నీ భార్యతో కంటే నాతోనే ఎక్కువగా.. మానస్ తో బ్రహ్మముడి దీపిక చిలిపిగా..!
సాధారణ న్యూస్ రీడర్ నుంచి బుల్లితెర నటిగా సెలబ్రెటీగా మారారు దీపిక రంగరాజు. ఎక్కడో తమిళనాడులో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యగా ఇంటిల్లిపాదికి దగ్గరయ్యారు. దీపిక ఎక్కడుంటే అక్కడ జోష్ ఉండాల్సిందే. అల్లరి చేస్తూ, ఆటపట్టిస్తూ అందరినీ నవ్విస్తుంటారు దీపిక. అయితే ఆమె జీవితంలోనూ ఎన్నో విషాదాలు, మనకి తెలియని కోణాలు ఉన్నాయి. జబర్దస్త్ ఫేమ్ వర్షకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక పలు ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ముఖ్యంగా బుల్లితెర నటుడు మానస్‌తో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
కావ్య- రాజ్‌ల కెమిస్ట్రీకి ప్రశంసలు
బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యగా దీపిక రంగరాజు.. రాజ్‌గా బిగ్‌బాస్ ఫేమ్ మానస్‌లు లీడ్ రోల్ పోషించారు. గొప్పింటికి కోడలిగా తొలుత కష్టాలను ఎదుర్కొని తర్వాత అత్తింటి అభిమానాన్ని పొందే ఇల్లాలిగా దీపిక అద్భుతంగా నటించారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని భార్యను టార్చర్ చేస్తూ తర్వాత మారిపోయి భార్యపై అంతులేని ప్రేమను చూపించే భర్తగా మానస్ కూడా ఒదిగిపోయాడు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జబర్దస్త్ వర్షకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్షపై తన అభిమానాన్ని చాటుకున్నారు దీపిక.

రాజ్ దొరకడం అదృష్టం
నా జీవితంలో బ్రహ్మముడి సీరియల్‌లో ఛాన్స్ దొరకడం ఒక అదృష్టమైతే, రాజ్ దొరకడం ఇంకొక అదృష్టమని దీపిక తెలిపారు. మానస్ దొరకడం శ్రీజకి అదృష్టమని.. శ్రీజతో కంటే నాతోనే ఎక్కువ ఉంటున్నాడని, ఈ విషయాన్ని ఆయనతో కూడా చాలాసార్లు చెప్పానని దీపిక వెల్లడించింది. మానస్ చాలా సపోర్టివ్‌గా ఉంటారని.. నాకు డ్యాన్స్ రాదని, సీరియల్‌లో దీపావళి, సంక్రాంతితో పాటు ఏదో ఒక ఫంక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డ్యాన్స్ వేయాల్సిందేనని తెలిపింది. నేను ఏదైనా చేయాలని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు, తనకు రాదు కదా ఎందుకు తనని అవమానించాలని మానస్ చెప్పేవాడని దీపిక గుర్తుచేసుకుంది.
నా పరువు కోసం నిలబడ్డాడు
షో వరకు కామెడీగా ఉన్నా.. సీరియల్‌లో మాత్రం నేను దీపిక కాదు కావ్యని.. కావ్య పాత్రకు న్యాయం చేయాలి, కరెక్ట్‌గా యాక్టింగ్ చేయాలి, డ్యాన్స్ చేయాల్సి వస్తే హీరోయిన్‌గా పర్ఫెక్ట్‌గా చేయాలని దీపిక వెల్లడించింది. డ్యాన్స్ ఎప్పుడూ చేయలేదని.. మానసే నా చేయి పట్టుకుని, కాలు పట్టుకుని తనే చేసేస్తాడని పేర్కొంది. ఓ చోట చాలా క్రౌడ్ ఉందని, దీపికకు డ్యాన్స్ రాదు తనని ఇంతమంది ముందు అవమానించొద్దని అంతా నేను చూసుకుంటానని మానస్ అండగా నిలబడ్డాడని దీపిక వెల్లడించింది. అసలు నేనేందుకు డ్యాన్స్ చేయాలి.. డ్యాన్స్ షోకి జడ్జిలా ఉంటానని చెప్పింది.
టీచర్‌గా ఉండటమే బెస్ట్
డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని మన పేరెంట్స్, లెక్చరర్స్ ట్రైనింగ్ ఇస్తారని కానీ వాళ్లంతా డాక్టర్, ఇంజనీర్ కాదు.. మనల్ని మాత్రం డాక్టర్, ఇంజనీర్‌గా తయారు చేస్తారని దీపిక చెప్పిన ఆన్సర్‌కి వర్షకి మైండ్ బ్లాంక్ అయ్యింది. డాక్టర్, ఇంజనీర్‌గా ఉండాల్సిన అవసరం లేదు.. ఒక టీచర్‌గా ఉంటే చాలని దీపిక రంగరాజు తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మానస్ పుట్టినరోజు సందర్భంగా తన కోస్టార్‌కి విషెస్ చెప్పింది దీపిక. ఆ పోస్ట్ తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications










