లావెండర్ తోటలో చిలిపి చేష్టలు.. తలుపు చాటున కవ్విస్తోన్న బ్రహ్మముడి విలన్

సినీనటులతో సమానంగా బుల్లితెర నటులు ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతున్నారు. పారితోషికాలతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్, అవకాశాల విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. హీరో హీరోయిన్లకు అబ్బాయిలు, అమ్మాయిలే అభిమానులుగా ఉంటారు. కానీ బుల్లితెర నటులకు మాత్రం చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అంతా ఫ్యాన్సే. సోషల్ మీడియాలోనూ వారిని అనుసరించే వారు కూడా మిలియన్ల రేంజ్‌లో ఉన్నారు. వారేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అనే సంగతులను వీరు ఫాలో అవుతూనే ఉంటారు.

రుద్రాణిగా క్రూరత్వం

తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపైనా కన్నడ నటీనటుల డామినేషన్ ఎక్కువే. టెలివిజన్ రంగంపై మాత్రం వారి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగులో ఏ ఛానెల్ తీసుకున్నా, ఏ సీరియల్ తీసుకున్నా కన్నడ నటులు లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఈ కోవలోకే వస్తారు షర్మిత గౌడ. స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడిలో విలన్‌గా నటిస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. తనను పెంచి పెద్ద చేసిన కుటుంబానికి వెన్నుపోటు పొడిచి, అందరి మధ్య తగవులు పెడుతూ ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలనుకునే క్యారెక్టర్ పోషిస్తున్నారు.

Brahmamudi Fame Sharmitha Gowda Shares Her foreign vacation photos

మిస్ కర్ణాటక టైటిల్ విన్నర్

సీరియల్ చూసిన వారంతా షర్మిత క్రూరత్వం చూసి ఆమెను తిట్టుకుంటూ, శాపనార్ధాలు పెట్టేవారు. అంటే ఆమె నటనతో ఎలాంటి ముద్రవేశారో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి హీరోయిన్లను మించిన అందగత్తె అయిన షర్మిలను ఈ సీరియల్ కోసం అమ్మని, అత్తని, నానమ్మని చేసేశారు. తనకంటే పెద్దవారి చేత అలా పిలుపించుకుంటున్నా.. నటన విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని నిరూపిస్తున్నారు షర్మిత. 1990 నవంబర్ 20న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు షర్మిత. చదువు తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈమె 2017లో మిస్ కర్ణాటక టైటిల్ విన్నర్ కావడం విశేషం. ఈ ఫేమ్‌తో పలు కన్నడ, తమిళ్ సీరియల్స్‌లో ఆమెకు అవకాశాలు దక్కాయి. అలా బ్రహ్మముడిలో రుద్రాణి పాత్ర పోషించే ఛాన్స్ షర్మితకు దక్కింది.

మోడ్రన్ డ్రెస్‌లో సెగలు

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు షర్మిత గౌడ. తన సీరియల్స్, షోలు, ఇతర వ్యక్తిగత విషయాలను ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో ఆమె కుర్రాళ్లకి సెగలు రేపుతుంటారు. సీరియల్స్‌లో చీరకట్టి ఎంతో పద్ధతిగా కనిపించే షర్మిత గౌడ.. నిజ జీవితంలో మాత్రం లేటెస్ట్ ఫ్యాషన్‌లో అప్‌డేట్‌గా ఉంటారు. మోడ్రన్ డ్రెస్సులు బికినీలతో సందడి చేస్తుంటారు. షూటింగ్ లేని సమయాల్లో విహారయాత్రలకు వెళ్లడం షర్మిత గౌడకు అలవాటు.

లావెండర్ తోటలో సందడి

తాజాగా ఆమె ఫారిన్ ట్రిప్ వేశారు. లావెండర్ పూలు సాగు చేసే తోటలోకి వెళ్లి సందడి చేశారు. గుర్రం పక్కన నిలబడి కౌబాయ్‌‌తో ఫోటో దిగారు. అంతకుముందు బురదతో నిండిన అగ్నిపర్వతం దగ్గరికి వెళ్లి మంట పెడుతూ ఆటలు ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షర్మిత గౌడ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం షర్మిత అందాలపై ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X