Brahmamudi : రేంజ్ రోవర్‌తో బ్రహ్మముడి రాజ్ అరాచకం .. హీరోలను మించి స్టైలిష్‌గా
స్టార్ మాలో దుమ్మురేపిన కార్తీకదీపం సీరియల్ తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో టీఆర్‌పీలు కుమ్మిపడేస్తోంది బ్రహ్మముడి. టైమింగ్స్ మార్చి విసిగించినా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ ధారావాహికకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. మధ్యలో కాస్త తడబడినట్లుగా అనిపించినా తిరిగి బ్రహ్మముడి గాడిన పడిందని బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. బ్రహ్మముడిలో హీరో రాజ్‌గా బుల్లితెర నటుడు , బిగ్‌బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి హీరోగా నటించారు.
ఆగస్ట్ 2, 1990న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించారు మానస్ నాగులపల్లి. ఆయన పూర్తి పేరు మాస్టర్ రామ్ తేజ. చిన్నతనం నుంచే మానస్ తన టాలెంట్‌తో అందరి ప్రశంసలు పొందాడు. డ్యాన్సులు, యాక్టింగ్‌లోనే కాకుండా చదువుల్లోనూ ఆయన ముందుండేవాడు. చదువులో టాప్ ర్యాంక్ సాధించిన ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ప్రశంసలు అందుకొన్నాడు. అటు డ్యాన్సుల్లో ఇరుగదీసి.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా అవార్డు అందుకొన్నాడు మానస్ .

చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తితో ఉన్న మానస్.. బాల నటుడిగా 2001లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. బీ గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన ఆయన క్షీరసాగర మథనం, అర్జున్, వీడే లాంటి సినిమాల్లో హీరోగానూ అలరించారు. ఈ ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగులో అవకాశం దక్కించుకుని తెలుగు లొగిళ్లకు మరింత అయ్యాడు. తన ఆట తీరుతో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడమే కాకుండా భారీగా ఓట్లు సాధించాడు. అయితే బిగ్‌బాస్ టైటిల్ తృటిలో మిస్ చేసుకున్నాడు.
బిగ్‌బాస్ రియాలిటీ షో మానస్‌ను కెరీర్‌ను మలుపుతిప్పింది. ఈ షో తర్వాత మానస్‌కు సినిమాలు, సీరియల్స్‌లో ఆఫర్లు వచ్చాయి. బుల్లితెరపై ఫోకస్ చేసిన ఆయన కోయిలమ్మ, కార్తీక దీపంతో మంచి గుర్తింపు తెచ్చుకుని బ్రహ్మముడిలో హీరోగా అవకాశం పొందాడు. ఇక యాంకర్ విష్ణుప్రియతో కలిసి చేసిన ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో నడిచింది. ఈ దశలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీజ నిశ్శంకరను పెళ్లి చేసుకున్నారు మానస్. గతేడాది తండ్రైన ఈయన తన బిడ్డకు ధ్రువ నాగులపల్లి అని నామకరణం చేశాడు.
ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ చేసిన మానస్ .. మరిన్ని అవకాశాలు పొందేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మానస్ ఎప్పటికప్పుడు తన షోలు, సీరియల్స్, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటాడు. తాజాగా రేంజ్ రోవర్ కారు ముందు అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో చేసిన ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. హీరోలను మించి స్టైలీష్ లుక్‌లో ఆకట్టుకుంటున్న మానస్ ఫోటోలు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. వీటిని నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











