For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం బ్రహ్మాజి పరిస్థితి మరీ దారుణం.. అందరూ కలిసి అలా ఆడుకున్నారు!!

    |

    ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో యంగ్‌గా కనిపించేది, చలాకీగా ఉండే నటుడు బ్రహ్మాజీ. సినిమా జనంతో పాటు సాధారణ ప్రజలకు కూడా ఆయన వయసు మీద ఓ డౌట్ ఉంటుంది. వయసు పెరుగుతున్నా.. ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తూ.. యాక్టివ్‌గా ఉండటమే ఆయన స్పెషాల్టీ. ఇక యాంకర్ సుమతో బ్రహ్మాజీ కలిసినప్పుడు, ఒకే వేదికను పంచుకున్నప్పుడు లేదా ఏదైనా షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు వయసు గురించి కచ్చితంగా చర్చ వస్తుంది. తాజాగా ఓ గ్యాంగ్ సుమ క్యాష్ షోలో పార్టిసిపట్ చేసింది. అందులో అందరూ కలిసి బ్రహ్మాజీని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

    తాజా ప్రోమో వైరల్..

    తాజా ప్రోమో వైరల్..

    సుమ ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న షోల్లో ‘క్యాష్' క్రేజ్ వేరు. ఇందులో వచ్చే సెలెబ్రిటీలు, చేసే అల్లరి వేరే లెవెల్‌లో ఉంటాయి. తాజాగా ఓ ప్రోమో వదిలారు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ షోలో రాజీవ్ కనకాల, సమీర్, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ పాల్గొనబోతోన్నారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో తెగ ఆకట్టుకుంటోంది.

    ఎంట్రీలోనే పంచ్

    ఎంట్రీలోనే పంచ్

    మామూలుగా ఈ షోలో ఎంట్రీ ఇచ్చేటప్పుడు అందరికీ ఓ సాంగ్ వేస్తుంటారు. అలాగే బ్రహ్మాజీకి వేశారు. భరత్ అనే నేను సినిమాలో ముసలి తాత ముడత మొహం మురిసిపోయేనే (వచ్చాడయ్యో సామీ) అనే పాటను వేయగా.. బ్రహ్మాజీ అలా వణుకుతూ ఉండగా.. రాజా రవీంద్ర, సమీర్ ఇద్దరూ పట్టుకుని వస్తారు. ఇలా రావడానికి కారణం వయసా? నిన్ని నైట్ తీసుకున్నదా? అని బ్రహ్మాజిని చూసిన సుమ కౌంటర్ వేసింది.

    రెండో పంచ్ అలా..

    రెండో పంచ్ అలా..

    ఇక కష్టపడి అలా వచ్చిన బ్రహ్మాజిని చూసి మీ ఆరోగ్యం బాగానే ఉందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 60 యేళ్లు పైబడిన వారు బయట తిరగకూడదంటూ మరో సెటైర్ వేసింది. ఇక ఎంట్రీలో ఇలా రెండు పంచ్‌లు పడేసరికి అందరూ తెగ నవ్వేశారు. రాజా రవీంద్ర, సమీర్ కూడా బ్రహ్మాజిని వదిలిపెట్టలేదు.

    O Pitta Katha Movie Full Interview | Brahmaji About Trivikram Srinivas Talent
    ఈ రోజు ఇచ్చేశాను..

    ఈ రోజు ఇచ్చేశాను..

    మరో సందర్భంలో రాజా రవీంద్ర మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ నీతో ఆడుకుంటున్నార్రా పిచ్చి నా కొడకా అని బ్రహ్మాజీతో కౌంటర్ వేస్తాడు. ఇక ఈ పంచ్‌లన్నీ చూసిన బ్రహ్మాజీ.. ఈ రోజు మీకు ఇచ్చేశా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని అంటాడు. ఇక్కడే ఆడే పెద్ద మనిషి అంటూ మరోసారి, బుడంకాయ్ అంటూ ఇంకోసారి, మీరేమో మంచి పాటలు వేసుకుంటున్నారు మా బ్రహ్మాజికి ముసలోడు ముసలోడు అంటూ వేస్తారా? అని మరోసారి కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. పాపం బ్రహ్మాజీ అందరి కౌంటర్లకు బలయ్యాడు.

    English summary
    Brahmaji Is Humiliated In Suma Cash show, Suma Cash show Is Popular Among telugu states. In Latest Cash Show Brahmaji, Sameer, Raja ravindra And Rajeev kanakala Participated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X