Brahmamudi కావ్యపై స్టార్ కమెడియన్ సీరియస్.. అక్కడికి పంపించేయాలంటూ షాకింగ్‌గా!

స్టార్ మాలో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు దీపిక రంగరాజు. కావ్య అనే పాత్రలో పుట్టినింటికి, మెట్టినింటికి పేరు తీసుకొస్తూ.. సహనం, తెలివితేటలతో సమస్యలను పరిష్కరించే పాత్రలో దీపిక అద్భుతంగా నటించారు. ఈ సీరియల్ ఈ స్థాయిలో విజయం సాధించం వెనుక దీపక కీలకపాత్ర పోషించారు. తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినా తెలుగువారికి బాగా కనెక్ట్ అయ్యింది. సీరియల్స్‌తో పాటు బుల్లితెరపై పలు ఈవెంట్స్‌లోనూ సత్తా చాటుతూ అలరిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె వేసిన పంచ్‌లు ఓ సీనియర్ కమెడియన్‌కు చిరాకు పట్టించాయి. ఈ వివరాల్లోకి వెళితే..

తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమయ్యే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు చెఫ్ జీవన్ జడ్జిగా ఉన్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ స్పెషల్ ఎపిసోడ్‌ను మేకర్స్ డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ప్రోమో స్టార్టింగ్‌లో సుమ, జీవన్‌లు ఒకరినొకరు విష్ చేసుకుంటారు. కేక్ రెడీయా అని సుమ అడగ్గా.. రెడీ అని జీవన్ చెబుతాడు. మరి కత్తి ఎక్కడ? అని సుమ ప్రశ్నించగా.. మీరు కనీసం కత్తి కూడా తీసుకురాకపోతే ఎలా అని జీవన్ ప్రశ్నించాడు. నేనే కత్తిలా ఉన్నాను అని దానిని మరిచిపోయాను సుమ పంచ్ విసిరింది.

Brahmamudi fame Deepika Rangaraju Steals the Show with Her Punches on Aha s Chef Mantra Project K S5

ఇంతలో కంటెస్టెంట్స్ అంతా షోలోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతోనే అందరూ కేక్ చూసి తినేస్తారు. రెడీగా ఉంది కేకు.. ఇంకా ఆలస్యమేంటీ, దూకు అంటూ దీపిక ఓ పంచ్ విసిరింది. ఆ వెంటనే సుమ, జీవన్‌లు వచ్చి ఇక్కడ కేక్ అనే ఒక పదార్ధం ఉండాలి, ఎవరైనా చూశారా అని ప్రశ్నిస్తారు. నములుతుంటే దారాలు తగులుతున్నాయని యాదమ్మరాజు అడగ్గా.. అది క్యాండిల్ అని ఊసేయాలని చెబుతుంది సుమ. దానికి పనిష్‌మెంట్ కింద మీరు మాకు కేక్ తయారుచేసి ఇవ్వాలని అంటుంది సుమ. నా కేక్‌ను తినబోతున్న అదృష్టవంతుడు ఎవరు? అంటూ దీపిక ప్రశ్నించగా సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మాజీ ఎంట్రీ ఇస్తాడు. ఈవినింగ్ స్నాక్స్‌లో తింటాం బజ్జీ.. వచ్చారు బ్రహ్మాజీ పంచ్‌ల వర్షం కురిపిస్తుంది దీపిక.

యాదమ్మ రాజుకు పెళ్లి అయ్యిందా? అని సుమ అడగ్గా.. అతని కాలేదని చెబుతాడు. ఒకసారి వీళ్ల ఆవిడని తీసుకురండి అని చెప్పగానే అతని భార్య షోలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే యాదమ్మ రాజు షాక్ అవుతాడు. ఇంట్లో నాకోసం వంట చేయరు, నేను చూడు మీకోసం చేతులు కాల్చుకుంటున్నా అంటుంది. ఆ వెంటనే దీపిక వచ్చి ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలి లాగా రాజు నా దగ్గరే ఉన్నాడని చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

ఇంతలో సుమ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక శివాజీ పక్కకి వచ్చేస్తాడు. స్టవ్ లేకపోయినా అక్కడ మంటలు బుస్సు బస్సుమని అంటున్నాయని శివాజీ చెప్పగా.. ఫైరింజన్ కావాలా? సార్? అంటూ దీపిక ప్రశ్నించింది. ఆ దెబ్బకు ఆమెను వేరే లాంగ్వేజికి పంపించేస్తే బెటర్ అంటాడు. ఆ అమ్మాయి వేరే లాంగ్వేజ్ నుంచే వచ్చిందని మానస్ చెప్పగా శివాజీ షాక్ అవుతాడు. అప్పటికీ కూడా దీపిక వదలకుండా మీరు అద్దాలు తీసేసినా మీరు నాకు ఇష్టమే.. మీ విగ్గుని తీసేసినా కూడా నాకు ఇష్టమే అంటుంది. చివరికి బ్రహ్మాజీ ఐ లవ్ యూ అని చెప్పగా.. దీపిక ఐ టూ అనేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. దీపిక రంగరాజు చేసిన అల్లరి చూడాలంటే జనవరి 1వ తేదీ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X