Brahmamudi August 29th episode : శ్రీమతికి సెలవు ప్రకటించిన రాజ్.. రాహుల్ ట్రాప్ లో ఇరుక్కున్న స్వప్న!

ఇంట్లోకి వచ్చిన అప్పుని ఘోరంగా అవమానిస్తుంది ధాన్యలక్ష్మి. అయినా మౌనంగా భరించి పూజ ముగించిన తర్వాత ఇల్లు విడిచి వెళ్ళిపోతారు కళ్యాణ్ దంపతులు. ఇదంతా గమనించిన రాజ్ వాళ్ళు ఇంటికి రాకపోవడమే మంచిది అని భార్య తో అంటాడు. తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అప్పు కి థాంక్స్ చెప్తాడు కళ్యాణ్. అప్పు వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్న రాహుల్ కి రుద్రాణి కి చుక్కలు చూపిస్తుంది స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఆగష్టు 29వ తేదీ ఎపిసోడ్ 501లో ఏం జరిగిందంటే..

మీ గది బాగుంది మేము కూడా పెళ్లయిన కొత్తలో ఇలాంటి గదిలోనే ఉండే వాళ్ళము కానీ తృప్తిగా ఉండేవాళ్ళం, మిమ్మల్ని చూసినా కూడా తృప్తిగా ఉంది అంటుంది కనకం. ఇక బయలుదేరుతాం అన్న కృష్ణమూర్తిని ఒక పూట కూడా ఉండకుండానే వెళ్ళిపోతున్నారు అంటాడు కళ్యాణ్. ఒక పూట పని చేయకపోతే రెండో పూట భోజనం గడవని చిన్న బతుకులు మావి అంటాడు కృష్ణమూర్తి. తరువాత మీ పెళ్లి సమయంలో చేతిలో డబ్బు లేక ఏమీ ఇవ్వలేకపోయాను అంటూ అప్పు చేతిలో డబ్బు ఉంచబోతుంది కనకం.

Brahmamudi Episode number 501 August 29th 2024 Rudrani can t bear Raj and Kavya being happy together

కానీ అప్పు తీసుకోవటానికి ఇష్టపడదు, కూతుర్ని మందలించి ఆమె చేతిలో డబ్బు పెట్టి బయటకు వచ్చేస్తారు కనకం దంపతులు. బయటికి వచ్చిన తర్వాత మనం ఉండనందుకు అల్లుడు బాధపడతాడేమో ఉంటాడు కృష్ణమూర్తి. ఉంటేనే బాధపడతారయ్యా అంటూ శనగల గురించి చెప్తుంది కనకం. పోనీలే చేతిలో కొంత డబ్బు పెట్టావు కదా నాలుగు రోజులు గడిచిపోతుంది ఈలోపు అల్లుడు ఉద్యోగం చూసుకుంటాడు అంటాడు కృష్ణమూర్తి. మరోవైపు అప్పు కళ్యాణ్ కి డబ్బులు ఇచ్చి ఇంటికి కావలసిన సరుకులు తీసుకురమ్మంటుంది. అది నీ డబ్బు నేను తీసుకోను అంటాడు కళ్యాణ్.

Brahmamudi Episode number 501 August 29th 2024 Rudrani can t bear Raj and Kavya being happy together

మా అమ్మ ఏమి ఎకరాలు రాయలేదు, మన పరిస్థితి చూసే ఈ డబ్బు నా చేతిలో పెట్టింది అంటుంది అప్పు. ఒక విషయం అర్థమైంది నేను దొరికిన పని ఏదో ఒకటి చేసే డబ్బులు సంపాదించాలి, అంతేగాని నిన్ను ఇలా ఇబ్బంది పెట్టలేను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. మరోవైపు హల్ మధ్యలో కూర్చొని క్యారం బోర్డు రెడీ చేస్తూ ఉంటాడు రాజ్, అటుగా వెళుతున్న భార్యని పిలిచే తనతో పాటు ఆడ మంటాడు. మీరేంటి ఇలా క్యారం బోర్డు ఓపెన్ చేశారు అంటుంది కావ్య.

చేయడానికి పని లేదు అందుకే కాసేపు ఆడుకుందామని అంటాడు రాజ్. కానీ తనకి పని ఉందని ఆడటం కుదరదని చెప్తుంది కావ్య పని కోసం శాంత ఉంది కదా ఈరోజు నీకు సెలవు ప్రకటిస్తున్నాను నువ్వు కూర్చో అంటూ కావ్యని ఆటకి కూర్చోబెడతాడు రాజ్. అప్పుడే అక్కడికి చిట్టి, అపర్ణ వస్తారు. మాకు కాఫీలు లేవా అని అడుగుతారు. ఈరోజు మా ఆవిడకి సెలవు అంటూ శాంతకి కాఫీలు తెమ్మని పురమాయిస్తాడు. అయితే మేము కూడా ఆడతాం అంటారు అపర్ణ, చిట్టి.

Brahmamudi Episode number 501 August 29th 2024 Rudrani can t bear Raj and Kavya being happy together

అప్పుడు అపర్ణ, కావ్య ఒక టీంగా చిట్టి, రాజ్ ఒక టీంగా డివైడ్ అవుతారు. అంతలోనే మిగిలిన కుటుంబ సభ్యులందరూ వచ్చి నవ్వుకుంటూ గేమ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కిందికి వస్తున్న ధాన్యలక్ష్మి ని చూసి చూసావా వాళ్ళు కళ్యాణ్ ఇంట్లోంచి వెళ్లిపోయాడని బాధ కూడా లేకుండా ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో అని రెచ్చగొడుతుంది రుద్రాణి. రాత్రి నువ్వు నీ కొడుకు కూడా ఆ పనే చేశారు కదా, చెంప దెబ్బ కొట్టినా సిగ్గు లేకుండా నవ్వుతూనే ఉన్నారు అంటుంది ధాన్యలక్ష్మి.

నువ్వు బాధలో ఉంటే మేము నవ్వుతామని ఎలా అనుకున్నావు, అదంతా నీకు సపోర్ట్ చేసినందుకు నా కోడలు చేసిన నిర్వాకం అంటూ జరిగింది చెప్తుంది రుద్రాణి. తర్వాత ధాన్యలక్ష్మి వాళ్ళందరి దగ్గరికి వెళ్లి నిలదీయాలి అనుకుంటుంది,కానీ రుద్రాణి ఆపి ఇది సరైన సమయం కాదు టైం వచ్చినప్పుడు మాట్లాడాలి అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. తర్వాత రుద్రాణి రాజ్ వాళ్ళ దగ్గరికి వచ్చి టిఫిన్ ప్రోగ్రామ్ లాంటివి ఏమీ లేవా అని అడుగుతుంది.

అప్పుడే రాజ్ ఆర్డర్ పెట్టిన టిఫిన్స్ రావటంతో నీకు ఆకలి వేస్తుందేమో వెళ్లి తిను అని వెటకారంగా అంటాడు ప్రకాష్. తర్వాత తన గదిలోకి వచ్చిన రుద్రాణి కోపంతో రగిలిపోతూ వాళ్ళిద్దరూ అంత ఆనందంగా ఉండడాన్ని చూస్తే కడుపు మంటగా ఉంది అంటుంది రుద్రాణి. పోనీలే మమ్మీ వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే కంపెనీ వ్యవహారాలలో జోక్యం చేసుకోరు, అప్పుడు కంపెనీ లో మనం ఏం చేసినా పట్టించుకోరు అంటాడు రాహుల్.

Brahmamudi Episode number 501 August 29th 2024 Rudrani can t bear Raj and Kavya being happy together

అలా అని ఇద్దరు ఇంట్లో కలిసి ఉంటే మనకి ప్రమాదం అందుకే రాజ్ కి కావ్య మీద కోపం వచ్చేలాగా చేయాలి అంటుంది రుద్రాణి. ఏం చేద్దాం అంటాడు రాహుల్. అప్పట్లో దొంగ బంగారం వ్యాపారం చేయాలనుకున్నావు కదా అదే ఇప్పుడు చేస్తున్నట్లుగా స్వప్నని నమ్మించు, అది వెళ్లి కావ్యకి చెప్తుంది, కావ్య రాజ్ కి చెప్తుంది. కానీ రాజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం ఆ పని చేయడం లేదు అని నిరూపించుకుంటే రాజ్ కావ్య ని అసహ్యించుకుంటాడు అంటుంది రుద్రాణి.

ఆ పని మీదే ఉంటాను అంటూ తన గదికి వెళ్లి గతంలో దొంగ బంగారం వ్యాపారం చేయాలనుకున్న ఫైల్ తీసి దాన్ని చూస్తూ ఇప్పుడు నా పెళ్ళాన్ని ఎలా పిచ్చిదాన్ని చేస్తాను చూడు అనుకుంటూ బయటికి వస్తాడు. కానీ అంతలోనే స్వప్న ఇటుగా రావడం గమనించి ఆమె వినే టట్లుగా దొంగ బంగారం వ్యాపారం గురించి మాట్లాడుతాడు రాహుల్. అతను వాష్ రూమ్ కి వెళ్ళిన తరువాత ఫైల్ చూసిన స్వప్న అతని మాట్లాడింది నిజమే అనుకొని కంగారుగా కావ్య దగ్గరికి వెళ్తుంది. ఇది గమనించిన రాహుల్ స్వప్నను చూసి నవ్వుకుంటాడు. పనిలో ఉన్న కావ్య దగ్గరికి వెళ్లి స్వప్న తను చూసిందంతా చెప్తుంది.

తరువాయి భాగంలో రాహుల్ దొంగ బంగారం వ్యాపారం గురించి రాజ్కి చెప్తుంది కావ్య. మీరు నా మీద వేస్తున్న నిందలకి సాక్ష్యం ఏమిటి అని అడుగుతాడు రాహుల్. సాక్ష్యం నీ చేతిలోనే ఉంది అంటుంది కావ్య. అప్పుడు స్వప్న రాహుల్ చేతిలో ఫైల్ తీసి రాజ్ కి చూపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X