Brahmamudi : ఫ్రంట్ పార్ట్ కేక .. బ్యాక్ ఎందుకలా , బ్రహ్మముడి బ్యూటీని ఏకీపారేస్తోన్న నెటిజన్లు

తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో స్టార్ మా దూకుడుకు కారణం అందులోని సీరియల్సే. సరికొత్త హంగులతో తెరకెక్కే ఆ ధారావాహికలు కుటుంబ ప్రేక్షకులను ముఖ్యంగా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. గతంలో కార్తీక దీపం టీఆర్పీల దెబ్బకు స్టార్ హీరోల సినిమాలు కూడా గల్లంతయ్యాయంటే ఆ సీరియల్ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. కార్తీక దీపం తర్వాత రీసెంట్ డేస్‌లో బ్రహ్మముడి ఆ స్థానాన్ని ఆక్రమించిందని బుల్లితెర ఎక్స్‌పర్ట్స్ చెబుతారు. మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు ఇందులో లీడ్ రోల్స్ పోషించారు.

కార్తీక దీపానికి దగ్గరిగా ఉండే బ్రహ్మముడి కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. పెద్ద కుటుంబానికి చెందిన భర్త, పేదింటికి చెందిన భార్య, అహంకారి అయిన అత్తగారు మధ్యలో మారి కోడలికి అండగా నిలవడం ఇవన్నీ వంటలక్క, డాక్టర్ బాబుని గుర్తుచేస్తుంది. కాకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్ కారణంగా లేడీ ఆడియన్స్‌కి ఈ సీరియల్ తెగ నచ్చేస్తోంది. అక్టోబర్ మొదటి వారం నాటి డేటా ప్రకారం.. బ్రహ్మముడి సీరియల్ తన ఆధిపత్యాన్ని మరింత కొనసాగించింది. ధాని ధాటికి మిగిలిన సీరియల్స్ వెనుకబడిపోయాయి. 39వ వారంలో బ్రహ్మముడి సీరియల్ 13.39తో టాప్ ప్లేస్‌లో నిలవగా. సెకండ్ ప్లేస్‌లో బ్రహ్మముడి 2 నిలిచింది.

Brahmamudi Fame Rupa muggalla stunning Video in Traditional Saree Look trending in Instagram

బ్రహ్మముడి సీరియల్‌లోని పాత్రధారుల పేర్లు జనంలో బాగా ఫేమస్ అయ్యాయి. రాజ్- కావ్యలు తెలుగింటికి బాగా చేరువయ్యారు. వారితో పాటు కనకం, కృష్ణమూర్తి, స్వప్న , అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక వంటి వారు నోటెడ్ అయ్యారు. ముఖ్యంగా ఈ సీరియల్ హీరో హీరోయిన్లకు సమానంగా పేరు తెచ్చుకున్నారు రుద్రాణి క్యారెక్టర్ వేసిన శర్మిత గౌడ. బ్రహ్మముడిలో విలన్‌గా ఆమె అద్భుతంగా నటించారు.

ఇకపోతే.. ఈ సీరియల్‌లో హీరోయిన్ కావ్యకు స్వప్న అనే అక్క ఉంటుంది. దుగ్గిరాల వారింటికి కోడలిగా మోసం చేసి అడుగుపెడుతుంది. తర్వాత మారిపోయి చెల్లెలికి అండగా, అత్తకు తగ్గ కోడలిగా ఇరగదీస్తుంది . తన మనసులోని మాటను ఏమాత్రం మొహమాట పడకుండా చెప్పే డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్‌గా స్వప్న రోల్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. నిన్న మొన్నటి వరకు ఈ క్యారెక్టర్‌ను బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ హమీదా ఖాతూన్ పోషించారు.

కానీ ఆమె అర్ధాంతరంగా తప్పుకుని ఆ పాత్రలో రూప ముగ్గల్ల కనిపించారు. ఈమె బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే. గతంలో పలు ఛానెల్స్‌లో ప్రసారమైన సీరియల్స్, షోలలో ఆమె కనిపించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రూప .. ఎప్పటికప్పుడు రీల్స్, వీడియోలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆమె చేసిన వీడియోపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. బ్లూ కలర్ శారీలో తన ఒంపు సొంపులు , నాభి, నడుము అందాలు చూపిస్తూ హాట్ హట్‌గా ఉంది రూప.

అయితే వీడియో చేసే తొందరలో తన మిద్దెపై చెత్తను చూసుకోలేదు. రూప వీడియోలో ఆమె వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఎండిపోయిన ఆకులు, ఇతర చెత్త కనిపించడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ముఖానికి మేకప్ వేయడంలో చూపే శ్రద్ధ మిద్దెను నీట్‌గా ఉంచుకోవడంలోనూ చూపించాలని చురకలంటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X