‘నా జీవితం టీవీలో హెడ్‌లైన్‌ కావొద్దు... అమ్మాయిలకు ఆ 2 నిమిషాలే’

సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ భూతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేసి వారితో లైంగిక వాంఛలు తీర్చుకునే కామాంధుల గురించి ఎప్పటికప్పుడు బయటికి వస్తూనే ఉంది. పైకి పెద్ద మనుషుల ముసుగులో చలామణి అవుతూ.. ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్న వారి బాగోతాలను నటీమణులు వెలుగులోకి తీసుకొస్తూనే ఉన్నారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బుల్లితెర నటి దీపిక రంగరాజు. ఈ వివరాల్లోకి వెళితే..

స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు దీపిక రంగరాజు. తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినా తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. బ్రహ్మముడిలో కావ్య అనే బరువైన పాత్రతో ఆకట్టుకుంటున్నారు. దీపిక ఎక్కడ ఉంటే అక్కడ జోష్ ఉండాల్సిందే. వచ్చి రాని తెలుగులో ఆమె చేసే అల్లరికి కడుపు పొట్ట చెక్కలవ్వాల్సిందే. సీరియల్స్‌తో పాటు బుల్లితెర కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ వినోదాన్ని పంచుతోంది. కొద్దిరోజుల క్రితం జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్ షోకు హాజరైన దీపిక .. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Brahmamudi Fame Deepika Rangaraju Sensational Comments on Casting Couch in Film Industry

కాలేజీ అయిపోయాక న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించా.. మూడు, నాలుగు నెలలు న్యూస్ రీడర్‌గా పనిచేశా. అయితే ఓ ఛానెల్ నుంచి హీరోయిన్ ‌గా ఆఫర్ రావడంతో చేశాను. ఆ తర్వాత కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. సీరియల్‌లోనే కంటిన్యూ అయ్యుంటే జీవితం చాలా బాగుండేది. కానీ ఆ వెంటనే సినిమాలో ఆఫర్ వచ్చింది. చుట్టూ ఉన్న వాళ్లు ఊరుకోరు కదా.. నువ్వు బాగానే ఉన్నావు కదా, సినిమాలో ట్రై చేయొచ్చుగా అని చెప్పేవారు. సినిమాల్లోకి వెళ్లడం నా జీవితంలో బ్యాడ్ పీరియడ్. 2 ఏళ్లు నేను ఏ పని చేయలేదు... సీరియల్స్ ఆగిపోయాయి, సినిమాల్లో అవకాశాలు కూడా బాగా రాలేదు. సినిమాలు రిలీజ్ చేయరు, షూటింగ్స్ స్టార్ట్ చేయరు, ఊరికే టెస్ట్ షూట్ చేస్తారు.. టైమంతా వేస్ట్ చేస్తారని దీపిక ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రేమలో అబ్బాయిలు నిజాయితీగా ఉంటారా? అమ్మాయిలు నిజాయితీగా ఉంటారా? అని యాంకర్ అడగ్గా.. వాళ్ల మైండ్ సెట్‌ను బట్టి ఉంటుంది. బ్రేకప్స్ తర్వాత 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ ఎవరూ ఉండరు. ఇప్పటి నుంచే నిజాయితీగా ఉంటే.. మనకంటూ ఒకరు దొరుకుతారు. ఇప్పుడున్న వాళ్లంతా షార్ట్ టైం ఎంజాయ్‌మెంట్ చూస్తున్నారు కానీ ఫ్యూచర్ ఆలోచించడం లేదు. మోసం చేసేవారికి మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ అనేది మీ మాటల్లో కాదు.. బిహేవియర్‌లో ఉంటుంది. మనకు ఒకరు నచ్చలేదంటే పక్కకి వెళ్లిపోవాలి కానీ చంపడాలు వద్దు.. ఎప్పటికైనా దొరికిపోవాల్సిందేనని దీపిక తెలిపారు.

ఈ ఇండస్ట్రీ వద్దని రిలేటివ్స్, బంధువులు చెబుతుంటారు. నాకు నచ్చినట్లుగానే, డిసిప్లిన్‌గా ఉంటాను. ఇంట్లో వాళ్ల మాటలు వింటే మన జీవితం ఎదగదు.. అక్కడే ఆగిపోతుందని దీపిక పేర్కొంది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు మోసపోతున్నారు.. కమిట్‌మెంట్‌కి బలైపోతున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ అడగ్గా.. అమ్మాయిలకి ఎక్కడో దూరం నుంచి ఒక అబ్బాయి చూస్తున్నాడంటే మనకి తేడా కొడుతుంది. అమ్మాయిలకు నాకు తెలిసి అలాంటి సెన్స్ దేవుడు ఇచ్చాడు. ఒకడు మనతో మాట్లాడుతున్నప్పుడే దేనికోసం మాట్లాడుతున్నాడని 2 నిమిషాల్లోనే తెలిసిపోతుంది. ఆ సెన్స్ ఉండటం వల్ల మనమే జాగ్రత్తగా ఉండాలి. మనల్ని నమ్మి అమ్మానాన్న పంపించారు. అమ్మాయిలకు ఈ జనరేషన్‌లో ఫ్రీడమ్ ఉంది. ఆ ఫ్రీడమ్‌ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నెక్ట్స్ డే మనం హెడ్ లైన్స్‌లో రాకూడదని మైండ్‌లో పెట్టుకోవాలి. అలాంటి జాగ్రత్తలు నేనైతే తీసుకుంటానని దీపిక రంగరాజు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X