Brahmamudi : పొట్టి గౌనులో బ్రహ్మముడి విలన్ కవ్వింపులు.. హీరోయిన్లనే తలదన్నే అందం
అందం, అభినయం ఉన్న వాళ్లకి బుల్లితెరపై అద్భుతమైన అవకాశాలు దక్కుతున్నాయి. కాస్త టాలెంట్ ఉంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇక సీరియల్స్‌లో హీరోయిన్లుగా, ఇతర సహాయక పాత్రలు పోషించే అమ్మాయిలు చాలా అందంగా ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్లను మించిన అందం వీరి సొంతం. ఈ కోవలోకే వస్తారు తెలుగులో మా టీవీలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో విలన్‌గా నటిస్తున్న షర్మిత గౌడ. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే :
మాటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ తెలుగు బుల్లితెరపై టాప్ టీఆర్పీలను దక్కించుకుని దూసుకెళ్తున్నాయి. గతంలో కార్తీక దీపం ధారావాహిక గతంలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సీరియల్ తర్వాత రీసెంట్ డేస్‌లో బ్రహ్మముడి ఆ స్థానాన్ని ఆక్రమించిందని బుల్లితెర ఎక్స్‌పర్ట్స్ చెబుతారు. మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు ఇందులో లీడ్ రోల్స్ పోషించారు. అక్టోబర్ మొదటి వారం నాటి డేటా ప్రకారం.. బ్రహ్మముడి సీరియల్ తన ఆధిపత్యాన్ని మరింత కొనసాగించింది. ధాని ధాటికి మిగిలిన సీరియల్స్ వెనుకబడిపోయాయి. 39వ వారంలో బ్రహ్మముడి సీరియల్ 13.39తో టాప్ ప్లేస్‌లో నిలవగా. సెకండ్ ప్లేస్‌లో కార్తీక దీపం 2 నిలిచింది.

బ్రహ్మముడి సీరియల్‌లోని పాత్రధారుల పేర్లు జనంలో బాగా ఫేమస్ అయ్యాయి. రాజ్- కావ్యలు తెలుగింటికి బాగా చేరువయ్యారు. వారితో పాటు కనకం, కృష్ణమూర్తి, స్వప్న , అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక వంటి వారు నోటెడ్ అయ్యారు. ముఖ్యంగా ఈ సీరియల్ హీరో హీరోయిన్లకు సమానంగా పేరు తెచ్చుకున్నారు రుద్రాణి క్యారెక్టర్ వేసిన శర్మిత గౌడ. బ్రహ్మముడిలో విలన్‌గా ఆమె అద్భుతంగా నటించారు.
తనను ఆదరించిన కుటుంబంలోని వ్యక్తుల మధ్య గొడవలు పెడుతూ.. కాపురాలు కోల్పోయేలా చేసే రుద్రాణి క్యారెక్టర్‌లో షర్మిత ఒదిగిపోయారు. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందగత్తె అయిన ఈమె సీరియల్స్‌లో అమ్మ, అత్త పాత్రలలో నటించడానికి ఏమాత్రం మొహమాట పడకపోవడం షర్మిత అంకితభావానికి నిదర్శనం. ఆమె వయసు కేవలం 34 ఏళ్లే.. కర్ణాటకకు చెందిన షర్మిత 1990 నవంబర్ 20న జన్మించారు. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె 2017లో మిస్ కర్ణాటక టైటిల్ విన్నర్ కావడం విశేషం.
ఈ ఫేమ్‌తో పలు కన్నడ, తమిళ్ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న షర్మిత.. బ్రహ్మముడి ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తన సీరియల్స్ , ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఏదో పార్టీకి వెళ్లిన షర్మిత గౌడ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో పొట్టి గౌనులో కాలు మీద కాలు వేసుకుని, నల్ల కళ్లజోడు పెట్టి స్టైలీష్‌గా కనిపిస్తున్నారు షర్మిత. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











