Brahmamudi : అంతా క్లోజప్‌లోనే .. నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోన్న బ్రహ్మముడి బ్యూటీ
బుల్లితెరపై సీరియల్స్‌లో కనిపించే నటీనటులు హీరో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదు. ఒకప్పుడు సీనియర్ నటులు మాత్రమే సీరియల్స్‌లో కనిపించేవారు. కానీ ఇప్పుడు యంగ్ బ్యూటీస్ కూడా బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్నారు. సీరియల్స్‌లో హీరోయిన్, ఇతర సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించే ముద్దుగుమ్మల అంద చందాల ముందు సినిమా హీరోయిన్లు కూడా దిగదుడుపే అంటారు . అంతలా తమ గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తున్నారు సీరియల్ అమ్మాయిలు. తాజాగా బ్రహ్మముడి సీరియల్‌లో స్వప్న రోల్ చేస్తున్న రూప ముగ్గల్లా హాట్ వీడియోను షేర్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో స్టార్ మా జైత్రయాత్రకు ప్రధాన కారణం అందులోని సీరియల్సే. సరికొత్త హంగులతో తెరకెక్కే ఆ ధారావాహికలు కుటుంబ ప్రేక్షకులను ముఖ్యంగా మహిళా మణులను కట్టిపడేస్తున్నాయి. గతంలోస్టార్ మాలో టెలికాస్ట్ అయిన కార్తీక దీపం దెబ్బకు స్టార్ హీరోల సినిమాలు కూడా వణికిపోయాయంటే ఆ సీరియల్ ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. కార్తీక దీపం తర్వాత ప్రస్తుతం బ్రహ్మముడి ఆ స్థానాన్ని ఆక్రమించింది. బుల్లితెర ఎక్స్‌పర్ట్స్ చెబుతారు. మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు ఇందులో లీడ్ రోల్స్ పోషించారు.

సంపన్న కుటుంబానికి చెందిన భర్త, నిరుపేద కుటుంబానికి చెందిన భార్య, కోడలికి అండగా నిలిచే అత్తగారు ఇలాంటి కథతో చాలా సీరియల్సే వచ్చినా డిఫరెంట్ టేకింగ్‌తో బ్రహ్మముడి టాప్ సీరియల్‌గా దూసుకెళ్తోంది. బ్రహ్మముడి సీరియల్‌లోని పాత్రధారుల పేర్లు జనంలో బాగా ఫేమస్ అయ్యాయి. కనకం, కృష్ణమూర్తి, స్వప్న , అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక వంటి వారు నోటెడ్ అయ్యారు.
ఈ సీరియల్‌లో హీరోయిన్ కావ్యకు స్వప్న అనే అక్క ఉంటుంది. దుగ్గిరాల వారింటి ఆడపడచు కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకుంటుంది. తనకు ఎంతో సాయం చేసిన చెల్లెలిని సైతం ఇబ్బందుల్లోకి నెడుతుంది. తర్వాత మారిపోయి సోదరికి అండగా, అత్తకు తగ్గ కోడలిగా ఆమె వేసే ఎత్తుల్ని చిత్తు చేస్తుంది. డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్‌గా స్వప్న రోల్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. నిన్న మొన్నటి వరకు ఈ క్యారెక్టర్‌ను బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ హమీదా ఖాతూన్ పోషించారు.
కానీ అనివార్య కారణాలతో ఆమె అర్ధాంతరంగా తప్పుకోవడంతో రూప ముగ్గల్లా కొత్తగా ఎంట్రీ ఇచ్చారు. ఈమె బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే. గతంలో పలు ఛానెల్స్‌లో ప్రసారమైన సీరియల్స్, షోలలో ఆమె కనిపించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రూప .. ఎప్పటికప్పుడు రీల్స్, వీడియోలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆమె చేసిన వీడియో కుర్రాళ్లకు సెగలు రేపుతోంది. సిల్క్ శారీలో తన ఒంపు సొంపులు , నాభి, నడుము అందాలు చూపిస్తూ హాట్ హట్‌గా కనిపించారు రూప. చీర కుచ్చిళ్ల దగ్గరి నుంచి నాభి వరకు క్లోజప్ షాట్‌లో తీసిన ఆ వీడియో చూస్తే నిద్రపట్టడం కష్టమే. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోనూ చూసేయ్యండి.


Click it and Unblock the Notifications











