Brahmamudi july 30th episode: తప్పంతా కావ్యదే అంటున్న రాజ్.. అల్లుడు కాళ్లు పట్టుకోబోయిన కనకం!
కళ్యాణ్ ప్రేమ గురించి తెలుసుకున్న రాజ్ అతని ప్రేమని గెలిపించాలనుకుంటాడు. అప్పుకి పెళ్లి చూపులు అని తెలిసి హర్ట్ అవుతాడు కళ్యాణ్. తనకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల కోసం పెళ్లికి ఒప్పుకుంటుంది అప్పు. కావ్య తన చెల్లెల్ని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుందని కావ్య తో గొడవపడుతుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ మనసులో అప్పు ఉందని అందరి ముందు చెప్తాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 30వ తేదీ ఎపిసోడ్ 475లో ఏం జరిగిందంటే..
నువ్వు నాకు ఇచ్చిన మాట సంగతేమిటి అని కావ్యని అడుగుతుంది ధాన్యలక్ష్మి. నా చెల్లెలికి ఏమవసరం అంటుంది స్వప్న. మీ ఇద్దరూ మీ ఇంటి కోడలు ఇంట్లో వాళ్ళు ఇష్టప్రకారమే అయ్యారా అని వెటకారంగా అంటుంది రుద్రాణి. ఆమెపై కోప్పడుతుంది స్వప్న. రాహుల్ స్వప్నని కోప్పడతాడు. మీ అమ్మని అంటే నీకు అంత కోపం వచ్చింది కదా మరి మా అమ్మని అంటే నాకు ఎంత కోపం రావాలి అంటుంది స్వప్న. కావ్య వాళ్ళని వారించి కళ్యాణ్ తో మాట్లాడుతూ వింటున్నారు కదా వీళ్ళ మాటలు మీ అమ్మగారికి నచ్చిన సంబంధం మీరు చేసుకుంటేనే వీళ్ళ నోళ్లు మూతపడతాయి అంటుంది. ఇప్పుడు నాకు ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది.

నేను మళ్ళీ పెళ్ళికి సిద్ధంగా లేను నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఆ వెనకే రాజ్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఎందుకలా అబద్ధం చెప్పావు, జీవితం మళ్లీ మళ్లీ అవకాశాన్ని ఇవ్వదు, మీ వదిన మాటలకి భయపడి నీ మనసులో ప్రేమని దాచేసుకుంటున్నావా అంటాడు. లేదు అన్నయ్య నీతో మాట్లాడిన తర్వాత నేను అప్పు తో మాట్లాడాను తను ఇష్టప్రకారమే ఆ పెళ్లి చేసుకుంటుందంట అలాంటప్పుడు ఇక నా ప్రేమను బయటపెట్టి మాత్రం ఏం ప్రయోజనం నా రాతలో లేని ప్రేమ నా జీవితంలోకి ఎలా వస్తుంది అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్.
ఇదంతా ఆ కళావతి వల్లే, కళ్యాణ్ మనసులో లేనిపోని భయాలు అన్ని క్రియేట్ చేసింది తన సంగతి చెప్తాను అనుకుంటూ భార్య దగ్గరికి వెళ్లి నీవల్లే కళ్యాణ్ అలా మాట్లాడాడు, కళ్యాణ్ మనసులో అప్పు, అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడని మనకి తెలుసు వాళ్ళిద్దర్నీ దూరం చేసి వాళ్ళు బాధపడుతుంటే ఆ పాపం నీకే తగులుతుంది అంటాడు. అప్పు మనసులో ఏముందో మీకు తెలుసా, తను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నాను అని మీకు చెప్పిందా అంటూ భర్త పై కేకలు వేస్తుంది కావ్య.

తనతో విడిగా మాట్లాడలేదు మాట్లాడి ఉంటే తన మనసులో మాట చెప్పేది అంటాడు రాజ్. అయితే వెళ్లి తెలుసుకుని రండి తనకి ఇష్టమైతే వాళ్ల పెళ్లి చేయడానికి మీతో పాటు నేను కూడా సిద్ధం అంటుంది కావ్య. సరే అంటూ కనకం ఇంటికి బయలుదేరుతాడు రాజ్. ఈ మాటలు విన్న రుద్రాణి చాటు నుంచి వింటుంది, కనకానికి ఫోన్ చేసి భలే ప్లాన్ చేశావు, మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగానే నీ మూడో కూతుర్ని కూడా ఈ ఇంటికి కోడలు చేస్తున్నావు అని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది.
అప్పుకి నాకు నచ్చిన వాడితో పెళ్లి ఫిక్స్ చేశాను, అదే జరుగుతుంది అంటుంది కనకం. కానీ రాజ్ నీ దగ్గరికి అప్పు కళ్యాణ్ ల గురించి మాట్లాడటానికి వస్తున్నాడు అతని మాటని కాదనగలవా అంటుంది రుద్రాణి. ఎవరు ఏం చేసినా అప్పుకి నేను చూసిన సంబంధమే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. రుద్రాణి ఆనందపడుతూ రాజ్ ఎన్ని చెప్పినా కనకం చచ్చినా పెళ్లికి ఒప్పుకోదు అనుకుంటుంది.

రాజ్ కనకం ఇంటికి వెళ్లి ప్రేమిస్తున్నాడు అంటూ వాళ్ల పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ కనకం ఒప్పుకోదు, ఈ పెళ్లి అప్పు ఇష్ట ప్రకారమే జరుగుతుంది కావాలంటే మీరే అడగండి అంటూ అప్పుని పిలుస్తుంది. అప్పు ఈ పెళ్లి తన ఇష్టప్రకారమే జరుగుతుంది అని చెప్తుంది. రాజ్ ఇంకా ఏదో మాట్లాడబోతే మీ కాళ్లు పట్టుకుంటాను ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అంటూ అల్లుడు కాళ్లు పట్టుకోబోతుంది.
పక్కకి తప్పుకున్న రాజ్ మీ కూతురు జీవితాన్ని మీరే నాశనం చేయటానికి నా కాళ్లు పట్టుకోవడం ఎందుకు అంటాడు. మరోవైపు కావ్య ఇంట్లో వాళ్ళందరూ రాజ్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. రాజ్ ఇంటికి వచ్చేసరికి మీ పిన్ని, రుద్రాణి అత్త వాళ్ళు మీ కోసమే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఆస్తి కొట్టేయటానికి ఆ ఇంటి పిల్లని ఈ ఇంటి కోడలు చేయడానికి ఎన్ని మంతనాలు జరుగుతున్నాయో అన్నీ తెలుసుకునే వచ్చారు కదా అంటుంది కావ్య.

తరువాయి భాగంలో బంటి పరుగెత్తుకుంటూ వచ్చి కళ్యాణ్ కి యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ లో జాయిన్ చేశారు అని అప్పు కి చెప్తాడు. అప్పు పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వెళుతుంది, అక్కడ కళ్యాణ్ ని కలవనివ్వడు రాజ్. నీకు కళ్యాణ్ అంటే ఇష్టం లేదు కదా ఇప్పుడు అతడిని కలవవలసిన అవసరం ఏముంది అంటాడు. నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నాను అంటుంది అప్పు. గోడ చాటుగా ఉన్న కళ్యాణ్ ఆ మాటలు వింటాడు.


Click it and Unblock the Notifications











