Maanas Nagulapalli: ఘనంగా బ్రహ్మముడి సీరియల్ హీరో నిశ్చితార్థం... అమ్మాయి ఎవరంటే?
మానస్ నాగులపల్లి గురించి తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీరియల్స్ ద్వారా మానస్ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయమయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి సన్నీతో స్నేహితుడిగా ఉండి ఒక్కసారిగా వారిద్దరి స్నేహం తెలుగు ప్రేక్షకులందరిలోకి తీసుకువెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ తో మంచి టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంటూ దూసుకుపోతున్న మానస్ జీవితంలో మరో అడుగు ముందుకు వేశాడు. ఆ వివరాల్లోకి వెళితే....
ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ లో లీడ్ యాక్టర్ గా నటిస్తున్న మానస్ గతంలో బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమై విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ షోలో పాల్గొన్నప్పుడే తాను తల్లి చాటు బిడ్డని అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. తల్లి కోసం ఏమైనా చేస్తానని ఆమె మాట జవదాటన అనే విషయాన్ని అయితే ఒక్కసారిగా ప్రేక్షకులు అందరికీ చెప్పేయడంతో అందరూ ఇలాంటి అబ్బాయిలు ఈ కాలంలో కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోయారు.

అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మానస్ ఇప్పుడు ఒక ఇంటివాడు కాబోతున్నాడు. అంటే మానస్ వివాహం చేసుకోబోతున్నాడు. దానికి సంబంధించిన నిశ్చితార్థం తాజాగా ఘనంగా జరిగింది. మానస్ నాగులపల్లి తల్లి పద్మిని నాగులపల్లి సీరియల్స్ కి నిర్మాతగా ఉండేవారు. పలు సంఘాల్లో కూడా ఆమె పనిచేశారు.
ఇక తాజాగా శ్రీజ అనే అమ్మాయితో మానస్ నాగులపల్లి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. శ్రీజ తండ్రి హైదరాబాదులో సెటిల్ అయినా ఒక వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఇక మానస్ నాగులపల్లి నిశ్చితార్థం హైదరాబాదులో ఘనంగా జరగగా ఆయన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మానస్ నాగులపల్లి కాబోయే భార్య శ్రీజ కూడా చాలా అందంగా ఉందని హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదని కామెంట్లు పెడుతున్నారు. మానస్ అభిమానులు. అయితే నిశ్చిదార్థం జరిగిన విషయాన్ని మానస్ వెల్లడించలేదు. కానీ ఆయన నిశ్చితార్థానికి వెళ్లిన వారి కొంతమంది ఫోటోలు షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
మానస్ నిశ్చితార్థానికి వెళ్లి ఆశీర్వదించిన వారిలో బిగ్ బాస్ విన్నర్ సన్నీ, ఆర్జే కాజల్, కోయిలమ్మ సీరియల్ హీరోయిన్ తేజస్విని వంటి వారు ఉన్నారు. ఇక త్వరలోనే తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను మానస్ అధికారికంగా షేర్ చేసే అవకాశం అయితే ఉంది.


Click it and Unblock the Notifications











