56 అంతస్తుల బిల్డింగ్‌పై బ్రహ్మముడి భామ అరాచకం.. గ్లామర్ షోతో రెచ్చ గొడుతూ..
ఇటీవలి కాలంలో సీరియల్స్‌లో హీరోయిన్లుగా, అమ్మ, అక్క, వదిన తదితర సహాయక పాత్రల్లో కనిపిస్తున్న అమ్మాయిలు మోస్ట్ టాలెంటెడ్. అందం, అభినయంలో వీళ్లకు వంక పెట్టడానికి లేదు. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్లను మించిన అందం వీరి సొంతం. ఈ కోవలోకే వస్తారు స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో విలన్‌గా నటిస్తున్న షర్మిత గౌడ. నక్కలాంటి తెలివితేటలు, ఇంట్లో చిచ్చుపెట్టే పాత్రలో షర్మిత అద్భుతంగా నటిస్తున్నారు.
నిజానికి హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందగత్తె అయిన ఈమెను చిన్న వయసులోనే అమ్మ, అత్త క్యారెక్టర్‌లకు అంకితం చేసేశారంటూ బుల్లితెర ప్రేక్షకులు మండిపడుతుంటారు. చిన్న వయసులోనే వయసు మళ్లిన పాత్రలలో నటించడానికి ఏమాత్రం నో చెప్పకపోవడం వృత్తిపట్ల షర్మిత అంకితభావానికి నిదర్శనం. నిజానికి ఆమె వయసు కేవలం 34 ఏళ్లే.. కర్ణాటకకు చెందిన షర్మిత 1990 నవంబర్ 20న జన్మించారు. చదువు పూర్తి చేసిన అనంతరం మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె 2017లో మిస్ కర్ణాటక టైటిల్ విన్నర్ అయ్యారు.

ఈ ఫేమ్‌తో పలు కన్నడ, తమిళ్ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు షర్మిత. ఈ నేపథ్యంలో బ్రహ్మముడిలో రుద్రాణి క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ సీరియల్‌లో హీరో మానస్ నాగులపల్లి, హీరోయిన్ దీపిక రంగరాజులను మించి డామినేట్ చేసే పాత్రలో షర్మిత జీవిస్తున్నారు. ఎపిసోడ్‌కు రూ. 20,000 నుంచి రూ.25,000కు పైగా తీసుకునే షర్మిత నెలకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సంపాదిస్తారని బుల్లితెర వర్గాలు చెబుతుంటాయి.
షూటింగ్స్ లేనప్పుడు కుటుంబంతో , సన్నిహితులతో గడిపేందుకు ఇష్టపడే షర్మిత వీలున్నప్పుడల్లా విహారయాత్రకు వెళ్తుంటారు. అది ఇండియా కావొచ్చు, ఫారిన్ కావొచ్చు ట్రిప్ వేయాల్సిందే. కొద్దిరోజుల క్రితం కజకస్థాన్‌లో స్నేహితులతో ఎంజాయ్ చేసిన షర్మిత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈమెకు దైవభక్తి కూడా ఎక్కువే. మొన్నామధ్య ప్రయాగ్ రాజ్ వెళ్లి త్రివేణి సంగమంలో మునక వేసింది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే షర్మిత తన సీరియల్స్ , ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ట్రిప్ వేశారు . దుబాయ్‌లోని మానవ నిర్మిత ద్వీపం పామ్ ఐలాండ్స్‌ను సందర్శించారు షర్మిత. ద్వీపం, దుబాయ్ అందాలను వీక్షించేందుకు వీలుగా నిర్మించిన బుర్జ్ అల్ అరబ్‌లోని 56వ అంతస్తుకు చేరుకుని హల్ చల్ చేశారు. దుబాయ్ అందాలను కెమెరాలో బంధిస్తూ , సెల్ఫీలు దిగుతూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం షర్మిత ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











