బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. అరియానా ఎత్తుకొని ఇంట్లోకి.. ఆతృతగా కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 52వ రోజున ఇంటి సభ్యులకు ఓ ఫన్‌ గేమ్‌ను ఇచ్చారు. అలాగే అభిజిత్‌తో అఖిల్ కలిసేందుకు ప్రయత్నించడం, అలాగే మోనాల్‌తో ఉన్న విభేదాల గురించి చర్చ జరిగింది. ఇలాంటి సమయంలోనే తోటి ఇంటి సభ్యుల గురించి అభిప్రాయాలు తెలియజేయాలంటూ బిగ్‌బాస్‌ గేమ్‌ను ఆడించారు. ఇంకా 53 రోజు ఇంటిలో ఏం జరిగిందంటే..

వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ బిగ్‌బాస్ ఆదేశం

వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ బిగ్‌బాస్ ఆదేశం

అయితే 54వ రోజు ఉదయమే.. బిగ్‌బాస్ ఓ లేఖను పంపించారు. ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఓ సభ్యుడు వచ్చాడు. అతడిని సాదరంగా ఆహ్వనించాలి. కెప్టెన్ అరియానా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అతడిని తీసుకురావాలి అని సూచించాడు. స్టోర్ రూమ్‌లోకి వచ్చిన అరియానాకు తాను కోరిన బొమ్మను గిఫ్టుగా పంపించాడు. దాంతో వైల్డ్ కార్డు సభ్యుడు ఎవరు అంటూ అరియానా అడిగినా సమాధానం రాకపోవడంతో బొమ్మతో ఇంట్లోకి వెళ్లింది.

అరియానా రిక్వెస్ట్‌కు బిగ్‌బాస్ స్పందించి

అరియానా రిక్వెస్ట్‌కు బిగ్‌బాస్ స్పందించి

అరియానా రిక్వెస్టును పరిగణనలోకి తీసుకొన్న అరియానాకు గిఫ్గుగా కోతి బొమ్మను పంపించాడు. అయితే 53వ రోజున ఇంట్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ప్రవేశించే సమయంలో ప్లే చేసే మ్యూజిక్‌ను వినిపించడంతో ఇంటిలోకి ఎవరో కొత్త కంటెస్టెంట్ వస్తున్నారని ఆసక్తిగా ఎదురు చూశారు. వైల్డ్ కార్డు ఎంట్రీ అనే సందేహంతో స్టోర్ రూమ్‌లోకి వెళ్లిన అరియానాకు కోతి బొమ్మ కనిపించింది. దానిని చూసి ఆరియానా సంతోషంలో మునిగిపోయింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పారు.

 వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం కంటెస్టెంట్లు ఆతృతగా

వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం కంటెస్టెంట్లు ఆతృతగా

అయితే కోతి బొమ్మతో ఇంటిలోకి ప్రవేశించిన అరియానాను చూసిన అవినాష్, ఇతర ఇంటి సభ్యులు వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరు అని ఆతృతగా ప్రశ్నించారు. అయితే బొమ్మను మాత్రమే పంపించారంటూ అరియానా చెప్పినా ఇంటి సభ్యులు నమ్మలేదు. చివరకు బొమ్మను చూపించడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ కోతి అని ఇంటి సభ్యులు నమ్మారు.

అఖిల్, అభిజిత్ మధ్య చర్చలు

అఖిల్, అభిజిత్ మధ్య చర్చలు

ఇక ఇంటిలో మోనాల్ గజ్జర్ కారణంగా తమ మధ్య నెలకొన్న విభేదాలపై అభిజిత్, అజిత్ చర్చించుకొంటూ కనిపించారు. ఇంటిలో మన మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా.. నీవు నాకు ఫ్రెండ్ అంటూ అఖిల్ చెప్పడం కనిపించింది. తనకు అలాంటి ఫీలింగ్ ఉందని అభిజిత్ చెప్పడాన్ని బట్టి వారి మధ్య ఫ్రెండ్లీ వాతావరణం నెలకొనే సూచనలు స్పష్టమయ్యాయి.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abijeet Getting Support From Pawan Kalyan Fans
మోనాల్‌కు సారీ చెప్పను అంటూ అభిజిత్

మోనాల్‌కు సారీ చెప్పను అంటూ అభిజిత్

అభిజిత్, అఖిల్ భేటీ తర్వాత సీన్ మోనల్‌ వద్దకు మారింది. మోనాల్ వ్యవహరించిన తీరుపై అభిజిత్ కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పాడు. మోనాల్ విషయంలో నా ఫీలింగ్ ఎప్పటికి అదే. నా అభిప్రాయంలో ఎలాంటి మార్పు రాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పను అంటూ మోనాల్, అఖిల్‌కు అభిజిత్ స్పష్టం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X