బ్రహ్మముడి కావ్యకు ఏమైంది .. గుర్తుపట్టని విధంగా మారిపోయిన దీపిక రంగరాజు

గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వారికి అందమే పెట్టుబడి. వారి అందం , శరీరాకృతి బాగున్నంత కాలం ఏం పర్లేదు. కానీ ఏమాత్రం ఒళ్లు చేసినా, ఒంపు సొంపుల్లో తేడా కొట్టినా అసలుకే మోసం వస్తుంది. అందుకే 40 ఏళ్లు దాటిన ముద్దుగుమ్మలు విపరీతమైన డైటింగ్‌లు చేసైనా సరే జీరో సైజ్‌ను మెయింటైన్ చేస్తుంటారు. అలా కాకుండా ఇష్టమొచ్చినట్లు లాగించేసి వెయిట్ కంట్రోల్ తప్పి కెరీర్ నాశనం చేసుకున్న వాళ్లెందరో. ఈ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు.

ప్రస్తుతం సినిమాలతో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకుని దూసుకెళ్తున్నాయి సీరియల్స్. సినీతారలతో సమానంగా క్రేజ్‌ను, స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు బుల్లితెర నటీనటులు. రెమ్యునరేషన్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ విషయంలో వాళ్లు కూడా దూసుకొస్తున్నారు. గతంలో సినిమాల్లో అవకాశాలు లేకనో, వయసు పైడటం వల్లనో సీరియల్స్‌లో నటించేవారు సినీతారలు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఓటీటీలు, స్మార్ట్‌ఫోన్ల రాకతో ధారావాహికలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో టాలెంట్ ఉన్న వారిని జల్లెడ పట్టి మరి అవకాశాలు కల్పిస్తున్నాయి ఆయా నిర్మాణ సంస్థలు.

brahmamudi fame deepika rangaraju funny reel goes viral in social media

ఇక సీరియల్స్‌లో నటించే ముద్దుగుమ్మల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్స్‌ను మించిన అందంతో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు తెలుగు బుల్లితెరపై అంతటి క్రేజ్‌ను దక్కించుకున్నారు స్టార్ మాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు. అమాయకత్వం, నిజాయితీ, ఓర్పు, సహనంతో కూడిన ఇల్లాలిగా ఆమె నటనకు మహిళా లోకం ఫిదా అయ్యింది.

తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు దీపిక. ఈ నేపథ్యంలో చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్‌‌లో అవకాశం రావడంతో ఉద్యోగాన్ని పక్కనపెట్టి నటనను వృత్తిగా చేసుకున్నారు. అందులో దీపిక నటనకు తమిళ మహిళా ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. ఈ ఫేమ్‌తోనే బ్రహ్మముడిలో ఛాన్స్ దక్కింది.

సీరియల్‌లో ఎంతో అమాయకంగా, సైలెంట్‌గా కనిపించే దీపిక నిజానికి అల్లరి పిల్ల. సెట్‌లోనూ, స్నేహితులతోనూ గోల గోల చేస్తుంటారు. మొన్నామధ్య బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి ఉన్న కాసేపైనా సందడి చేసింది. ఇక స్టార్ మాలో రెగ్యులర్‌గా వచ్చే పలు షోలు, ఈవెంట్స్‌లోనూ దీపిక తన మార్క్ చూపిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ చిన్నది తన వ్యక్తిగత జీవితంతో పాటు ఇతర విషయాలను పంచుకుంటూ ఉంటారు.

తాజాగా ప్రతి నెలా ఒకటో తారీఖు నాడు అందరూ ఎదుర్కొనే క్రెడిట్ కార్డ్ బిల్, ఈఎంఐల గురించి సరదాగా ఓ రీల్ చేసి దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే అంత వరకు బాగానే ఉంది కానీ.. గతంలో స్లిమ్‌గా, చూడముచ్చటగా కనిపించే దీపిక కాస్త ఒళ్లు చేసి మునుపటి ఛార్మింగ్ కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు రీల్స్ తర్వాత ముందు వెయిట్‌పై ఫోకస్ పెట్టాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీపిక రంగరాజు వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: brahmamudi deepika rangaraju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X