For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సింగర్ సునీతకు వింత అనుభవం: గర్ల్‌ఫ్రెండ్ అంటూ షాకిచ్చిన అబ్బాయి.. అందరి ముందే బెదిరింపులు

  |

  దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన గాత్రంతో మాయ చేస్తూ.. టాప్ సింగర్‌గా వెలుగొందుతున్నారు సునీత. చిన్న వయసులోనే తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని వేల పాటలను ఆలపించారు. అలా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అదిరోహించారు. ఇక, ఈ మధ్య బుల్లితెరపై సందడి చేస్తున్నారామె. ఈ నేపథ్యంలోనే తాజాగా గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఓ అబ్బాయి షాకివ్వడంతో సునీతకు ఓ షోలో వింత అనుభవం ఎదురైంది. ఆ సంగతులు మీకోసం!

  చిన్న వయసులోను మొదలైన కెరీర్

  చిన్న వయసులోను మొదలైన కెరీర్

  సంగీతం మీద పట్టు సాధించాలన్న లక్ష్యంతో చిన్నతనంలోనే శిక్షణ తీసుకున్నారు సునీత. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో పాటలు పాడారు. ఈ క్రమంలోనే 15 ఏళ్ల వయసులో ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల పాటలను పాడారామె. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులను అందుకున్నారు.

  అప్పుడే వివాహం.. విడాకులు కూడా

  అప్పుడే వివాహం.. విడాకులు కూడా

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో సింగర్ సునీత.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. చాలా కాలం పాటు సవ్యంగానే సాగిన వీళ్ల కాపురం.. ఆ తర్వాత మనస్ఫర్థల కారణంతో న్యాయ పరంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను తీసుకున్న ఆమె.. వాళ్లను పెంచి పోషించారామె.

   రామ్‌తో సునీత రెండో పెళ్లి.. సందడిగా

  రామ్‌తో సునీత రెండో పెళ్లి.. సందడిగా

  భర్తతో విడిపోయిన కొంత కాలం నుంచే సునీత రెండో పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తుండేవి. కానీ, అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఆమె ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సంబరంగా వివాహం చేసుకున్నారు.

   పెళ్లి తర్వాత ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది

  పెళ్లి తర్వాత ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది

  రామ్‌ను పెళ్లాడిన తర్వాత సునీత జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమె ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తన భర్తతో కలిసి సునీత.. భూలోక స్వర్గంగా పేరున్న మాల్దీవులు టూర్ వెళ్లారు. అక్కడి రిసార్టులు, బీచ్‌లలో తెగ ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.

   అందులోనే బిజీగా.. పాటల ప్రోగ్రామ్‌తో

  అందులోనే బిజీగా.. పాటల ప్రోగ్రామ్‌తో

  కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సింగర్ సునీత సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు, వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. ఇక, లాక్‌డౌన్ మొదలైన తర్వాత సునీత సాయంత్రం వేల లైవ్‌లోకి వచ్చి పాటలు పాడుతోంది.

  ఆ షోలో సునీతకు వింత అనుభవం

  ఆ షోలో సునీతకు వింత అనుభవం


  సింగర్ సునీత ప్రస్తుతం ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' అనే షోకు ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, రేణు దేశాయ్‌‌లతో కలిసి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఓ బుడతడు సునీతకు అదిరిపోయే ఆన్సర్‌తో షాకిచ్చాడు.

  Recommended Video

  Singer Sunitha Wedding ఆదర్శప్రాయం అంటున్న Naga Babu !

  గర్ల్‌ఫ్రెండ్ అంటూ షాకిచ్చిన అబ్బాయి

  తాజాగా వచ్చిన ప్రోమోలో ఓ టీమ్ 'మన్మథుడు' మూవీ స్ఫూఫ్ చేసింది. ఇందులో నాగార్జునగా నటించిన చిన్నోడితో సునీత మాట్లాడుతూ 'నీకు గర్ల్‌ఫ్రెండ్ ఉంటే.. ఎలా ఉండాలని కోరుకుంటావు' అని అడిగింది. దీనికి ఆ బుడతడు ఏమాత్రం తడబడకుండా 'మీలానే ఉండాలి' అని బదులిచ్చాడు. దీంతో సునీత 'ఏయ్' అంటూ ఆ చిన్నారిని సరదాగా బెదిరించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

  English summary
  Singer Sunitha Upadrasta Now Doing Drama Juniors – The NEXT Superstar Show. Small Boy Shocks Singer Sunitha in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X