Brahmamudi August 16th episode: ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతున్న రుద్రాణి.. రోడ్డుపై కళ్యాణ్ పరిస్థితి దారుణంగా!
అప్పు ఫ్రెండ్స్ రూమ్ లో అప్పు దంపతులిద్దరూ తల దాచుకుంటారు. అప్పు ని వదిలేసి కళ్యాణ్ ని మాత్రమే ఇంటికి తీసుకురమ్మని గొడవ చేస్తుంది ధాన్యలక్ష్మి. అప్పు వాళ్ళకి తన ప్రమేయం ఉందని తెలియకుండా వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేస్తుంది కావ్య. కళ్యాణ్ ఇంటికి వెళ్లిన రాజ్ పిన్ని మీ ఇద్దరినీ ఇంటికి తీసుకురమ్మంది అని తనతో పాటు రమ్మంటాడు. కానీ కళ్యాణ్ దంపతులు అందుకు ఒప్పుకోరు.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 16వ తేదీ ఎపిసోడ్ 490 లో ఏం జరిగిందంటే..
ఇంటికి వచ్చిన రాజ్ ని కళ్యాణ్ ఎందుకు రాలేదు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి. నువ్వు వాళ్ళిద్దర్నీ పిలిచావు అంటే కళ్యాణ్ నమ్మటం లేదు పిన్ని, తన కోసమే అప్పుని రమ్మంటున్నావు అనుకుంటున్నాడు అంటాడు రాజ్. అది నిజమే కదా అంటుంది స్వప్న. ఇద్దరినీ పిలిచానని స్పష్టంగా చెప్పలేదా అంటుంది ధాన్యలక్ష్మి. చాలా క్లియర్ గా చెప్పాను కానీ వాడు అంతకంటే క్లియర్ గా ఉన్నాడు అంటాడు రాజ్.

అసలు ఏమైంది వాడికి అంటాడు ప్రకాష్. అనుభవం అయింది, సంసారంలో మరొక మనిషి జోక్యం చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు వస్తాయో వాడికి తెలిసి వచ్చింది, ఈ రుద్రాణి, ధాన్యలక్ష్మి వాళ్లని సజావుగా సంసారం చేసుకోనివ్వరని అనుభవం నేర్పింది అంటుంది ఇందిరాదేవి. అనామిక అనుమానించినట్లే జరిగింది, ఆ పిల్ల అనుమానించడంలో తప్పులేదు.
కానీ ప్రవర్తించిన విధానమే తప్పు అంటుంది ధాన్యలక్ష్మి.ఇప్పుడు ఆ దరిద్రం గురించి మాట్లాడుకోవడం ఎందుకు అని తోటికోడల్ని మందలిస్తుంది అపర్ణ. ఏ కారణంతో వాడు రానన్నాడో చెప్పు అంటుంది ఇందిరా దేవి. మా అమ్మ నా కోసమే అప్పు ని ఇంటికి రమ్మంటుంది, అంతేకానీ తను ఎప్పటికీ అప్పుని కోడలిగా ఒప్పుకోదు, అమ్మ అప్పు ని కోడలుగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని స్వయంగా వచ్చి పిలిస్తే వస్తానన్నాడు అంటాడు రాజ్.

అయితే ఇప్పుడు వెళ్లి రాజ్యలక్ష్మి కళ్యాణ్ కాళ్లు పట్టుకోవాలా అని వంకరగా మాట్లాడుతుంది రుద్రాణి. మీకు ఇలాంటి నెగటివ్ ఆలోచనలు ఎలా వస్తాయి అంటూ అత్తని కోప్పడుతుంది స్వప్న. నా కొడుకు బయట కష్టపడుతుంటే ఇంటి కోడళ్లు మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నారు, మనం ఆస్తినంత కనకం కూతుర్లకి కట్టబెట్టడానికే కూడబెట్టినట్లు ఉన్నాము. నా కొడుకుని నా నుంచి దూరం చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడరు అని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. మరోవైపు ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటాడు కళ్యాణ్.
ఎక్కడా దొరకపోవడంతో రోడ్డుమీద బెంజి పక్కన కూర్చుంటాడు. అక్కడికి బొమ్మలు అమ్మే తాత వచ్చి కూర్చుంటాడు. అతడి కష్టం తెలుసుకున్న రాజ్ నేను ఈ బొమ్మలు అమ్మి పెడతాను అని ఆ బొమ్మలని అమ్మటం ప్రారంభిస్తాడు. అదే సమయంలో రుద్రాణి కారులో వెళ్తూ నీ కొడుకు ఎలాంటి పరిస్థితులలో ఉన్నాడో చూపించడానికి నిన్ను తీసుకు వెళుతున్నాను, అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నువ్వు ఒక నిర్ణయం తీసుకో అని ధాన్యలక్ష్మితో చెప్తుంది. అదే సమయంలో రోడ్డు మీద కళ్యాణ్ బొమ్మల అమ్ముతూ కనిపించడంతో ధాన్య లక్ష్మికి చూపిస్తుంది రుద్రాణి .

నీ కొడుకు ఇక్కడ రోడ్డు మీద బొమ్మల అమ్ముకుంటూ కష్టపడుతుంటే అక్కడ రాజ్ మాత్రం రాజభోగాలు అనుభవిస్తున్నాడు. వెళ్లి నీ తోటి కోడల్ని, అత్తమామల్ని, రాజ్ ని నిలదీయు అని ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి ఇంటికి తీసుకు వెళుతుంది రుద్రాణి. మరోవైపు గదిలోకి వచ్చిన రాజ్ తో మీతో పాటు కళ్యాణ్ ని పిలవడానికి రాలేనందుకు తిట్టడం ప్రారంభించండి అంటుంది కావ్య. నువ్వు అనుకున్నంత మాత్రాన వదిలేస్తాను అనుకుంటున్నావా.. కళ్యాణ్ అప్పుడు రాకపోవడానికి, ఇప్పుడు రాకపోవడానికి కారణం నువ్వే అని భార్యపై కోప్పడతాడు రాజ్.
నువ్వు సాయం చేసినా చెయ్యకపోయినా వాళ్లకు నేను సాయం చేస్తూనే ఉంటాను, వాడిని జీవితంలో ఎప్పటికైనా గొప్పవాడిని చేసే ఈ ఇంటికి తీసుకు వస్తాను అంటాడు. మీ హెల్ప్ తో ఆయన పైకి వస్తే ఇంక కవిగారికి ఇండివిడ్యువాలిటీ ఏముంటుంది, ఆయన స్వయంగా ఎదగాలని కదా నా తాపత్రయం అనుకుంటుంది కావ్య. మరోవైపు రోడ్డు మీద వెళ్తున్న కళ్యాణ్ కి రోడ్డు మీద పుస్తకాలు అమ్మే షాపులో తన రాసిన కవితల పుస్తకం కనిపిస్తుంది. అది చూసి సంతోషిస్తాడు కళ్యాణ్.

తరువాయి భాగంలో నా కొడుకు అక్కడ కష్టాలు పడుతుంటే ఇక్కడ రాజ్ రాజ భోగాలు అనుభవిస్తున్నాడు అంటుంది ధాన్యలక్ష్మి. వాడు బయట ఉంటే న్యాయం ఎలా చేస్తాం అంటాడు ప్రకాష్. ఆస్తిని ముక్కలు చేయాలి అంటుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ ఇంటికి వచ్చేవరకు రాజ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు అని చెప్తాడు సీతారామయ్య.


Click it and Unblock the Notifications











