యాంకర్ సుమ పక్కా కమర్షియల్.. స్టార్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్
సుమ కనకాల.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు మూడు దశాబ్థాలుగా తెలుగు వినోద రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు సుమ. తన వాగ్ధాటి, పంచ్‌లతో ఎలాంటి వాతావరణాన్ని అయినా జోష్‌గా మార్చేస్తారు సుమ. సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, బుల్లితెరపై ప్రోగ్రామ్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. చిన్నా చితకా హీరోల నుంచి స్టార్ హీరోల వరకు తమ సినిమా ఈవెంట్స్‌లో సుమ కనిపించాల్సిందే. ఇటీవల జరిగిన ఎస్ఎస్ రాజమౌళి- మహేశ్ బాబుల వారణాసి మూవీ ఈవెంట్ గ్లోబ్ ట్రాట్టర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి ఇంటర్నేషనల్ రేంజ్‌కి దూసుకెళ్లారు సుమ. అయితే ఎక్కడికి వెళ్లినా సుమ డామినేషనే కనిపిస్తుండటంతో ఆమెపై రకరకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ సీనియర్ నటుడు సుమపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
బ్రహ్మాజీపై దీపిక సెటైర్లు
ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే కార్యక్రమానికి సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీ చెఫ్ జీవన్ ఈ షోకి జడ్జిగా చేస్తున్నారు. బుల్లితెర సెలబ్రిటీలు మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు, ప్రేరణ కంభం, యష్మి గౌడ, సౌందర్య రెడ్డి, యాదమ్మ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్స్‌గా చేస్తున్నారు. ప్రతివారం ఏదో ఒక థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది చెఫ్ మంత్ర. సుమ పంచ్‌లు, కంటెస్టెంట్స్ నవ్వులతో ఈ కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా జరుగుతోంది. తాజాగా న్యూఇయర్‌ను పురస్కరించుకుని డిఫరెంట్‌గా రెడీ అయ్యింది చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే. ఈ వారం సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ గెస్ట్‌గా వచ్చారు. ఆయనపై బుల్లితెర నటి దీపిక రంగరాజు వేసిన సెటైర్లు ఆకట్టుకున్నాయి.

కోడి పారిపోయిందంటూ సుమ పంచ్‌లు
తొలుత జీవన్, సుమ, బ్రహ్మాజీలు డ్యాన్స్ వేశారు. ఇంతకంటే ఎక్కువ చేస్తే ఆయాస వస్తుందని సుమ చెప్పడంతో అంతా నవ్వేశారు. ఈవినింగ్ స్నాక్స్‌లో తింటాం బజ్జీ.. ఇక్కడికి వచ్చారు బ్రహ్మాజీ అని దీపక పంచ్ విసిరింది. ఇవాళ్టీవీ మీరు చాలా చూడాల్సి ఉంటుందని సుమ అనడంతో బ్రహ్మాజీ నవ్వేస్తారు. ఇంతకీ మీకేం కావాలని సుమ అడగ్గా.. నాటుకోడి పులుసు అని ఆన్సర్ ఇస్తారు బ్రహ్మాజీ. అయ్యో కోడి పారిపోయింది, నార్మల్ కోడి అయినా ఓకే అని బ్రహ్మా అంటాడు. నార్మల్ కోడితోనే పారిపోయిందని పంచ్ విసురుతుంది సుమ.
సుమపై ప్రశ్నల వర్షం
మీకేం కావాలో చెప్పండి అది వండి పెడతామని అంటుంది సుమ. రాజుగారి కోడి పలావ్ అని బ్రహ్మాజీ అడగ్గా.. అది ఎమ్మెల్యేగారు తినేశారు అంటుంది సుమ. పోని ఎమ్మెల్యే దోశ అని బ్రహ్మాజీ అడుగుతాడు. అది రాజుగారు తినేశారు.. సారీ అంకుల్ అంటూ సుమ పంచ్ విసరడంతో బ్రహ్మాజీ షాక్ అవుతాడు. ఆ తర్వాత సుమని వెరైటీగా ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాడు బ్రహ్మాజీ.
కొత్త యాంకర్లని సుమ తొక్కేస్తున్నారు
పాపం ఇక్కడ కొత్త యాంకర్లు, అప్‌కమింగ్ యాంకర్లు పైకి వస్తారు.. వాళ్లని నువ్వు తొక్కేస్తున్నావని బ్రహ్మాజీ అడగ్గా.. ఓకే నెక్ట్స్ క్వశ్చన్ అని సుమ ఆన్సర్ దాట వేస్తుంది. ఎందుకండి మీరు బాగా కమర్షియల్ అయిపోయారని బ్రహ్మాజీ అడగ్గా... మీరు ఈ షోకి ఫ్రీగా వచ్చారా? అని రివర్స్‌లో కౌంటర్ వేస్తుంది సుమ. చాలా వేడిగా కోపంగా ఉన్నారు.. స్టవ్ లేకపోయినా అక్కడ వేడి వేడిగా పొగలు బుస్సు బస్సుమని వస్తున్నాయని బ్రహ్మాజీ అంటాడు. దాంతో ఫైరింజిన్ కావాలా? అని దీపిక అడుగుతుంది. ఆ అమ్మాయిని వేరే లాంగ్వేజికి పంపించేస్తే బెటరేమో అంటాడు.. ఆ అమ్మాయి వేరే లాంగ్వేజ్ నుంచే వచ్చిందని మానస్ చెప్పడంతో బ్రహ్మాజీ అవాక్కవుతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీపిక, బ్రహ్మాజీ, సుమల అల్లరి చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











