Brahmamudi బ్రహ్మముడి అప్పుతో కళ్యాణ్ పెళ్లి.. ఎలానో చేసుకొంటున్నారో తెలుసా?

ఈ మధ్యకాలంలో సినిమాల కంటే సీరియల్స్ యే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నాయి. ఇక సినిమాలో నటించిన వారి కంటే సీరియల్స్ లో నటించినవారే మరింత గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రేక్షకులు సైతం వారి గురించే తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో టాప్ లో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి ఒకటి. గుప్పెడంత మనసు, చెల్లెలి కాపురం లాంటి స్టార్ సీరియల్స్ కు దర్శకత్వం వహించిన కుమార్ .. ఈ సీరియల్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక మొదటి నుంచి కూడా ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒకే ఇంటికి కోడళ్ళుగా ఎలా మారారు. తమ భర్తలను ఎలా మార్చుకున్నారు అనేది ఈ సీరియల్ కథ. స్వప్న, కావ్య, అప్ప్పు.. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు.. దుగ్గిరాల వారసులు అయిన.. రాజ్, రాహుల్, కళ్యాణ్ లను ప్రేమిస్తారు. ప్రస్తుతం కథలో అయితే కావ్య, స్వప్న ..రాజ్, రాహుల్ లను పెళ్లి చేసుకొని దుగ్గిరాల కోడళ్ళుగా మారారు. అప్పు మాత్రమే .. ఒంటరిగా మిగిలింది.

Brahmamudi fame nainisha and kiran new web series sarikotta parinayam trending in youtube

ప్రేమించిన కళ్యాణ్ ను అనామికకు త్యాగం చేసి అప్పు సింగిల్ గా మగరాయుడిలా తిరుగుతూ ఉంటుంది. మొదటి నుంచి అప్పు ప్యాంట్ షర్ట్ వేసుకోవడం.. జుట్టు పెంచుకోకపోవడం వలనో.. కళ్యాణ్ మనసులో అప్పు ఒక అమ్మాయిగా స్థానం సంపాదించలేకపోయింది. బ్రో అంటూ మగాడిని పిలిచినట్టే కళ్యాణ్ పిలుస్తాడు. వీరిద్దరిని జంటగా చూసిన ప్రతిసారి.. వీరిద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆ తరుణంగా వచ్చేసింది.

అప్పు - కళ్యాణ్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఏంటి.. నిజమా.. ? ఎక్కడ.. ఎప్పుడు అని ఆశ్చర్యపోకండి. అది బ్రహ్మముడి లో కాదు.. ఒక వెబ్ సిరీస్ లో.. అది కూడా బ్రహ్మముడి డైరెక్టర్ కుమార్ దర్శకత్వంలో.. అదే సరికొత్త పరిణయం . ఇందులో అప్పు, కళ్యాణ్ జంటగా కనిపించారు. అప్పు .. ఎంతో అందంగా.. జుట్టుతో అమ్మాయిగా కనిపించింది.

Brahmamudi fame nainisha and kiran new web series sarikotta parinayam trending in youtube

వెబ్ సిరీస్ కాన్సెప్ట్ కూడా అదిరిపోయింది. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని ఒక అమ్మాయి ఆ విషయం చెప్పకుండా ఎలాఆటపట్టించింది . పెళ్ళికి ముందుతనకు కాబోయే భర్త గుణగణాల గురించి ఎలా తెలుసుకుంది అనేది ఈ ఎపిసోడ్ లో చూపించారు . ప్రస్తుతం ఈ సిరీస్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

ఇక ఈ సిరీస్ చూసిన బ్రహ్మముడి అభిమానులు.. సీరియల్ లో వీరికి పెళ్లి చేయకపోయినా.. ఈ సిరీస్ లోనైనా వీరికి పెళ్లి చేస్తున్నారు.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సీరియల్ లో కూడా ఆ అనామికను తీసేసి.. ఈ జంటకు పెళ్లి చేయండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సీరియల్ లో ఎప్పుడు ఈ జంట ఒక్కటి అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X