కళ్ల ముందు మృత్యువు... నా చివరి కోరిక ఇదే.. బ్రహ్మముడి దీపిక రంగరాజు ఎమోషనల్
స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టి పడేస్తున్నారు కావ్య అలియాస్ దీపిక రంగరాజు. తమిళ నటి అయినా పక్కింటి అమ్మాయిలా.. చలాకీగా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు దీపిక. ఈమె ఎక్కడుంటే ఎలాంటి వాతావరణంలోనైనా జోష్ రావాల్సిందే. అంతలా తన మాటలు, చేష్టలతో ఆహ్లాదకరంగా మార్చేస్తారు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా.. దీపిక గుండెల్లో ఎంతో బాధ ఉంది. కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ వర్ష నిర్వహించిన కిస్సిక్ టాక్ షో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న దీపిక కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
తమిళనాడుకు చెందిన దీపిక .. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఓ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు. ఈ దశలో తమిళ బుల్లితెర ఇండస్ట్రీ నుంచి ఆమెకు పిలుపొచ్చింది. అక్కడ పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు తెలుగు టెలివిజన్ రంగం ఆహ్వానం పలికింది. స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడిలో హీరోయిన్‌గా దీపిక రంగరాజు ఎంపికయ్యారు.

పేదింటి ఆడపిల్ల.. కోటీశ్వరుల ఇంటికి కోడలిగా వెళ్లడం అత్తింటి వారిని తన ప్రేమ, ఓర్పు, సహనంతో గెలుచుకోవడం, భర్త కోసం ప్రాణాలైనా ఇచ్చే ఇల్లాలి పాత్రలో దీపిక ఒదిగిపోయారు. ఈ పాత్రలో ఆమెను తప్పించి మరొకరిని ఊహించుకోలేమంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మముడితో పాటు పలు తెలుగు ఛానెల్స్‌లో ప్రసారమవుతున్న కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కిస్సిక్ టాక్స్‌లో పాల్గొన్న దీపిక.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కార్తీక దీపం సీరియల్‌లో నేను నటించాల్సి ఉంది. అయితే అప్పటికే బ్రహ్మముడి స్టార్ట్ అయ్యింది. ఈ సీరియల్ చేయకపోయుంటే చాలా ఫీల్ అయ్యేదానిని. బ్రహ్మముడికి వారం రోజుల ముందు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అందులో హీరోయిన్ రీప్లేస్‌మెంట్ ఉండటంతో నన్ను అడిగారు. అప్పటికే తమిళ్‌లో చేస్తుండటం.. సేమ్ ప్రాజెక్ట్ కావడంతో ఒక 8 రోజులే కదా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత బ్రహ్మముడి వచ్చింది. ఇది కొత్త ప్రాజెక్ట్, బిగ్ బడ్జెట్.. ప్రైమ్ టైమ్‌లో వస్తుందని చెప్పారు. వీళ్లకు మాట ఇచ్చానే ఆలోచించా. ఆ తర్వాత ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అనే సీరియల్ వాళ్లు కూడా నన్ను సంప్రదించారు. అప్పటికే బ్రహ్మముడి, మరో ప్రాజెక్ట్ ఏది చేయాలనే డైలమాలో ఉన్నా. పది వేలు, 5 వేలు ఖర్చుపెట్టి ఎంతోమంది జ్యోతిష్యులకు ఫోన్ చేసి కనుక్కున్నా. అయినా దేవుడు బ్రహ్మముడే చేయాలని రాసిపెట్టాడేమో.. లాస్ట్ మినిట్‌లో ఫిక్స్ అయిపోయా అని దీపిక తెలిపారు.
నా జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని జ్యోతిష్యులు చెప్పినట్లే జరిగాయి. బ్రహ్మముడి ముందు వరకు నాకు ఫేమ్ అస్సలు రాలేదు. నేను ఇండస్ట్రీలో నాలుగేళ్ల నుంచి ఉన్నా.. అయితే ఈ ఫేమ్ వస్తుందని నాకు ముందే ఒక ఆస్ట్రాలజర్ చెప్పారు. అదే బ్రహ్మముడి. యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించిన తర్వాత ఓ ఛానెల్‌లో మంచి ప్రాజెక్ట్ వచ్చింది. ఆ తర్వాత కెరీర్‌లో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. చుట్టూ ఉన్నవాళ్లూ సీరియల్స్ వదిలేయ్.. సినిమాలు చేయాలని చెప్పడంతో రెండేళ్లు బ్యాడ్ పీరియడ్ నడిచింది. హైదరాబాద్‌లో పెద్దమ్మ తల్లి నాకు చాలా ఇష్టం.. ఎప్పుడైనా మంచి డెసిషన్ తీసుకోవాలంటే అక్కడికి వెళ్తానని దీపిక పేర్కొన్నారు.
ఈ భూమీ అంతరించిపోతుంది.. ఇదే మీ ఆఖరి రోజని తెలిస్తే మీరు ఏం చేస్తారని వర్ష అడగ్గా.. పార్టీలు, టీ, కాఫీలు కూడా నాకు అలవాటు లేదు. అస్సలు డ్రింక్ చేయను. నా స్కూల్, కాలేజ్ గ్యాంగ్ కూడా నాకు అలవాటు చేయలేదు. ఫ్రెండ్స్ తాగుతున్నప్పుడు కూడా నాకు తాగాలని అనిపించలేదు. స్మోకింగ్, డ్రింకింగ్‌లు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. నా చివరి క్షణాల్లో నా అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టి నాకు కావాల్సినవి అన్ని కొనుక్కుంటాను. జ్యువెలరీ కొనుక్కుని, ఫోటోలు తీసుకుని పెట్టుకుంటా. ఫుడ్ అంటే చాలా ఇష్టం.. తెల్లారి షూట్ ఉందంటే తినలేం. నాకు నచ్చినవన్నీ తినేస్తానని దీపిక రంగరాజు ఆన్సర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీపికలో చాలా డెప్త్ ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











