చీరలోనూ వదలరు... నా నడుముపైనే కన్ను.. బ్రహ్మముడి కావ్య షాకింగ్ కామెంట్స్
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ ఆడవారి డ్రెస్సింగ్ స్టైల్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏకంగా జాతీయ స్థాయిలో ఈ ఇష్యూ చర్చనీయాంశమైంది. శివాజీకి కౌంటర్‌గా యాంకర్ అనసూయ రంగంలోకి దిగడంతో వీరిద్దరికి సపోర్ట్ చేసేవారు రెండు విడిపోయి ట్రోలింగ్‌కి దిగారు. విషయం మహిళా కమీషన్ వరకు వెళ్లగా.. శివాజీ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. నేను చెప్పాలనుకున్న ఉద్దేశం కరెక్టేనని, కానీ రెండు పదాలు తప్పుగా దొర్లాయని శివాజీ వివరణ ఇచ్చారు.
అయినప్పటికీ నిత్యం ఎక్కడో ఒకచోట ఆడవాళ్ల డ్రెస్సింగ్‌పై ప్రతి సెలబ్రిటీకి ఏదో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఎంత మంచి డ్రెస్‌లో వెళ్లినా మగాళ్ల నుంచి తప్పించుకోలేమని మారాల్సింది మగాడి బుద్దేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు. తాజాగా డ్రెస్సింగ్ స్టైల్, తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిపై షాకింగ్ కామెంట్స్ చేశారు స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య అలియాస్ దీపిక రంగరాజు.

తమిళనాడుకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి దీపిక రంగరాజు తర్వాత తమిళ బుల్లితెరపై అవకాశాలు రావడంతో అటు వైపు ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన సీరియల్స్‌కు మంచి పేరు రావడంతో దీపిక ఒకటి అరా సినిమాలలోనూ నటించింది. ఈ ఫేమ్‌తో తెలుగు టెలివిజన్ రంగం నుంచి దీపికకు కబురు అందింది. కార్తీక దీపంలో ప్రేమి విశ్వనాథ్ పోషించిన పాత్రతో పాటు మరికొన్ని సీరియల్స్‌లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయితే పలు కారణాలతో ఈ ఆఫర్స్‌ను దీపిక తిరస్కరించారట. చివరికి బ్రహ్మముడిలో కావ్య పాత్ర ఆమెకు సెట్ అయ్యింది.
గొప్పింటి భర్తను పెళ్లి చేసుకుని అత్తారింట్లో నానా కష్టాలు పడి, చివరికి అందరి అభిమానాలు సంపాదించుకునే యువతిగా దీపిక రంగరాజు అద్భుతంగా నటించారు. ఈ సీరియల్ ఈ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్‌ను సొంతం చేసుకోవడం వెనుక దీపిక నటనే కారణం. బ్రహ్మముడితో తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. దీనితో పాటు పలు టీవీ షోలలో పాల్గొంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో పాల్గొన్న దీపిక రంగరాజు.. కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
ఈ వారం గోల్డ్ హీరోయిన్స్ వర్సెస్ ట్రెండీ హీరోయిన్స్ థీమ్‌తో స్టార్ మా పరివారం సిద్ధమైనట్లు యాంకర్ శ్రీముఖి ప్రకటించింది. ఆ వెంటనే ముద్దుగుమమ్మలు అందంగా ముస్తాబై స్టేజ్ మీదకు వచ్చారు. ఫస్ట్ టైం మా పరివారానికి రాజకుమారి వచ్చిందని ఆషికా పదుకొన్‌ని పరిచయం చేసింది శ్రీముఖి. దాంతో అమ్మో అమ్మాయేనా? ఎల్లోరా శిల్పమా అంటూ ఆషికతో పులిహోర కలుపుతాడు అవినాష్. పరివారానికి రావడం పుట్టినింటికి వచ్చినట్లుగా ఉందని చెబుతుంది ఆషికా. నిజంగానే మీ బ్రదర్‌తో వచ్చారని అవినాష్‌ను చూస్తూ శ్రీముఖి పంచ్ పేల్చడంతో అంతా నవ్వేస్తారు.
ఆ వెంటనే దీపిక రంగరాజు ట్రెండీగా వచ్చిందని పరిచయం చేస్తుంది శ్రీముఖి. అందమైన అమ్మాయిలాగా చీరలు వేసుకుని వస్తే ఈ వెధవలు నడుమును చూస్తున్నారు. సల్వార్ వేసుకుని వస్తే సైడ్‌లు చూస్తున్నారని మండిపడింది దీపిక. ఆమె చేసినట్లుగాన ఇమిటేట్ చేసి చూపించింది శ్రీముఖి. దాంతో అంతా నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతుండగా.. ఆడవాళ్ల డ్రెస్సింగ్ స్టైల్, మగాళ్ల చూపులపై దీపిక తనదైనశైలిలో పంచ్‌లు విసిరిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఎలా జరిగిందో తెలియాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











