‘దీపికా రాయ్ అయిపోతా... లైఫ్ ఎండింగ్ వరకు ఆయనతోనే’

స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి ధారావాహికతో తెలుగువారికి దగ్గరయ్యారు తమిళ నటి దీపిక రంగరాజు. తన సహజ నటనతో ఈ సీరియల్‌ సూపర్ హిట్ కావడం వెనుక ఆమె కీలకపాత్ర పోషించారు. తెలుగులో ఈ ఒక్క సీరియల్‌లోనే దీపిక నటిస్తున్నారు. అయినప్పటికీ ఆమెకు రెండు రాష్ట్రాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. తను ఎక్కడుంటే అక్కడ వాతావరణంలో మంచి జోష్ తీసుకొస్తారు దీపిక. వచ్చి రానీ తెలుగులో మాట్లాడుతూ నవ్విస్తుంటారు. అప్పుడప్పుడు పలు షోలకు హాజరవుతూ సందడి చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా స్టార్ మాలో ప్రసారమవుతున్న కుకు విత్ జాతిరత్నాలు షోలో పాల్గొని అల్లరి చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

కుకు విత్ జాతిరత్నాలు సీజన్ 2లో ఇప్పటి వరకు శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణ్ పడాల, పల్లవి రామిశెట్టి, తేజస్విని గౌడలు ఎలిమినేట్ అయ్యారు. దాంతో ప్రేక్షకులను అలరించడానికి ఈ షోని కొత్తగా అప్‌డేట్ చేసి కుకు విత్ జాతి రత్నాలు సీజన్ 2లో 2.0 అంటూ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా నలుగురు కుక్స్‌ని వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఆహ్వానించారు. వీరిలో బిగ్‌బాస్ పునర్నవి, పొదరిల్లు సీరియల్ ఫేమ్ కృతిక, శ్రవణ్, సుమిత్ రాయ్ ఉన్నారు. వీరి రాకతో షో మొత్తం కలర్ ఫుల్‌గా నిండటంతో పాటు అవినాష్, ఎక్స్‌ప్రెస్ హరి అల్లరి నవ్వించారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Brahmamudi Fame Deepika Rangaraju Creates Fun Moments in Cooku With Jathirathnalu Promo

ఇప్పటి నుంచి కుకు విత్ జాతిరత్నాలు డబుల్ డోస్‌తో ఉండబోతోందని ప్రదీప్ మాచిరాజు అన్నాడు. తొలుత రోహిణి.. ప్రదీప్ దగ్గరికి వెళ్లి నీ కోటు ఇస్తే నిఖిల్‌కి ఇస్తా పాపం వాడిది చినిగిపోయిందని అంటుంది. నీ పర్ఫార్మెన్స్ చూసి వేరే వాళ్లు చించుకోవాలి కానీ నువ్వే చించుకుంటున్నావని సెటైర్ వేస్తాడు హరి. ఆ వెంటనే రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. హరికి కుకింగ్‌లో అవకాశం ఇవ్వమంటున్నాడని, మీరు దయ చూపిస్తే అని బతిమలాడతాడు. నీకు ఇచ్చినందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు అని సెటైర్లు వేస్తాడు ఇమ్మాన్యుయేల్.

ఈరోజు వెరైటీలో గుంటూరు గొంగూర బిర్యానీ చెప్పమని జడ్జిలను రాకేష్ అడుగుతాడు. షో స్టార్ట్ అయినప్పటి నుంచి అదే చెబుతున్నావు.. వేరేది చెప్పవా అని అలీ మండిపడతాడు. ఆ వెంటనే నలుగురు కుక్స్ ద్వారా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారు. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం.. వెజ్, నాన్ వెజ్ వండుతాను. కానీ నాకు మాత్రం బీట్‌రూట్ రసం, చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టమని పునర్నవి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. తర్వాత సుమిత్ రామ్‌తో దీపిక రంగరాజు డ్యాన్స్ చేసి విసిగిస్తుంది. టెలివిజన్ చరిత్రలో సుమిత్ ఇప్పటి వరకు భయపడటం నేను చూడలేదు.. కానీ ఫస్ట్ టైం కొంచెం జంకాడు అంటూ ప్రదీప్ పంచ్‌లు వేస్తాడు.

ఈ షో ఎండ్ అయ్యే వరకు సుమిత్‌కి జాతిరత్నంగా దీపిక ఉండాలని అలీ కండీషన్ పెడతాడు. సీజన్ ఎండింగ్ కాదు సార్.. లైఫ్ ఎండింగ్ వరకు ఉంటా. సుమిత్ రాయ్‌ని పెళ్లి చేసుకుంటే దీపికా రాయ్ అయిపోతానని చెబుతుంది దీపిక రంగరాజు ఆ మాటలతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరి కుకు విత్ జాతిరత్నాలు డబుల్ డోస్ ఎలా ఉండబోతోంది? జాతిరత్నాలు అల్లరి ఎలా ఉండబోతోంది? చూడాలంటే ఈ శని, ఆదివారాలలో ప్రసారమయ్యే కుకు విత్ జాతిరత్నాలు చూసేయాల్సిందే.

Read more about: brahmamudi deepika rangaraju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X