పెళ్లి పీటలెక్కనున్న బ్రహ్మముడి కావ్య .. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో దీపిక రంగరాజు?

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా నటీనటులు పెళ్లి పీటలెక్కిస్తున్నారు. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రెండ్రోజుల క్రితం తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీని పెళ్లాడి షాకిచ్చింది. ఈ లిస్ట్‌లో చాలా మంది స్టార్స్ ఉన్నట్లుగా మీడియా కోడై కూస్తోంది. సినీనటులే కాదు బుల్లితెర సెలబ్రెటీలు కూడా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా తెలుగువారిని అలరిస్తున్న బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక రంగరాజు గురించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఆమె పలు కల్చరల్ ఈవెంట్స్‌లో పాల్గొంటూ అప్పుడే తాను ఫ్యూచర్‌లో ఏం కాబోతున్నది తెలిపారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా జీవితాన్ని ప్రారంభించారు దీపిక. ఈ క్రమంలో చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్‌‌లో అవకాశం రావడం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అందులో దీపిక నటనకు తమిళ మహిళా లోకం బ్రహ్మరథం పట్టింది. ఈ ఫేమ్‌తోనే తెలుగులో స్టార్ మా నిర్మించిన బ్రహ్మముడిలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది.

brahmamudi fame deepika rangaraju is going to get married

కావ్య పాత్రలో దీపిక ఒదిగిపోయారు. అమాయకత్వం, నిజాయితీ, ఓర్పు, సహనంతో కూడిన ఇల్లాలిగా ఆమె అద్భుతంగా నటించారు. కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నారు దీపిక. ఎంతో అమాయకంగా, పద్దతిగా కనిపించే దీపిక నిజానికి అల్లరి పిల్ల. షూటింగ్ స్పాట్‌లో కానీ బయటకానీ అడుగుపెట్టిందంటే చాలు గోల గోలే. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీపిక తన సీరియల్స్ షూటింగ్స్, వ్యక్తిగత వివరాలు, ఇతర సంగతులు పంచుకుంటూ ఉంటారు. సీరియల్స్‌తో పాటు తమిళంలో ఓ సినిమాలో కూడా నటించింది. ఆరాడీ అనే చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. కథ, పాత్ర నచ్చితే సినిమాల్లోనూ నటిస్తానని దీపికా రంగరాజు పలుమార్లు తెలిపారు.

రెండ్రోజుల క్రితం బిగ్‌బాస్‌ తెలుగు స్టేజ్‌పై అడుగుపెట్టిన దీపిక హౌస్‌లో జోష్ నింపారు. చూస్తుంటే బిగ్‌బాస్ తెలుగు 9లో అడుగుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కాగా.. ఆల్రెడీ 30ని క్రాస్ చేసిన దీపికకు పెళ్లెప్పుడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఈమెను ఆటపట్టిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే దీపిక గురించి ఓ గాసిప్ టెలివిజన్ రంగంలో హల్ చల్ చేస్తోంది.

ఈ బ్రహ్మముడి హీరోయిన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందట. ఓ సీరియల్ హీరోతో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు కూడా తెలుసునని.. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తక్షణం వైవాహిక బంధంలోకి అడుగుపెడతారని బుల్లితెర వర్గాలు అంటున్నాయి. అంతా బాగానే ఉంది కానీ దీపిక మనసు దోచుకున్న ఈ సీరియల్ హీరో ఎవరు? అసలు ఇది గాలివార్తా? లేక నిజమేనా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.

More from Filmibeat

Read more about: brahmamudi deepika rangaraju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X