బ్రహ్మముడి విలన్‌కి ఇంత పెద్ద కొడుకున్నాడా? రుద్రాణి వారసుడు ఏం చేస్తున్నాడంటే?

స్టార్ మా ఛానెల్‌‌లో పాపులర్ సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. వీటిలో బ్రహ్మముడి కూడా ఒకటి. ఫ్యామిలీ ఎమోషన్స్, రివెంజ్ డ్రామా, అత్తింటి కోసం ఓ కోడలి పోరాటం అన్నీ కలగలిపి తెరకెక్కించిన ఈ ధారావాహిక.. మహిళా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. ఈ సీరియల్‌లో నటించిన ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీని సంపాదించారు. రాజ్, కావ్యలుగా నటించిన మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజులతో పాటు ఈ సీరియల్‌లో విలన్ రుద్రాణిగా నటించిన షర్మిత గౌడ కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు.

తనను పెంచి పెద్ద చేసిన కుటుంబం మీదే పగబట్టి.. ఆస్తిని కొట్టేయాలని నిత్యం కుట్రలు చేసే పాత్రలో షర్మిత అద్భుతంగా నటించారు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఎమోషన్స్‌కి తోడు రుద్రాణి ఎత్తులు.. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అయితే కొద్దిరోజుల క్రితం రుద్రాణి పెట్టించిన బాంబుకి దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. కొనఊపిరితో ఉన్న రాజ్.. రాహుల్‌ని, ఆ వెంటనే రుద్రాణిని కావ్య అంతం చేసి చనిపోతారు. చివరికి దుగ్గిరాల ఫ్యామిలీలో నుంచి ముగ్గురు పిల్లలు, అపర్ణ- సుభాష్, రుద్రాణి కూతురు రేఖ, అపర్ణ మనవడు రాజ్ మాత్రమే ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడతారు.

Brahmamudi Fame Sharmitha Gowda s Son Photos Go Viral Fans Surprised to See Her Grown-Up Son

కథకి ఆయువు పట్టులాంటి రాజ్, కావ్య, రుద్రాణి పాత్రలు చనిపోవడంతో బ్రహ్మముడి సీరియల్ కథ వీక్ అయ్యింది. తల్లి పగని, దుగ్గిరాల కుటుంబ ఆస్తిని దక్కించుకునే బాధ్యతను తీసుకున్న రుద్రాణి కూతురు రేఖ.. రాజ్- కావ్యల కూతురు ఇందూ.. అపర్ణ మనవడు రాజ్ ఇతర కొత్త క్యారెక్టర్ల చుట్టూ కథను నడిపిస్తున్నారు. రేఖ నుంచి తన ఆస్తిని, కంపెనీని, కుటుంబాన్ని ఇందూ ఎలా కాపాడుకుంది? ప్రమాదంలో కుటుంబానికి దూరమైన అపర్ణ మనవడు రాజ్ తిరిగి ఎలా కలుసుకున్నాడు? ఇందూ అక్కచెల్లెళ్లు తిరిగి ఒక్కటయ్యారా? అనే దాని చుట్టూ ఈ కొత్త బ్రహ్మముడి నడుస్తోంది. అయితే రుద్రాణి లాంటి క్రూరమైన విలన్ లేకపోవడంతో ఆమె అభిమానులు బాధపడుతున్నారు.

బ్రహ్మముడి సీరియల్‌‌లో తన పాత్ర ముగియడంతో కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు షర్మిత. ప్రస్తుతం ఆమె ఏ ప్రాజెక్ట్స్‌లో ఉన్నారో తెలియరాలేదు. కర్ణాటకకు చెందిన షర్మిత 1990 నవంబర్ 20న జన్మించారు. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. 2017లో మిస్ కర్ణాటక టైటిల్ కిరీటం సాధించారు. ఆపై కన్నడ, తమిళ బుల్లితెర పరిశ్రమల నుంచి ఆహ్వానం అందుకున్నారు షర్మిత. ఆయా సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న షర్మిత.. బ్రహ్మముడి ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించి సత్తా చాటారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తన సీరియల్స్ , ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన కొడుకుతో ఉన్న ఫోటోలను షేర్ చేసి షాకిచ్చారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు షర్మితకు అంత పెద్ద కొడుకు ఉన్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోయే షర్మిత ఇప్పటికీ చెక్కుచెదరని గ్లామర్‌తో కుర్రభామలకు పోటీ ఇస్తుంటారు. అలాంటిది రుద్రాణి కొడుకుని చూసి అవాక్కవుతున్నారు. సోషల్ మీడియాలో ఉన్న సమాచారాన్ని బట్టి ఈ కుర్రాడి పేరు స్కంధ. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ ప్లేయర్ అవ్వాలని కలలు కనడంతో పాటు దానికి తగ్గ శిక్షణను కూడా తీసుకున్నాడు స్కంధ.

పోర్చుగీస్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోను ఎంతో ఇష్టపడే స్కంధ.. తను కూడా ఆయన లాగే ఎదగాలని కోరుకుంటున్నాడు. షర్మిత ఆమె భర్త కూడా కుమారుడికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తూ అతని ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న స్కంధకు షర్మిత గౌడ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలియజేశారు. నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు గొప్ప వ్యక్తిగా ఎదగటం చూడటం నా జీవితంలో లభించిన గొప్ప వరాలలో ఒకటి. ఎప్పుడూ నవ్వుతూ, కలలు కంటూ నీలాగే ఉండు అంటూ షర్మిత గౌడ రాసుకొచ్చారు. ప్రస్తుతం కొడుకుతో స్కంధతో ఉన్న షర్మిత గౌడ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read more about: brahmamudi sharmitha gowda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X