Brahmamudi : రియల్ లైఫ్‌లో సామంత్‌ - అనామిక ప్రేమలో పడ్డారా?.. అర్ధరాత్రి జంటగా చక్కర్లు

బుల్లితెరపై సీరియల్స్‌లో కనిపించే నటీనటులు హీరో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదు. వారితో సమానంగా క్రేజ్‌ను , ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. బుల్లితెరపై వచ్చిన పాపులారిటీతో సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని రాణిస్తున్నారు. రెమ్యునరేషన్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ విషయంలోనూ టీవీ నటులు ఏమాత్రం తగ్గడం లేదు. సినీ తారల మాదిరిగానే టెలివిజన్ రంగంలో నటీనటులు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈటీవీ నుంచి మాటీవీ వరకు ఇలాంటి ఎన్నో జంటలు మనకు కనిపిస్తాయి.

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో స్టార్ మా తిరుగులేని టీఆర్పీలతో దూసుకెళ్తోంది. ఈ ఛానెల్ సక్సెస్‌లో ప్రధాన కారణం అందులోని సీరియల్సేనని విశ్లేషకులు సైతం అంగీకరిస్తారు. సరికొత్త హంగులు, ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కే ఆ ధారావాహికలు కుటుంబ ప్రేక్షకులను ముఖ్యంగా మహిళా మణులను కట్టిపడేస్తున్నాయి. గతంలోస్టార్ మాలో టెలికాస్ట్ అయిన కార్తీక దీపం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Brahmamudi Fame Nikitha Chowdary And Devara Naresh s video trending in Instagram

కార్తీక దీపంకు ఎండ్ కార్డ్ పడిన తర్వాత ప్రస్తుతం బ్రహ్మముడి ఆ స్థానాన్ని ఆక్రమించింది. మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు ఇందులో లీడ్ రోల్స్ పోషించారు. సంపన్న కుటుంబానికి చెందిన భర్త, నిరుపేద కుటుంబానికి చెందిన భార్య, కోడలికి అండగా నిలిచే అత్తగారు ఇలాంటి కథతో చాలా సీరియల్సే వచ్చినా డిఫరెంట్ టేకింగ్‌తో బ్రహ్మముడి టాప్ సీరియల్‌గా దూసుకెళ్తోంది. బ్రహ్మముడి సీరియల్‌లోని పాత్రధారుల పేర్లు జనంలో బాగా ఫేమస్ అయ్యాయి. కనకం, కృష్ణమూర్తి, స్వప్న , అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక వంటి వారు నోటెడ్ అయ్యారు.

వీరిలో అనామిక రోల్ కూడా కీలకమైనది. ఈ సీరియల్‌లో విలన్ రోల్స్‌లో ఈ క్యారెక్టర్ కూడా ఒకటి. అనుకోని కారణాలతో కళ్యాణ్‌కు విడాకులు ఇచ్చిన ఆమె దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేయాలని పంతం పట్టింది. కళ్యాణ్‌కు దూరమయ్యాక దుగ్గిరాల కంపెనీకి ప్రత్యర్ధిగా ఉన్న సామంత్ గ్రూప్ ఓనర్ సామంత్‌తో ఎఫైర్ నడుపుతుంది. ఈ అనామిక పాత్రలో నిఖితా చౌదరి నటించారు. క్యూట్ లుక్స్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె ఒదిగిపోయారు.

ఇక సామంత్ రోల్‌లో నటించిన దేవర నరేష్‌ కూడా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. రాజ్‌పై కక్ష పెంచుకుని అతనిపై పై చేయి సాధించాలని తహతహలాడుతుంటాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నిఖితా చౌదరి తాజాగా నరేష్‌తో కలిసి ఓ డ్యూయెట్‌ని రీల్‌గా చేసి అప్‌లోడ్ చేశారు. దీనికి #minnale అనే హ్యాష్‌ట్యాగ్‌తో లవ్ ఎమోజీ పెట్టారు నిఖిత.
నైట్ ఎఫెక్ట్‌లో షూట్ చేసిన ఈ సాంగ్‌లో సామంత్‌పై ఉన్న ఇష్టాన్ని అనామిక బయటపెడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీరిద్దరూ ప్రేమలో పడ్డారా? లేక సీరియల్ కోసం చేశారా? లేక రీల్ కోసమా? అంటూ నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X