Brahmamudi May 23rd episode: రుద్రాణి కుట్ర తెలుసుకున్న కావ్య.. రాజ్ తో ఛాలెంజ్ చేస్తున్న చిత్ర!
అప్పు ద్వారా నిజం తెలుసుకున్న రాజ్ కావ్యని కాపాడుకుంటాడు. తర్వాత మాయ జోలికి వెళ్ళొద్దంటూ హెచ్చరిస్తాడు. బిడ్డ తల్లిని తీసుకొని వస్తానంటూ మాయని ఇంటికి తీసుకువస్తుంది కావ్య. కానీ అక్కడ ప్లేట్ ఫిరాయిస్తుంది మాయ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక మే 23వ తేదీ ఎపిసోడ్ 417 లో ఏం జరిగిందంటే..
ఇప్పుడే ఆ మాయ ఎవరో తెలుసుకొని బయటికి గెంటేస్తాను అంటుంది కావ్య. కోరి కోరి సవతిని ఎవరూ ఇంటికి తీసుకురారు, అది అప్పుడే హక్కులు, కోడలు అంటూ ఏవేవో మాట్లాడుతుంది ఎలా హ్యాండిల్ చేస్తావో అని భార్యని తిట్టుకుంటూ వెళ్లిపోతాడు రాజ్. సుభాష్ కూడా ఏం జరుగుతుందో చూద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మాయ, రుద్రాణి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న రాహుల్ ఇదంతా నీ ప్లానా మమ్మీ అని ఆశ్చర్యంగా అడుగుతాడు.

అవును ఈ ఇంటిని ముక్కలు చేయడానికి ఒక కత్తిని పదునుపెట్టి ఈ ఇంటికి తీసుకువచ్చాను, మీ అమ్మని తక్కువగా అంచనా వేయకు అంటుంది రుద్రాణి. అవును మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి నేను మోసపోయాను అంటూ అక్కడికి వస్తుంది కావ్య. రుద్రాణి వాళ్ళు ముందుగా షాక్ అవుతారు కానీ నిజం తెలిస్తే ఏంటి నువ్వు లోపలికి వెళ్లి నిజం చెప్పలేవు కదా. నువ్వు, మా అన్నయ్య మాట్లాడుకున్నదంతా విన్నాను.
అందుకే నువ్వు వెతకాలనుకున్న అడ్రస్ లో ఒక ముసలమ్మని పెట్టి ఈ చిత్ర ని మాయ లాగా మార్చి ఇక్కడ తీసుకువచ్చేలా చేశాను. నీకు నిజం చెప్పాలని ఉంటే ఇప్పుడే వెళ్లి చెప్పు అని కావ్య ని రెచ్చగొడుతుంది రుద్రాణి. చెప్తాను కానీ ఇప్పుడు కాదు ఆ సమయం కూడా దగ్గరలోనే ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. తనని రెచ్చగొడతావేంటి అంటాడు రాహుల్.

అయినా కూడా తను ఏమీ చేయలేదు అంటుంది రుద్రాణి. మరోవైపు ఇంట్లో జరుగుతున్న పరిణామాలకి బాధపడుతూ ఉంటాడు రాజ్.అప్పుడే అక్కడికి మాయ వస్తుంది. ఏం కావాలి అంటాడు రాజ్. నువ్వే కావాలి అంటుంది మాయ. నా భార్యవి అంటున్నావు కదా ఇప్పుడే సంసారం చేద్దాం రా అంటూ ఆమెని బెడ్ పైకి నెట్టేస్తాడు రాజ్. ఆమె కంగారు పడుతుంది అనుకుంటాడు కానీ ఆమె బరితెగించి అతనిని బెడ్ మీదకి లాగుతుంది.

ఆమె ప్రవర్తన భరించలేక చిరాకు పడతాడు రాజ్. అన్నిటికీ తెగించే నేను ఇక్కడికి వచ్చాను ఎప్పటికీ నేను నీకు భార్యనే మళ్లీ వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాయ. తర్వాత అక్కడికి వచ్చిన కావ్య జరిగిందంతా చూశాను ఏంటి విషయం అంటుంది. ఏదో బెదిరిద్దామనుకున్నాను కానీ అది మామూలు ఆడది కాదు, ఎలాగోలా దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్.

తరువాయి భాగంలో మాయ కాఫీ చేసి చిట్టికి ఇస్తుంది. నేను కాఫీ బాగా కలుపుతాను తీసుకోండి అమ్మమ్మ గారు అంటుంది. వరసలు కూడా బాగా కలుపుతావని అర్థమైంది కానీ నేను మా కావ్య చేతి కాఫీ యే తాగుతాను అంటుంది చిట్టి. ఆ తర్వాత మాయ, కావ్య ఇద్దరూ ఒకేసారి అపర్ణ దగ్గరకి కాఫీ తీసుకువెళ్తారు. ఎవరిది తీసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంది అపర్ణ.


Click it and Unblock the Notifications










