Brahmamudi Kavya Remuneration: దీపిక రంగరాజుకు భారీ రెమ్యూనరేషన్.. పారితోషికంలో వంటలక్కను దాటిపోయిందా?

Brahmamudi Kavya Remuneration: తెలుగు బుల్లితెరపై సీరియల్స్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. కథలు రొటీన్‌గా ఉన్నా, ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం ఈ సీరియల్స్‌ను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఒకప్పుడు కార్తీక దీపం ( Karthika Deepam) సీరియల్ టాప్ రేటింగ్స్‌తో దూసుకెళ్తుందేది. ఆ సీరియల్ కు పోటీ అనేదే ఉండకపోయేది. కానీ, ప్రస్తుతం అదే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతున్న మరో సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్‌లో కావ్య పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి దీపిక రంగరాజు (Deepika Rangaraju) ఇప్పుడు బుల్లితెరలో హాట్ టాపిక్‌గా మారింది.

'బ్రహ్మముడి' సీరియల్ తక్కువ కాలంలోనే టాప్ రేటింగ్‌ను సాధించడం విశేషం. మధ్యతరగతి అమ్మాయిగా, ఆత్మగౌరవం ఉన్న భార్యగా కావ్య పాత్రలో దీపిక రంగరాజు తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ డ్రామాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అందుకే ఈ సీరియల్‌తో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

Brahmamudi Kavya Salary Deepika Rangaraju Remuneration Beats Top TV Stars Buzz

దీపిక రంగరాజు అసలు తమిళనాడుకు చెందినది. మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్న ఆమె, కాలేజీ రోజుల నుంచే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నటనపై ఆసక్తిని పెంచుకుంది. తరువాత తమిళంలో న్యూస్ ప్రెజెంటర్‌గా కెరీర్ ప్రారంభించి, 'చిత్రిరమ్ పెసుతాడి' అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ సీరియల్ సక్సెస్‌తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అదే ఫాలో అయి తెలుగులో 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఛాన్స్ దక్కింది.

తెలుగులో మొదటి సీరియల్‌తోనే ఆమె భారీ పాపులారిటీ సంపాదించడం విశేషం. ముఖ్యంగా కావ్య పాత్రలో ఆమె నటన సహజంగా ఉండటం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. కేవలం సీరియల్ మాత్రమే కాదు, రియాలిటీ షోలలో కూడా పాల్గొంటూ తన అల్లరి, కామెడీ టైమింగ్‌తో మరింత దగ్గరైంది. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతోంది.

అయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం బహ్మముడి కావ్య రెమ్యూనరేషన్. టీవీ వర్గాల సమాచారం ప్రకారం.. దీపిక రంగరాజు ఒక్క రోజు షూటింగ్‌కు సుమారు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆమె పాపులరిటీ క్రమంగా పెరగడంతో పారిదోషికం కూడా పెరిగిందని అంటున్నారు. నెలలో సుమారు 20 నుంచి 25 రోజులు షూటింగ్ ఉంటే.. ఆమె నెలకు రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉందని అంచనా.

ఈ రెమ్యూనరేషన్‌ను బుల్లితెర టాప్ నటి ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath)తో పోల్చుతున్నారు. 'కార్తీక దీపం'లో వంటలక్క పాత్రతో ప్రసిద్ధి చెందిన ప్రేమి విశ్వనాథ్ ఒక్క రోజు షూటింగ్‌కు సుమారు రూ.50 వేల వరకు తీసుకుంటారని సమాచారం. ఇప్పుడు అదే స్థాయిలో దీపిక కూడా రెమ్యూనరేషన్ అందుకుంటుండటంతో, ఆమె క్రేజ్ ఎలాంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీపిక రంగరాజు కేవలం సీరియల్ ద్వారా మాత్రమే కాకుండా, సోషల్ మీడియా బ్రాండ్ ప్రమోషన్స్, ఈవెంట్స్, రియాలిటీ షోల ద్వారా కూడా మంచి ఆదాయం పొందుతోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉండటం వల్ల బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి.

ఇలా 'బ్రహ్మముడి' సీరియల్ ద్వారా దీపిక రంగరాజు బుల్లితెరలో స్టార్‌గా ఎదిగింది. తక్కువ కాలంలోనే మంచి పేరు, డబ్బు సంపాదించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇక రానున్నరోజుల్లో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా? లేదా బుల్లితెరలోనే టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ప్రస్తుతానికి 'కావ్య'పాపులరిటీ మామూలుగా లేదనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X