Brahmamudi August 14th episode: బంటి ఇంట్లో కళ్యాణ్ దంపతులు.. ధాన్యలక్ష్మి నిర్ణయానికి షాకైన కుటుంబ సభ్యులు!
అప్పుని కాపాడి తీసుకొచ్చిన కళ్యాణ్ ఆమె మెడలో తాళి కడతాడు. కళ్యాణ మండపంలో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అప్పు ని తీసుకుని కళ్యాణ్ అందర్నీ వదిలి వెళ్ళిపోతాడు. అప్పు ఫ్రెండ్స్ రూమ్ లో ఇద్దరూ తల దాచుకుంటారు. అప్పు ని వదిలేసి కళ్యాణ్ ని మాత్రమే ఇంటికి తీసుకురమ్మని గొడవ చేస్తుంది ధాన్యలక్ష్మి. ఆమె నిర్ణయాన్ని కుటుంబ సభ్యులందరూ తప్పు పడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 14 వ తేదీ ఎపిసోడ్ 488 లో ఏం జరిగిందంటే..
గుడిలో కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు కళ్యాణ్ దంపతులు. అప్పు నవ్వుతూ మా అమ్మ పూజ చేసిన తర్వాత ప్రసాదం పెడతాను రావే అంటే వద్దు అనేదాన్ని, ఇప్పుడు మనకి అదే గతి అయింది అంటుంది. నా వల్లే కదా నీకు ఈ పరిస్థితి అంటాడు కళ్యాణ్. నాకోసం నువ్వు ఆస్తినంతా వదిలేసి వచ్చేసావు మరి నేనేం అనుకోవాలి అంటుంది అప్పు. ఇక మీదట ఎక్కడ ఉండాలి అని ఆలోచనలో పడతారు కళ్యాణ్ దంపతులు. అంతలోనే అప్పు మాట్లాడుతూ గుడిలో దేవత ఈ సరస్వతీ పుత్రుడికి ఏదో ఒక రూపంలో సాయం చేస్తుంది అని చెప్తుంది.

వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగానే కావ్యకి అప్పు వాళ్ళని చూపిస్తాడు బంటి. సరే నేను చెప్పినట్లు చెయ్యి, నేను సహాయం చేస్తున్నట్లుగానీ, నేను చెప్పినట్లే నువ్వు చేస్తున్నావని గాని వాళ్లకి ఏమాత్రం అనుమానం రాకూడదు అంటుంది కావ్య. నువ్వే చూస్తావు కదా అక్క అంటూ గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్నట్లుగా చేస్తూ అప్పు వాళ్ళ కంట్లో పడతాడు బంటి. అప్పు బంటిని పలకరిస్తుంది, మీరేంటక్క ఇక్కడ ఉన్నారు అని ఏమీ తెలియని వాడిలాగా ప్రశ్నించి మాటల్లో వాళ్ళని తన రూమ్ లో ఉండటానికి ఒప్పిస్తాడు బంటి.
ముగ్గురు కలిసి బంటి రూమ్ కి బయలుదేరుతారు. ఇదంతా చాటుగా చూస్తున్న కావ్య ఆనంద పడుతూ దేవుడికి దండం పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి మరిది గారు బయట ఉంటే జీవితం గురించి తెలుసుకుంటారు, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి జీవితంలో పైకి వస్తారు, భార్యని పోషించుకోవడానికి అయినా ఒక బ్రతుకుతెరువు చూసుకుంటారు, అందుకే ఆయనని ఇంట్లోకి పిలవడానికి ఇష్టపడటం లేదు.
ఆయన జీవితంలో పైకి ఎదగాలి అదేనా ఆశయం, దానికి నీ ఆశీస్సులు కూడా తోడవ్వాలి అని దేముడిని ప్రార్థిస్తుంది కావ్య. మరోవైపు బాధగా ఉన్న ధాన్య లక్ష్మీ దగ్గరికి వెళ్లి అంతగా అరిచావు, ఇంకా కోపం తగ్గలేదా అంటుంది రుద్రాణి. నేను ఎంత ఏడ్చినా కళ్యాణ్ అయితే రాడు కదా అంటుంది ధాన్యలక్ష్మి. అందుకే కొడుకుని ఇంటికి రప్పించుకోవడానికి నువ్వు కోడల్ని కూడా ఇంటికి రావడానికి అనుమతించాలి, ఆమెని కోడలిగా ఒప్పుకోకపోయినా ఒప్పుకుంటున్నట్లు నటించాలి.
వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత అప్పు ని బయటికి పంపించడానికి నీకు తోడుగా నేను ఉంటాను కదా అంటుంది రుద్రాణి. నిజమే అప్పు కోసం నా కొడుకుని నేను ఎందుకు వదులుకోవాలి, ఇప్పుడే నువ్వు చెప్పినట్లు చేస్తాను, కళ్యాణ్, అప్పు ఇంటికి వచ్చిన తర్వాత అప్పు ని ఇంట్లోంచి తరిమేస్తాను అంటూ ప్లాన్ అమలుపరచడానికి వెళుతుంది ధాన్యలక్ష్మి. తర్వాత రాహుల్ తల్లి దగ్గరికి వచ్చి ఆ కళ్యాణ్ ని అసలు ఇంటికి రానివ్వను అని రాత్రి చెప్పావు, ఇప్పుడేంటి ఇలాంటి సలహాలు ఇస్తున్నావు అంటాడు.

శాశ్వతంగా వాళ్లు ఇంటికి దూరం అవటం కోసమే ఇదంతా చేస్తున్నాను, ధాన్యలక్ష్మి చెప్పినంత మాత్రాన కావ్య అప్పు ని ఇంటికి తీసుకు రావడానికి ఒప్పుకోదు, మెల్లమెల్లగా ఇంట్లో వాళ్ళందరూ కావ్యకి వ్యతిరేకంగా మారుతారు. ఇప్పుడు ధాన్యలక్ష్మి వెళ్ళింది కదా ఏం జరుగుతుందో చూడు అప్పుడు పూర్తిగా నీకే అర్థమవుతుంది అంటుంది రుద్రాణి. మరోవైపు బంటి కళ్యాణ్ దంపతులని తన రూమ్ కి తీసుకువెళ్తాడు.రూమ్ లో ఉండటానికి హౌస్ ఓనర్ అబ్జెక్ట్ చేస్తాడు.
హౌస్ ఓనర్ భార్యతో చెప్పి హౌస్ ఓనర్ నోరు మూయించి కళ్యాణ్ వాళ్ళని ఇంట్లోకి తీసుకు వెళ్తాడు బంటి. మరోవైపు కళ్యాణ్ తో పాటు అప్పు ని కూడా ఇంట్లోకి తీసుకురావడానికి ఒప్పుకుంటున్నాను, నేను వెళ్లి పిలిస్తే రాడు అందుకే నువ్వు వెళ్లి పిలువు అని రాజ్ తో చెప్తుంది ధాన్యలక్ష్మి. ఈ బుద్ధి మీకు పుట్టిందేనా,రాత్రి జీవితంలో అప్పుని కోడలుగా ఒప్పుకోను అన్నారు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటుంది స్వప్న.
కావ్య కూడా ధాన్యలక్ష్మి నిర్ణయాన్ని అనుమానిస్తుంది. కారణం ఏదైతేనేమి ధాన్యలక్ష్మి ఒప్పుకుంది కదా వెళ్లి కళ్యాణ్ వాళ్ళని తీసుకురా అని రాజ్ తో అంటాడు సుభాష్. రాజ్ ఆనందంగా సరే అంటూ కావ్యను కూడా తనతో పాటు రమ్మంటాడు. కానీ కావ్య అందుకు ఒప్పుకోదు. ఇంట్లో వాళ్ళందరూ కావ్య ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా కావ్య ఒప్పుకోదు. ఇది చిన్నత్తయ్య నిర్ణయం ఇందులో నేను జోక్యం చేసుకోలేను అంటుంది.
తరువాయి భాగం లో కళ్యాణ్ వాళ్ళ రూమ్ కి వచ్చిన రాజ్ ఇందులోనే ఉందాం అనుకుంటున్నారా అంటాడు. ఇది ఇద్దరికీ సరిపోతుంది అంటాడు కళ్యాణ్. ఇది బంటి రూమ్ అని చెప్తుంది అప్పు. పిన్ని మీ ఇద్దర్ని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంది,పదండి మన ఇంటికి వెళ్దాం అంటాడు రాజ్. తర్వాత ఒంటరిగా ఇంటికి వచ్చిన రాజ్ ని కళ్యాణ్ వాళ్ళు ఏరి అని ధాన్యలక్ష్మి దంపతులిద్దరూ అడుగుతారు.


Click it and Unblock the Notifications











