యాంకర్ రష్మీ బండారం బయటపెట్టిన బ్రహ్మాజీ: ముఖం చూపించుకోని విధంగా.. పోలీస్‌ కంప్లైంట్ అంటూ!

తెలుగు టెలివిజన్‌పై వరుసగా షోలు చేస్తూ దూసుకుపోతోన్న యాంకరమ్మలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో గ్లామరస్ హోస్ట్‌గా పేరొందిన యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. చాలా కాలం క్రితమే కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ భామ.. ఇప్పటికీ అదే స్పీడును చూపిస్తూ ముందుకు సాగుతోంది. ఇలా చేతి నిండా షోలు, సినిమాలతో సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా జరిగిన ఓ షోలో యాంకర్ రష్మీ బండారాన్ని ప్రముఖ నటుడు బ్రహ్మాజీ బయట పెట్టేశాడు. దీంతో ఆమె షాకైపోయి నోరెళ్లబెట్టేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

అలా దూసుకుపోతోన్న రష్మీ:యాంకర్‌గా పరిచయం అవడానికి ముందే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి వచ్చింది. అలా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. అలా కెరీర్‌ను సాగిస్తోన్న సమయంలోనే జబర్ధస్త్ యాంకర్‌గా రష్మీకి ఆఫర్ వచ్చింది. ఇందులో తనదైన హోస్టింగ్‌తో అలరించిన ఈ భామ.. సుధీర్‌తో లవ్ ట్రాకుతో మరింత పాపులర్ అయింది. అప్పటి నుంచి హోస్టుగా యమ స్పీడుగా దూసుకెళ్తోంది.

Brahmaji Shocking Comments on Anchor Rashmi Gautam Language

ఒకటే హిట్... గ్యాప్ ఇచ్చేసి:బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా దూసుకుపోతోన్న రష్మీ గౌతమ్.. ఆ మధ్యనే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో 'గుంటూరు టాకీస్' మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. ఆ తర్వాత రష్మీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ హిట్ కాలేదు. దీంతో ఈ అమ్మడు సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది.

మళ్లీ సినిమాలు.. చిరుతోనే:సినీ కెరీర్ సాఫీగా సాగకపోవడంతో విరామం తీసుకున్న రష్మీ గౌతమ్.. ఆ మధ్య 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫలితంగా రష్మీకి మళ్లీ నిరాశే ఎదురైంది. అయితే, ఇప్పుడు రష్మీ షోలతో పాటు కొన్ని సినిమాల్లోనూ నటిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి హీరోగా చేస్తోన్న 'భోళా శంకర్'లో ఆమె ముఖ్య పాత్రను చేస్తోంది.

Brahmaji Shocking Comments on Anchor Rashmi Gautam Language

వరుస షోలు... అందులోనే:గతంలో కేవలం 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' షోకు మాత్రమే హోస్టుగా చేసిన రష్మీ గౌతమ్.. సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంతో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోను కూడా నడుపుతోంది. ఇందులో తనదైన కామెడీతో పాటు గ్లామర్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అలాగే, ఈటీవీలో వచ్చే ఎన్నో స్పెషల్ ఈవెంట్లను కూడా ఆమె హోస్ట్ చేస్తోంది. అలాగే, వేరే ఛానెళ్లలోనూ తెగ సందడి చేసేస్తోంది.

ఆ షోలో గెస్టులు సందడి:ఈ ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ప్రముఖ నటులు బ్రహ్మాజీ, రవిబాబులు గెస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరూ యాంకర్ రష్మీతో కలిసి తెగ సందడి చేశారు. ఆ తర్వాత ఇంద్రజపై పంచులు వేయడం, బుల్లెట్ భాస్కర్ షర్ట్ విప్పడం చూపించారు. దీంతో ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

Brahmaji Shocking Comments on Anchor Rashmi Gautam Language

పోలీస్‌కు కంప్లైంట్ చేస్తూ:వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలోకి డైరెక్టర్ కమ్ యాక్టర్ రవిబాబు తన సినిమా ప్రమోషన్ కోసం పోలీస్‌లా వచ్చాడు. అతడికి ఆ షోలోని వాళ్లందరూ కంప్లైట్ చేసుకోవాలని చెప్పారు. దీంతో ప్రతి ఒక్కరూ ఫన్నీగా కొందరిపై ఫిర్యాదు చేశారు. ఆ సమయంలోనే బ్రహ్మాజీ దొంగతనం చేశాడని ఇంద్రజ ఆరోపించగా.. అతడు అమ్మా అంటూ నవ్వించాడు.

రష్మీ బండారం బయటెట్టి:ఆ తర్వాత బ్రహ్మాజీ స్టేజ్ పైన ఉన్న రవిబాబు దగ్గరకు రష్మీని చేయి పట్టుకుని లాక్కొచ్చి 'ఈవిడ మాట్లాడుతుంటే నా తెలుగు పోతుంది సార్' అని కంప్లైట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ తీసుకొచ్చి 'రష్మీ మేకప్ పోయింది సార్' అని ఫిర్యాదు చేశాడు. ఇలా పలుమార్లు రష్మీని హైలైట్ చేస్తూ బ్రహ్మాజీ పంచులు వేశాడు. ఆయన దెబ్బకు ఈ యాంకరమ్మ షాకై నోరెళ్లబెట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X