Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ మణికంఠపై బ్రహ్మముడి కావ్య దారుణంగా.. ఓ రేంజ్‌లో దీపిక రంగరాజు ట్రోలింగ్

బిగ్‌బాస్ తెలుగు 8 షో రెండోవారంలోకి చేరుకొన్నది. అయితే తొలివారంలోనే కంటెస్టెంట్ల ఆట తీరు రచ్చ లేపింది. ఒకరికంటే మరొకరు విపరీతంగా దూషించుకొంటూ.. గొడవలు పడుతూ ఇదేం షోరా అని ప్రేక్షకులు అనే విధంగా ముక్కున వేలేసేకొనే విధంగా చేసింది. అయితే గతవారం రోజుల్లో ఎక్కువగా సెంటిమెంట్ కంటెంట్‌తో మణికంఠ దారుణంగా ట్రోల్ అయ్యారు. అయితే తాజాగా బ్రహ్మముడి సీరియల్‌లో స్టార్ కంటెస్టెంట్ కావ్య ఆయనను ఎలా ట్రోల్ చేసిందంటే..

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో టాప్ రేటింగ్‌లో స్టార్ మా టెలివిజన్ ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతున్నది. ఆ క్రమంలోనే ఆదివారం విత్ స్టార్ మా పరివారం: స్టార్ వార్ అనే కార్యక్రమాన్ని గ్రాండ్‌గా ప్రసారం చేసింది. 100 ఎపిసోడ్‌ కావడంతో ఇంకా జోష్‌తో వినోదాన్ని అందించారు.

Brahmamudi Fame Deepika Rangaraju creates fun trolling Bigg Boss Telugu 8 Contest Manikanta

స్టార్ వార్ 100వ ఎపిసోడ్‌లో పలు సీరియల్స్‌కు చెందిన యాక్టర్లను భాగం చేశారు. ఈ రియాలిటీ షోలో బుల్లితెర షోలలో ఉండే కమెడియన్లు, యాక్టర్లు తమకు తోచిన విధంగా పేరడితో ఆకట్టుకొన్నారు. ఈ షోలో తాజాగా జరుగుతున్న బిగ్‌బాస్ తెలుగు 8 షోను ఆసరాగా చేసుకొని కామెడీ ఓ రేంజ్‌లో పండించారు.

శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలోకి టాప్ రేటేడ్ సీరియల్‌ బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు చేసిన అల్లరి ఓ రేంజ్‌లో ఆకట్టుకొన్నది. స్టేజ్ మీదకు వచ్చి శ్రీముఖితో మాట్లాడుతూ.. హలో నాగార్జున గారు అంటూ ఫోన్ చేసినట్టు యాక్టింగ్ చేసింది. దాంతో ఆయన నంబర్ కూడా నీ వద్ద ఉందా? అని శ్రీముఖి సెటైర్ వేసింది. దాంతో ఆ ఉంది అని దీపిక చెప్పింది.

ఇక బిగ్‌బాస్ తెలుగులో మీరు ఉంటే బాగా కంటెంట్ ఇచ్చే దానిని అనుకొంటున్నారా? అంటూ దీపిక రంగరాజ్‌ను శ్రీముఖి అడిగితే.. అందుకు సమాధానం ఇవ్వకుండా.. నేను ట్రాన్స్‌పరెంట్‌గా ఉండలేను అంటూ తన తలపై ఉన్న విగ్‌ను పీకేసుకొని బిగ్ బాస్ కంటెంట్‌ మణికంఠను అనుకరించింది. దాంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

ఇటీవల ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు షోలోకి వచ్చిన మణికంఠ.. ఎమోషన్స్, సెంటిమెంట్‌ను పండించే క్రమంలో తన తలపై ఉన్న విగ్‌ను పీక్కొని.. నేను ట్రాన్సపరెంట్‌గా ఉంటాను. ఇలాంటి అబద్దాలు చెప్పి నేను బతకలేను అంటూ కామెంట్ చేయడంపై ఆయనను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీపిక చేసిన ట్రోలింగ్‌ వీడియో, ఈ షో ప్రోమో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X