ఒక్కరికి ఓ చాక్లెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంటి సభ్యుల వద్ద ఉన్న చాక్లెట్లను హారిక కొట్టేయడంతో పెద్ద గొడవ జరిగింది. అమ్మా రాజశేఖర్ వద్ద చాక్లెట్లు కొట్టేయడంతో ఆయన మండిపడ్డారు.

హారిక వద్ద నుంచి అమ్మా రాజశేఖర్ లాగేసుకొవడం

హారిక వద్ద నుంచి అమ్మా రాజశేఖర్ లాగేసుకొవడం

తన చాక్లెట్ తీసుకొన్న హారికను ఇంటిలో అమ్మా రాజశేఖర్ పరుగెత్తించారు. ఒక చోట పడిపోవడంతో ఆమె పడి బలవంతంగా పాకెట్లో చేయి పెట్టి చాక్లెట్ లాగేసుకొన్నాడు. అయితే మోనాల్, లాస్య అభ్యంతరం తెలిపారు. అయితే నేను టాస్క్‌లో ఓ పాపగా వ్యవహరించి హారిక వద్ద చాక్లెట్ లాగేసుకొన్నాను అని అమ్మా వివరణ ఇచ్చారు.

దొంగతనం చేశావా అంటూ అభిజిత్

దొంగతనం చేశావా అంటూ అభిజిత్

హారిక చాక్లెట్లు దొంగతనం చేయడంపై అభిజిత్ సీరియస్ అయ్యారు. లాగేసుకొన్నావా? దొంగతనం చేశావా అంటూ హారికను నిలదీశాడు. అందుకు నేను దొంగతనమే చేశాను అని హారిక అంటే. అది దొంగతనం కాదు .. లాగేసుకోవడం అని అభిజిత్ అంటే.. కాదు నా లెక్కలో అది దొంగతనమే అంటూ ఎదురు సమాధానం చెప్పింది.

జబర్దస్త్ అవినాష్ చిన్న పిల్లాడిలా ..

జబర్దస్త్ అవినాష్ చిన్న పిల్లాడిలా ..

ఇలా ఇంటి సభ్యుల మధ్య అల్లరితోపాటు లొల్లితో టాస్క్ సాగింది. అవినాష్ చేసిన కామెడీ విపరీతంగా నచ్చింది. చిన్న పిల్లవాడిలా బొమ్మతో మాట్లాడటం ఆకట్టుకొనేలా ఉంది. అవినాష్ ఈ టాస్క్‌లో విపరీతంగా నవ్వించాడు. ఇక టాస్క్ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులందరిని బిగ్‌బాస్ లివింగ్ రూమ్‌లో సమావేశ పరిచాడు.

బెస్ట్ జోడిగా సోహైల్, అరియానా గ్లోరి

బెస్ట్ జోడిగా సోహైల్, అరియానా గ్లోరి

బీబీ బేబీ కేర్ టాస్క్‌లో ఉత్తమ జంటను ఎంపిక చేయాలని యాంకర్ లాస్యను బిగ్‌బాస్ ఆదేశించాడు. అయితే ఇంటిలో టాస్క్‌ను అరియానా, సోహైల్ జంట బాగా ఆడింది. వారే ఉత్తమ జంట అంటూ తెలిపింది. సోహైల్‌ను అరియానా ఎంత ఇబ్బంది పెట్టినా సహనంతో ఆమెను మెప్పించాడు అంటూ లాస్య వివరణ ఇచ్చింది. అందుకే వారిని బెస్ట్ జోడిగా ఎంపిక చేశాను అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X