Brahmamudi : బ్రహ్మముడిలో క్రూరంగా , సోషల్ మీడియాలో మాత్రం ఇలా.. రుద్రాణి మతిపోగోడుతోందిగా!
ఇటీవలి కాలంలో సీరియల్స్‌లో హీరోయిన్లుగా, ఇతర సహాయక పాత్రల్లో కనిపిస్తున్న అమ్మాయిలు మోస్ట్ టాలెంటెడ్. అందం, అభినయంలో వీళ్లకు వంక పెట్టడానికి లేదు. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్లను మించిన అందం వీరి సొంతం. ఈ కోవలోకే వస్తారు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో విలన్‌గా నటిస్తున్న షర్మిత గౌడ. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే :
బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం తెలుగు ధారావాహికల్లో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తోంది. బడా హీరోల సినిమాల రేటింగ్స్ కూడా ఈ సీరియల్ దరిదాపుల్లో లేవంటే అతిశయోక్తి కాదు. ఆకట్టుకునే కథ, కథనం, భార్యాభర్తలు, అత్తాకోడళ్ల మధ్య జరిగే ఘటనలను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన ఈ ధారావాహికకు మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సీరియల్‌లో నటిస్తున్న వారికి అదే స్థాయిలో క్రేజ్ దక్కుతోంది.

ముఖ్యంగా ఈ సీరియల్‌లో రాజ్, కావ్యల పాత్రలతో సమానంగా పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ రుద్రాణి. కన్నడ నటి షర్మిత గౌడ బ్రహ్మముడిలో విలన్‌గా అద్భుతంగా నటించారు. తనను ఆదరించిన కుటుంబంలోని వ్యక్తుల మధ్య గొడవలు పెడుతూ.. కాపురాలు కోల్పోయేలా చేసే జిత్తులమారి నక్కలాంటి రుద్రాణి క్యారెక్టర్‌లో షర్మిత ఒదిగిపోయారు. రాజ్ - కావ్యలను కలపాలని దుగ్గిరాల ఫ్యామిలీ, కనకం ప్రయత్నించిన ప్రతిసారి పుడింగిలా దూరి రుద్రాణి చెడగొడుతూ ఉంటుంది. నిజానికి హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందగత్తె అయిన ఈమెను అమ్మ, అత్త క్యారెక్టర్‌లకు అంకితం చేసేశారు బుల్లితెర మేకర్స్.
చిన్న వయసులోనే అమ్మ, అత్త పాత్రలలో నటించడానికి ఏమాత్రం నో చెప్పకపోవడం వృత్తిపట్ల షర్మిత అంకితభావానికి నిదర్శనం. ఆమె వయసు కేవలం 34 ఏళ్లే.. కర్ణాటకకు చెందిన షర్మిత 1990 నవంబర్ 20న జన్మించారు. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె 2017లో మిస్ కర్ణాటక టైటిల్ విన్నర్ కావడం విశేషం. ఈ ఫేమ్‌తో పలు కన్నడ, తమిళ్ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు షర్మిత.
ఈ నేపథ్యంలో బ్రహ్మముడిలో రుద్రాణి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే షర్మిత తన సీరియల్స్ , ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా శారీ కట్టుకుని బాల్కనీలో నిలబడి కొంటె చూపులు చూస్తున్న ఫోటోలను షర్మిత గౌడ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ చీరపై పూల డిజైన్ వేసి ఉండగా ఆమె ఎద అందాలను ఆరబోస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం షర్మిత ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











