Brahmamudi రుద్రాణి సాహసం... వెన్నులో వణుకు పుట్టించిన షర్మిత గౌడ!!

స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ధారావాహిక 1000 ఎపిసోడ్స్‌కు చేరువ అయ్యింది. ఈ సీరియల్‌లో నటించిన వారందరికీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. ఈ ధారావాహికలో రుద్రాణిగా విలన్ రోల్ పోషించి తెలుగువారి ఆదరణను దక్కించుకున్నారు కన్నడ షర్మిత గౌడ. ఇందులో కుటుంబంలో తగవులు పెడుతూ.. కుటుంబాన్ని విడగొట్టే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఈ సీరియల్ ఇంతటి సక్సెస్ కావడం వెనుక మెయిన్ పిల్లర్స్‌లో షర్మిత గౌడ ఒకరు.

మోడలింగ్ నుంచి బుల్లితెరకు
కర్ణాటకలోని చిక్‌మగళూరుకు చెందిన షర్మిత గౌడ... ఎంఎస్సీ బయో కెమెస్ట్రీ చదివిన ఉన్నత విద్యావంతురాలు. చదువు తర్వాత మోడలింగ్‌లో దిగిన ఈ ముద్దగుమ్మ... మిస్ కర్ణాటక ఫస్ట్ రన్నరప్ 2017లో నిలిచారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌గా, ఫ్యాషన్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా షర్మిత గౌడ బాగా ఫేమస్ అయ్యారు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పలు ఉత్పత్తుల గురించి రివ్యూలు చెప్పడంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 202K ఫాలోవర్స్ వున్నారు.

Brahmamudi Fame Sharmitha Gowda Adventure trip Her Latest Photos here

బ్రహ్మముడితో తెలుగులో పాపులర్
కన్నడ, తమిళ భాషల్లో పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు షర్మిత గౌడ. కేదార్ ప్రసాద్ గౌడను ఆమె వివాహం చేసుకున్నారు. ఈ దశలో ఆమెకు తెలుగులో బ్రహ్మముడి సీరియల్‌లో నటించే అవకాశం దక్కింది. బ్రహ్మముడి సీరియల్‌లో రుద్రాణిగా ఆమెకు పాపులారిటీ వచ్చింది. ఇక చిన్న వయసులోనే అత్త పాత్రలు చేయాల్సి వచ్చినా ఏమాత్రం భయపడకుండా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక షర్మిత గౌడకు ఒకరోజుకు 25 వేల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ కింద చెల్లిస్తున్నారు. దాంతో నెలకు ఆమె 10 లక్షల వరకు సంపాదిస్తున్నట్లుగా బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి.

డేరింగ్ అండ్ డాషింగ్
ఇక ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా మాట్లాడతారు షర్మిత గౌడ. రుద్రాణిగా తెరపై ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటారో.. బయట కూడా అదే డేరింగ్ అండ్ డాషింగ్‌ పర్సనాలిటీ ఆమెది. గతంలో బిగ్‌బాస్ తెలుగు విన్నర్‌గా కన్నడ నటుడు నిఖిల్ మలియాక్కల్ నిలిచినప్పుడు తెలుగు, కన్నడ వివాదం తలెత్తగా దానిపై ఘాటుగా స్పందించారు షర్మిత. తెలుగు, తమిళ, కన్నడ అనే భేదాలు లేవని స్పష్టం చేసింది. దాంతో ఆమెపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

షర్మిత సాహసం
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే షర్మిత గౌడ... ఎప్పటికప్పుడు తన సీరియల్స్, ఇతర వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తారు. ట్రావెలింగ్‌, ట్రెక్కింగ్, ఇతర అడ్వెంచర్స్ చేయడాన్ని ఇష్టపడే షర్మిత గౌడ తనకు తీరిక ఉన్నప్పుడల్లా ప్రపంచంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తుంటారు. తాజాగా షర్మిత గౌడ ఓ ట్రిప్ వేసి దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నారు. ఇందులో పులి పిల్లలను ఒడిలో పెట్టుకుని ఆడిస్తూ.. ఏనుగు తొండంతో ఆడుకుంటున్న ఫోటోలు చూసి నెటిజన్లు వణికిపోతున్నారు. మీ గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: brahmamudi sharmitha gowda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X