అందాలతో మంటపెట్టేస్తోన్న బ్రహ్మముడి స్వప్న ... నీలిరంగు చీరలో అరాచకం!
సీరియల్స్ ఇపుడు అందంగా, గ్రాండీయర్‌గా తయారవుతున్నాయి. వెండితెరకు మించి బుల్లితెర ఉపాధిని కల్పిస్తోంది. భారతదేశంలో హిందీ సహా అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రతియేటా వందలాది సీరియల్స్, రియాలిటీ షోలు, ఇతర కార్యక్రమాలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయి. బుల్లితెరలో తమ ప్రతిభ చాటుకుంటున్న నటీనటులు వెండితెర వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా ఖచ్చితంగా బుల్లితెర నుంచి వచ్చిన వారు ఖచ్చితంగా కనిపిస్తారు.
స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ దాదాపు రెండేళ్లుగా ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇందులోని నటీనటులు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. ఒకప్పుడు హయ్యెస్ట్ రేటింగ్‌తో టాప్ ప్లేస్‌లో నిలిచిన ఈ ధారావాహిక కొన్ని కారణాలతో రేసులో వెనుకబడింది. అయినప్పటికీ తన స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది బ్రహ్మముడి. టైమింగ్స్ మార్చడం ఈ ధారావాహికను దెబ్బకొట్టింది. అయినప్పటికీ ప్రైమ్ టైమ్ సీరియల్స్‌తో పోటీ పడుతూ మంచి టీఆర్పీ సాధిస్తోంది బ్రహ్మముడి.

బిగ్‌బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి, తమిళ నటి దీపిక రంగరాజులు బ్రహ్మముడిలో లీడ్ రోల్‌లో పోషిస్తుండగా .. కన్నడ నటి షర్మిత గౌడ విలన్ రోల్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సీరియల్‌ను రక్తి కట్టిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సీరియల్ హీరోయిన్ పాత్ర అయిన కావ్యకి ఓ అక్క ఉంటుంది. డబ్బున్న కుటుంబానికి కోడలిగా వెళ్లి ఎంజాయ్ చేయాలనే మనస్తత్వమున్న అమ్మాయిగా ఆ పాత్ర ఉంటుంది. నిన్న మొన్నటి వరకు బిగ్‌బాస్ ఫేమ్ హమీదా ఖాతూన్ ఈ క్యారెక్టర్ పోషించేవారు. కానీ అనివార్య కారణాలతో ఆమె తప్పుకోవడంతో మరో నటి వచ్చి చేరారు.
ఆమె ఎవరో కాదు.. తెలుగు బుల్లితెరకు సుపరిచితురాలైన రూప ముగ్గళ్ల. తెలుగులో పలు టీవీ ఛానెల్స్‌లో ఈమె బాగా పాపులర్. ఎక్కువగా విలన్ రోల్స్‌తో ఫేమస్ అయిన రూపకు కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. బ్రహ్మముడిలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదట్లో అలవాటు చేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడినా తర్వాత కుదురుకుని అలవోకగా చేసుకెళ్లిపోతున్నారు. తన అత్త రుద్రాణిపై పంచ్‌లు వేయడంతో పాటు చెల్లెలు కావ్యకి అండగా నిలుస్తూ , కుటుంబానికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే పాత్రలో రూప అద్భుతంగా నటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురంకు చెందిన రూప ముగ్గళ్ల కుటుంబం హైదరాబాద్‌కు రావడంతో ఆమె ఇక్కడే చదువుకున్నారు. మంచి పర్సనాలిటీ, ఆకట్టుకునే రూపంతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తున్నారు రూప. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన సీరియల్స్, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇక సినిమా పాటలకు ఈమె చేసే రీల్స్‌కు ఫాలోయింగ్ ఉంది. అలాగే హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ సెగలు రేపుతుంటారు. తాజాగా నీలి రంగు చీర కట్టిన రూప.. తన ఒంపు సొంపులు, నాభి, నడుము అందాలతో గ్లామర్ షో చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం రూప అందాలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications










