బాలుడి ప్రాణం తీసిన టీవీ చానెల్ పంతం

మృతుడిని పాండీగా గుర్తించారు. బిహెచ్‌ఇఎల్ టౌన్‌షిప్‌లోని బి సెక్టార్ నెంబర్ 2లో నివాసం ఉంటున్న షెట్టీ రావు కుమారుడు అతను. తల్లిదండ్రులు హాట్ మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. ఆ సమయంలో పాండీ తన తొమ్మిదేళ్ల తమ్ముడు అనీస్‌తో కలిసి టీవీ చూస్తున్నాడు.
తన తమ్ముడు కార్టూన్ చానెల్ నుంచి మరో చానెల్‌కు మార్చడానికి ఏ మాత్రం ఇష్టపడక గొడవ పడడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పాండీ మొదట ఆల్మారా అద్దాలు పగులగొట్టి ఆ తర్వాత ఉరేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సంఘటన గురించి తెలిసింది.
తల్లిదండ్రులు వచ్చేసరికి అనీస్ బోరున ఏడుస్తున్నాడు. వారు అందుకు కారణం అడగ్గా ఉరేసుకుని వేలాడుతున్న అన్నను చూపించాడు. వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంతలో ఇరుగుపొగరుగువారు గుమికూడారు. సంఘటనా స్థలంలో ఏ విధమైన సూసైడ్ నోట్ లభించలేదు. పాండీ తండ్రి బిహెచ్ఇఎల్‌లో కాంట్రాక్టు కార్మికుడు. పాండీ మూడో తరగతో నాలుగో తరగతో చదివి వదిలేశాడు. తమ్ముడు పాఠశాలకు వెళ్తున్నాడు.


Click it and Unblock the Notifications











