హద్దులు దాటేసిన బ్రహ్మముడి కావ్య అల్లరి .. దాని ముందు కోతి చేష్టలు
ఇప్పుడు సినిమాలతో సమానంగా క్రేజ్‌ను సొంతం చేసుకుని దూసుకెళ్తున్నాయి సీరియల్స్. సినీతారలతో సమానంగా క్రేజ్‌ను, స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు బుల్లితెర నటులు. రెమ్యునరేషన్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ విషయంలో సినీనటులతో సమానంగా సంపాదిస్తున్నారు. గతంలో అవకాశాలు లేక సీరియల్స్‌లో నటించేవారు సినీతారలు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఓటీటీలు, స్మార్ట్‌ఫోన్ల రాకతో ధారావాహికలకు డిమాండ్ బాగా పెరిగింది. టాలెంట్ ఉన్న వారిని వెతికి పట్టికొచ్చి మరి అవకాశాలు కల్పిస్తున్నాయి ఆయా నిర్మాణ సంస్థలు.
ఇక సీరియల్స్‌లో నటించే ముద్దుగుమ్మల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్స్‌ను మించిన అందంతో రెచ్చిపోతున్నారు. పైగా నిండైన వస్త్రధారణతో పద్ధతిగా కనిపించే వీరికి ఇంటిల్లిపాది అభిమానులే. ఇప్పుడు తెలుగునాట అంతటి క్రేజ్‌ను దక్కించుకున్నారు స్టార్ మాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు. కావ్య పాత్రలో దీపిక ఒదిగిపోయారు. అమాయకత్వం, నిజాయితీ, ఓర్పు, సహనంతో కూడిన ఇల్లాలిగా ఆమె అద్భుతంగా నటించారు.

తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. ఈ నేపథ్యంలో చదువు పూర్తి చేసిన తర్వాత ఓ తమిళ ఛానెల్‌లో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు దీపిక. ఈ నేపథ్యంలో చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్‌లో అవకాశం రావడంతో ఉద్యోగాన్ని పక్కనపెట్టి నటనను వృత్తిగా చేసుకున్నారు. ఈ నిర్ణయం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అందులో దీపిక నటనకు తమిళ మహిళా ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి. ఈ ఫేమ్‌తోనే తెలుగులో స్టార్ మా నిర్మించిన బ్రహ్మముడిలో ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. బిగ్‌బాస్ ఫేం మానస్ నాగులపల్లి ఇందులో హీరో కాగా.. దీపిక హీరోయిన్. బ్రహ్మముడి సక్సెస్‌లో వీరిద్దరిది కీలకపాత్ర.
ఆల్రెడీ 30ని క్రాస్ చేసిన దీపికకు పెళ్లెప్పుడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఈమెను ఆటపట్టిస్తుంటారు. ఓ సీరియల్ హీరోతో ఆమె పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లుగా ఇటీవల గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది. ఇక ఎంతో అమాయకంగా, సైలెంట్‌గా కనిపించే దీపిక నిజానికి అల్లరి పిల్ల. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీపిక రంగరాజు తన సీరియల్స్ షూటింగ్స్, వ్యక్తిగత వివరాలు, ఇతర సంగతులు పంచుకుంటూ ఉంటారు.
తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియోలో ఎరుపు రంగు పట్టు చీర కట్టి తన అందాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ వెంటేనే మిర్రర్‌లోని తన ప్రతిబింబానికి ముద్దు పెట్టి అల్లరి చేసింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఆమె సెల్ఫీ లవ్ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం దీపిక పోస్ట్ వైరల్ అవుతుండగా.. సో క్యూట్ మేడమ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా దీపిక అల్లరిపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











