Bigg Boss Telugu 7: బాటిల్‌తో తలపగులగొట్టిన ప్రియాంక.. నిజంగా అశ్వినికి దెబ్బ తగిలిందా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతోంది. ఇక ఇప్పటికే 80శాతం పూర్తి చేసుకున్న ఈ షో... మరో 20శాతం ఉంది. ఇక ఇప్పటికే 10వారాలు పూర్తి చేసుకుని 11వారంలోకి ఎంటర్ అయింది. ఇక 11వ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. ఇందులో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ప్రియాంక, అశ్విని శ్రీ మధ్య పంచాయితీ జరిగింది. ప్రియాంక.. అశ్వినిని నామినేట్ చేసే క్రమంలో బాటిల్ తో తలపై కొట్టింది. ఇక దీనికి అశ్విని తల పగిలినంత యాక్టింగ్ చేసేసింది. ఇందులో నిజంగా ప్రియాంక వల్ల అశ్వినికి దెబ్బ తగిలిందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయి.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక 11వ వారంలోకి ఎంటర్ అయింది ఈ షో. ఇక హౌస్ లో ప్రస్తుతం ఉన్నది 10 మంది మాత్రమే. ఇక వీరిలో ఎవరు టాప్ 5కి వెళ్తారు.. ఎవరు విన్నర్ అవుతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఈ షోలో ప్రస్తుతం శివాజీ, ప్రశాంత్, యావర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ ఉన్నారు. ఇక వీరిలో శివాజీ విన్నర్ అవుతారంటూ బయట టాక్ వినిపిస్తుంది.

అంతే కాదు.. మొన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీలు చాలా వరకు శివాజీ విన్నర్ అవుతారు అన్నట్లుగా మాట్లాడారు. ఇక టాప్ 2లో ప్రశాంత్, టాప్ 3 అమర్ దీప్ అంటూ చెప్పుకువచ్చారు. అయితే ఆ విషయం పక్కన పెడితే... బిగ్ బాస్ 11వ వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా జరిగింది. ఇక రతికకు శివాజీ హిత బోధతో.. ఆమె ఈ నామినేషన్స్ లో రెచ్చిపోయి మాట్లాడింది. నాగార్జున ఇజ్ ఓన్లీ హోస్ట్ అంటూ రెచ్చిపోయింది. ఇక శివాజీ క్లాస్ ఇవ్వడం.. రతిక రెచ్చిపోవడం హైలెట్ గా నిలిచింది.
ఆ విషయం పక్కన పెడితే.. నామినేషన్స్ లో మరో ఇంట్రెస్టింగ్ ఘటన చోటుచేసుకుంది. బిగ్ బాస్ నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ కి బాటిల్స్ ఇచ్చారు. ఎరినైతే నామినేట్ చేయాలి అనుకుంటారో వారి తలపై ఈ బాటిల్ పగులగొట్టాలి. అలా కంటెస్టెంట్స్ అందరూ తమకు నచ్చని కంటెస్టెంట్స్ ను ఎన్నుకుని రీజన్ చెప్పి తలపై ఈ బాటిలీ పగులగొడుతారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక.. అశ్వినిని ఎంచుకుంది.

ఇక ఏవో రీజన్స్ చెప్పి తలపై బాటిల్ పగులగొట్టింది. ఇక ప్రియాంక బాటిల్ తో తన తలపై కొట్టగానే.. అశ్వినీ్ డ్రామా ప్లే చేసింది. నాపై ఇంత కోపం ఉందా.. ఇంత గట్టిగా కొట్టావ్..అంటూ ఏడ్చేసింది. నిజంగానే తల నుంచి రక్తం వచ్చినట్లు బిహేవ్ చేసింది. ఇక దానికి తోడు శివాజీ వచ్చి.. ఇంకా డ్రామా ప్లే చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక పీఆర్ టీమ్స్ కూడా ప్రియాంకను బ్యాడ్ చేస్తూ.. తలపగులగొట్టిందంటూ.. రక్తం వచ్చిదంటూ ఓవర్ గా ట్రోల్ చేస్తున్నారు.
అయితే అసలు విషయం ఏంటంటే.. అసలు అవి గ్లాస్ బాటిల్స్ కావు.. కెరమెల్ తో తయారు చేస్తారు. అంటే షుగర్ బాటిల్స్. అవి అసలు నొప్పించవు.. గ్లాస్ బాటిల్స్ బిగ్ బాస్ ఎందుకు ఇస్తాడు.. అయితే దానికి అశ్విని ఓవర్ యాక్టింగ్ చేయడం.. ప్రియాంకను బ్లేమ్ చేసేలా... ఓవర్ గా చూపించడం.. ఇదో కొత్త డ్రామాగా అనిపిస్తుంది. మొత్తానికి ఏమిలేని చోట కూడా అశ్విని హాడావిడి చేసి.. ఓవర్ యాక్టింగ్ చేసిందని నెటిజన్స్అంటున్నారు.


Click it and Unblock the Notifications











