’విజయ్ దేవరకొండ అంటే క్రష్.. రష్మికపై అలా రివేంజ్ తీర్చుకొంటా‘

స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు కావ్య అలియాస్ దీపిక రంగరాజు. బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది దీపిక. తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినప్పటికీ తన నటన, అందం, చలాకీతనంతో అందిరినీ ఆకట్టుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ. ముఖంపై చెరగని చిరునవ్వుతో పాటు అల్లరితో తాను ఉన్న చోట జోష్ తీసుకొస్తారు దీపిక. అలాంటిది ఆమెకు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆగ్రహం తెప్పించింది. ఈ వివరాల్లోకి వెళితే..

న్యూస్ రీడర్ నుంచి స్టార్ హీరోయిన్లుగా, సెలబ్రిటీలుగా ఎదిగిన వారి లిస్ట్‌లో ఖచ్చితంగా దీపిక రంగరాజు కూడా ఉంటారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత చెన్నైకి మకాం మార్చి ఓ తమిళ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా జాయిన్ అయ్యింది దీపిక. ఇదే సమయంలో తమిళ బుల్లితెర నుంచి అవకాశాలు రావడంతో ఓ సీరియల్‌లో నటించింది. దీనికి మంచి పేరు రావడంతో సినీ రంగాన్ని కూడా ఓ చూపు చూసింది. అయితే సినిమాలు, సీరియల్స్ మధ్య తాను నలిగిపోయానని ఒకానొక సందర్భంలో దీపిక ఆవేదన వ్యక్తం చేసింది. ఎటువైపు వెళ్లాలో తెలియక రెండు మూడేళ్లు వేస్ట్ చేసినట్లు చెప్పింది.

Brahmamudi Fame Deepika Rangaraju Reveals Her Crush on Vijay Deverakonda

బ్రహ్మముడిలో నటించడానికి ముందు స్టార్ మాలో ప్రసారమైన సూపర్‌హిట్ సీరియల్ కార్తీక దీపంలో దీప క్యారెక్టర్ తొలుత దీపిక వద్దకే వచ్చింది. అయితే అనివార్య కారణాలతో ఆమె తప్పుకోవడంతో ప్రేమి విశ్వనాథ్‌ను అదృష్టం వరించింది. అయితే బ్రహ్మముడి కూడా మంచి రేటింగ్ తెచ్చుకుని దీపిక నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

చెన్నైలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్న దీపిక రంగరాజు.. బ్రహ్మముడి సీరియల్‌తో పాటు కుకు విత్ జాతిరత్నాలు, ఆదివారం విత్ స్టార్ మా పరివారంతో పాటు జెమినీ టీవీలో మాస్ జాతర, పలు ఓటీటీలలో షోలు చేస్తున్నారు. తెలుగు భాషపైనా నెమ్మదిగా పట్టు సాధిస్తోన్న దీపిక రంగరాజు.. గతంలో కంటే బాగా తెలుగు మాట్లాడుతోంది. అలాగే తెలుగు హీరోలను కూడా అంతే అభిమానిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నీకు ఇష్టమైన హీరో ఎవరని యాంకర్ అడగ్గా.. నాగార్జున గారంటే నాకు చాలా ఇష్టమని, అయితే మన ఏజ్ వాళ్లలో విజయ్ దేవరకొండగారు అంటే క్రష్ అని చెప్పింది.

విజయ్ దేవరకొండపై ఎంతో క్రష్ ఉందో నాగార్జున గారిని చూసినప్పుడల్లా అలాగే అనిపిస్తుందని చెప్పింది దీపిక. విజయ్ దేవరకొండగారితో కిస్ సీన్ చేసే అవకాశం వస్తే అస్సలు వదిలిపెట్టను. రష్మిక గారి కంటే నేనే బాగా చేస్తానని అప్పట్లో దీపిక రంగరాజు ఇచ్చిన బోల్డ్‌గా ఆన్సర్ వైరల్ అయ్యింది. తాజాగా విజయ్ దేవరకొండపై తన అభిమానాన్ని చాటుకున్నారు దీపిక రంగరాజు.

తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో తేజస్వి మదివాడ హోస్ట్‌గా ప్రసారమవుతున్న కాకమ్మ కథలు కార్యక్రమంలో పాల్గొన్న దీపికను తేజస్వి పలు ప్రశ్నలు అడగ్గా.. వాటికి దీపిక తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు. నేను కనుక నటిని కాకపోయుంటే ఖచ్చితంగా న్యూస్ రీడర్‌ని అయ్యేదానిని. నా ప్రజెంట్ క్రష్.. విజయ్ దేవరకొండ అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ అందుకే రష్మిక మందన్న మీద రివెంజ్ తీర్చుకుంటానని నవ్వుతూ చెప్పింది. రిలేషన్‌షిప్‌లో గివ్ రెస్పెక్ట్.. టేక్ రెస్పెక్ట్ అన్నట్లుగా ఉండాలి. తినడాన్ని ఎంతో ఇష్టపడతాను, సీరియల్స్ అంటేనే నాకు చాలా ఇష్టం. డ్యాన్స్ షో.. కుకరీ షో చేయాల్సి వస్తే డ్యాన్స్ చేసుకుని కుక్ చేస్తా.. లేదంటే కుక్ చేసుకుని డ్యాన్స్ చేస్తానని ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది దీపిక రంగరాజు. తనకు తెలుగు భాష అంటే చాలా ఇష్టమని తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X