కార్తీక దీపంలో దీప రోల్ అలా మిస్.. ఆ 6 అడుగులే నా ఆస్తి.. బ్రహ్మముడి దీపిక ఎమోషనల్
బ్రహ్మముడి సీరియల్‌తో తెలుగు నాట పాపులర్ అయ్యారు దీపిక రంగరాజు. కావ్య అనే ఓ బరువైన పాత్రతో ఆమె ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. సీరియల్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో షోలతో ప్రేక్షకులను వినోదాన్ని పంచుతున్నారు దీపిక. ఎక్కడున్నా సరే తన ఎనర్జీతో జోష్ తీసుకొచ్చే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. తాజాగా జబర్దస్త్ బ్యూటీ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా వచ్చిన దీపిక రంగరాజు.. తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
న్యూస్ రీడర్‌గా కెరీర్
తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు అక్కడి మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. చదువుతో పాటు కల్చరల్ ఈవెంట్స్‌లో దీపిక చురుగ్గా ఉండేవారు. ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన దీపికకు.. చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్‌లో అవకాశం వచ్చింది. దీంతో ఉద్యోగాన్ని పక్కనపెట్టి నటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు దీపిక రంగరాజు. ఆ సీరియల్‌లో ఆమె నటనకు మహిళా ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. ఈ ఫేమ్‌తో తెలుగులో బ్రహ్మముడి ధారావాహికలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది.

బ్రహ్మముడిలో కావ్యగా
బిగ్‌బాస్ ఫేం మానస్‌తో కలిసి ఈ సీరియల్‌ను సూపర్‌హిట్ చేశారు దీపిక. ఆమె కట్టుబొట్టు, నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగు సీరియల్స్‌లోని బలమైన పాత్రల్లో కావ్య రోల్ కూడా ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్‌లో చేస్తూనే తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటూ మరింత చేరువ అవుతున్నారు. బిగ్‌బాస్ తెలుగు 8లోనూ గెస్ట్‌గా అడుగుపెట్టి కంటెస్టెంట్స్‌తో కలిసి సందడి చేశారు దీపిక. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈమె బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా మారుతుందని దీపిక అభిమానులు కూడా భావిస్తున్నారు.
పెద్దమ్మ తల్లిని అదే కోరుకున్నా
జబర్దస్త్ బ్యూటీ వర్ష నిర్వహిస్తోన్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా వచ్చిన దీపిక రంగరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను పరిశీలిస్తే.. వర్ష అడిగే ప్రతి ప్రశ్నకు దీపిక అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. హైదరాబాద్‌కు రాగానే తొలుత కార్తీక దీపంలో తనకు అవకాశం వచ్చిందని, కానీ ఫేస్‌కి బ్లాక్ మేకప్ వేసుకోవాలని చెప్పడంతో ఆ ఆఫర్ వదులుకున్నానని తెలిపింది. దేవుడిని తాను బాగా నమ్ముతానని, హైదరాబాద్‌లో పెద్దమ్మ తల్లి నా ఫేవరెట్ అని చెప్పింది దీపిక. బ్రహ్మముడి సీరియల్ పెద్ద హిట్ కావాలని ఆమెకు దండం పెట్టుకున్నానని.. కానీ అది ఊహించిన దానికంటే హిట్ అయ్యిందని తెలిపింది.
సొంతిల్లు లేదు
బ్రహ్మముడిలో అవకాశం దొరకడమే అదృష్టం అనుకుంటే.. మానస్ (రాజ్) దొరకడం ఇంకొక అదృష్టమని చెప్పింది దీపిక. జబర్దస్త్‌లో మానస్ చేయడం ఆనందంగా ఉందని, నన్నెందుకు పెట్టలేదని ప్రశ్నించింది. రష్మి స్విట్జర్లాండ్ వెళితే మానస్‌ని, జబర్దస్త్‌ని నేను చూసుకుంటానని దీపిక చెప్పింది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే అవకాశం వస్తే రష్మిక మందన్న కంటే బాగా చేస్తానని బోల్డ్ కామెంట్స్ చేసింది. చిన్నప్పటి నుంచి సొంతంగా ఇల్లు కొనాలని ఓ కల ఉందని చెబుతుంది దీపిక. మీరు ఇన్ని సీరియల్స్, షోలు చేస్తున్నారు .. ఇప్పటి వరకు సొంతిల్లు లేదా అని వర్ష అడుగుతుంది. మనం ఈ భూమ్మీద పుట్టినప్పుడే స్మశానంలో మనకి 6 అడుగుల స్థలం కేటాయించబడి ఉంటుందని అదే నా ఆస్తి అని దీపిక ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీపిక కుటుంబం ఇప్పటి వరకు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? నెక్ట్స్ ఆమె ఏ ప్రాజెక్ట్ చేస్తుంది? అన్నది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











