నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఇండస్ట్రీ 100% ప్యూర్ కాదు.. బ్రహ్మముడి కావ్య

బ్రహ్మముడి సీరియల్‌లో కావ్య పాత్రతో ఫేమస్ అయ్యారు దీపిక రంగరాజు. అహంకారం నిండిన భర్తను మార్చుకుని, అత్తింటికి ఏ కష్టమొచ్చిన ఆదుకునే బరువైన పాత్రలో దీపిక అద్భుతంగా ఒదిగిపోయారు. ఇది తప్పించి తెలుగులో మరో సీరియల్‌లో నటించనప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు దీపిక. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తుండే దీపిక ఎలాంటి వాతావరణంలోనైనా జోష్ తీసుకొస్తూ అల్లరి పిల్ల అనిపించుకున్నారు. అయితే ఆమె జీవితంలోనూ మనకి తెలియని కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. తాజాగా జబర్దస్త్ ఫేమ్ వర్షకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక వాటిని బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

పాపులర్ సీరియల్‌గా బ్రహ్మముడి
2023 జనవరిలో బ్రహ్మముడి సీరియల్ ప్రారంభమైంది. దాదాపు 500 ఎపిసోడ్‌ల వరకు ఈ ధారావాహిక ఎదురులేకుండా సాగింది. రాజ్- కావ్యల జోడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అహంకారంతో రాజ్.. సహనంతో కావ్య జనాల్లోకి బాగా వెళ్లారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గొప్పింటి అబ్బాయిలను పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల కథే బ్రహ్మముడి. ఈ సీరియల్ టైమింగ్స్ మార్చడం మొదటికే మోసం తీసుకొచ్చింది. టీఆర్పీలు దారుణంగా పడిపోవడంతో పాటు కథ అడ్డదిడ్డంగా సాగుతూ.. కొత్త కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తున్నాయి. అయినప్పటికీ బ్రహ్మముడి సీరియల్ నటీనటులకు బయట బాగానే పాపులారిటీ దక్కింది.

Brahmamudi Fame Deepika Rangaraju shares her casting couch experience in a podcast hosted by Jabardasth Varsha

దీపిక హైపర్ యాక్టీవ్
ముఖ్యం దీపిక రంగరాజు సోషల్ మీడియాలోనూ బయట బాగా యాక్టీవ్‌గా ఉంటారు. తన షోలు, సీరియల్ సంగతుల గురించి ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఫోటో షూట్స్ , వెకేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో పలు కార్యక్రమాలకు హాజరై సందడి చేస్తుంటుంది. సీరియల్స్‌తో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌లోనూ దీపిక దూసుకెళ్తున్నారు. మొన్నామధ్య నేచురల్ స్టార్ నానితో కలిసి ఓ యాడ్‌లో నటించి శెభాష్ అనిపించుకుంది.

సొంతిల్లు కట్టుకోవడం కల
ఓ ఛానెల్‌లో జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ పాడ్‌కాస్ట్‌కు హాజరైన దీపిక రంగరాజు.. తన కెరీర్, జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. బ్రహ్మముడిలో ఛాన్స్ దొరకడం తన అదృష్టమని ఆమె వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి సొంతిల్లు కొనుక్కోవాలనే కల మిగిలిపోయిందని.. తనకు ప్రభుత్వం చనిపోయాక ఇచ్చే 6 అడుగుల నెల మాత్రం ఉందని ఎమోషన అయ్యింది. అల్లరి చిల్లరిగా తిరిగే ఈ ముద్దుగుమ్మ గుండె లోతుల్లో ఇంత బాధ దాగుందని ఈ ఎపిసోడ్‌తో అందరికీ అర్ధమైంది. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో తాను కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్నట్లుగా వచ్చిన వార్తలను దీపిక ఖండించారు.

క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే
సినిమా, వెండితెర ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ రక్కసి విజృంభిస్తుండటంతో దీనిపై దీపికను వర్ష ప్రశ్నించగా.. దీనికి కావ్య ముక్కుసూటిగా ఆన్సర్ ఇచ్చారు. 'మనం అలాంటి వ్యక్తులం కాకపోయినప్పటికీ అలాంటి వాళ్లమేనని కొందరు ఫిక్స్ అయిపోతారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందని. మనం అలాంటి పనులు చేసిన తర్వాతే ఈ పొజిషన్‌కు వచ్చామని చాలామంది అనుకుంటున్నారు. బాగా చదువుకున్నవాళ్లు కూడా అలాగే అనుకుంటున్నారు. నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశా. టెలివిజన్ ఇండస్ట్రీ 100 పర్సెంట్ అగ్‌మార్క్ ఘీ లాంటి ప్యూర్. సినిమా ఇండస్ట్రీ కూడా వెరీ వెరీ గుడ్. కానీ కొంతమంది వెస్ట్ పీపుల్స్ అలా చేస్తున్నారు. నిజంగా సినిమా తీసేవాళ్లు అలా చేయరు. సినిమా అనే బ్రాండ్ పెట్టుకుని, దాని పేరు మీద తప్పుడు పనులు చేస్తున్నారు. ఇలాంటివి నా దృష్టికి వస్తే వార్నింగ్ ఇవ్వను.. నాకు నచ్చలేదంటే పక్కకు వెళ్లిపోతాను, బయటికి చెప్పడం, గొడవ పడటం ఉండవు. జస్ట్ బ్లాక్ అంతే' అని దీపిక రంగరాజు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు టెలివిజన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X