Brahmamudi June 10th episode: అపర్ణని తప్పుపడుతున్న సీతారామయ్య.. కావ్య పై ఫైర్ అవుతున్న స్వప్న!
అనామిక ఇంట్లో చెక్ దొంగతనం చేయడం గమనించి అందరి ముందు దోషిగా నిలబెడుతుంది స్వప్న. దొంగ మాయ గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఆమెని బెదిరించి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోమంటాడు. కానీ మాయ తర్వాత ప్లేట్ ఫిరాయిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 10వ తేదీ ఎపిసోడ్ 432 లో ఏం జరిగిందంటే..
దిగులుగా వారి గదిలో కూర్చున్న అత్తమామల దగ్గరికి వచ్చి అక్కడ పెళ్లి జరుగుతుంటే ఇలా కూర్చున్నారేమి పెళ్లి దగ్గరికి రండి అని ఆహ్వానిస్తుంది అపర్ణ. వాళ్లని ఏమని ఆశీర్వదించమంటావు అని అడుగుతుంది ఇందిరా దేవి. నాకు మాత్రం ఈ పెళ్లి చేయడం ఇష్టమా.. బిడ్డకి న్యాయం చేయటం కోసమే ఇలా చేస్తున్నాను అంటుంది అపర్ణ. మరి కావ్య జీవితానికి న్యాయం చేయగలవా అని అడుగుతాడు సీతారామయ్య. అప్పుడు ఇందిరా దేవి మాట్లాడుతూ వస్తాంలే పంచభూతాలు లాగా సాక్షి భూతంగా పెళ్లి చూస్తాము అనటంతో అపర్ణ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మరో వైపు పెళ్లి పీటల మీద కూర్చున్న మాయని అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారు పూజారి. రుద్రాణి ఆశీర్వదిస్తుంది, స్వప్న కావ్య తో మాట్లాడుతూ వెళ్ళు, ఆశీర్వదించు, కాసేపట్లో ఎలాగూ ఈ పెళ్లి జరిగిపోతుంది నీ భర్త చేయి పట్టుకొని తను మీ గదిలోకి అడుగుపెడుతుంది నువ్వు హారతి ఇచ్చి పక్కకి తప్పుకుందువుగానివి అని చెల్లెలిపై ఫైర్ అవుతుంది.పెళ్లిలో గొడవద్దు ఇష్టమైతే అక్షింతలు వెయ్యు అంటుంది అపర్ణ.
నా చెల్లెలు చెప్తే తీసుకొచ్చి పెద్ద బండరాయి ఆ మాయ నెత్తి మీద వేస్తాను అంతేగాని అక్షింతలు వేయను అంటుంది స్వప్న. మరోవైపు అసలు మాయ స్పృహలోకి రావాలని టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉంటుంది అప్పు. మరోవైపు బయట ఏడుస్తున్న కావ్య దగ్గరికి వచ్చి ఆమెని ఓదారుస్తుంది ఇందిరా దేవి. నువ్వు అంత ఈజీగా ఒప్పందం పత్రాల మీద సంతకం పెట్టవు, ఈ పెళ్లి ఆపడానికి ఏమైనా చేస్తున్నావా అని అడుగుతుంది.

నేను నిజం చెప్తే మావయ్య గారి గురించి నిజం చెప్పాల్సి వస్తుంది అనుకొని ఏమి చెప్పకుండా ఉండిపోతుంది కావ్య. సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు పద వెళ్లి పెళ్లి ఆపేద్దాం అంటుంది ఇందిరా దేవి. ఎలా అమ్మమ్మ గారు.. పెళ్లి సమ్మతమే అని ఒప్పందం పత్రం రాసిచ్చాను ఇప్పుడు మాట తప్పలేను అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు మాయ స్పృహలోకి రావడం గమనించి అప్పు డాక్టర్ను పిలుచుకొని వస్తుంది. డాక్టర్ ఆమెని టెస్ట్ చేస్తూ ఉంటుంది.
మరోవైపు రాజ్ కూడా పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. చూసావా కాసేపట్లో నేను నిన్ను సొంతం చేసుకోబోతున్నాను అని రాజ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది మాయ. మనం ఇంకా పీటల మీదే ఉన్నాము శోభనం గదిలో ఏమీ లేము,ఏ నిమిషంలో అయినా ఈ పెళ్లి ఆగిపోవచ్చు అంటాడు రాజ్. నా చేత ఎంత తప్పుడు పని చేయిస్తున్నావు రాజ్.. దీర్ఘ సుమంగళీభవ అని కావ్యని దీవించాను ఇప్పుడు ఆ మాటల్ని వెనక్కి తీసుకోమంటావా, ఈ సూర్పణక నీకు ఎక్కడ దొరికింది అని కోప్పడతాడు పూజారి.

మరోవైపు సుభాష్ కావ్య దగ్గరికి వెళ్లి ఎలాగైనా పెళ్లి ఆపేస్తావని ధీమాతో ఇంతసేపు ఉన్నాను కానీ పెళ్లి పీటల వరకు వచ్చింది పెళ్లి ఆపటానికి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నేను వెళ్లి ఆ పెళ్లికూతురు బుర్ర బద్దలు కొట్టేస్తాను అని ఆవేశంగా అంటుంది స్వప్న. కళ్యాణ్, ఇందిరా దేవి కూడా ఈ పెళ్లి ఆపటానికి ఏం చేస్తున్నావు అని అడుగుతారు.
వాళ్లకి సమాధానం చెప్పేలోపే అప్పు ఫోన్ చేసి మాయ కి మెలకువ వచ్చింది అని చెప్పడంతో కాసేపు ఈ పెళ్లి ఆపండి నేను ఇప్పుడే వచ్చేస్తాను కానీ హాస్పిటల్ కి బయలుదేరిన కావ్య మాయా దగ్గరికి వెళ్లి దయచేసి నిజం చెప్పు ఆ బిడ్డ ఎవరు, నువ్వు చెప్పే నిజం మీద నా జీవితం ఆధారపడి ఉంది అని రిక్వెస్ట్ చేస్తుంది డాక్టర్ పేషెంట్ మీద ప్రెషర్ పెట్టొద్దు అని మందలిస్తారు. మాయా మళ్లీ స్పృహ కోల్పోవడంతో ట్రీట్మెంట్ చేయాలి అని కావ్య వాళ్ళని బయటికి పంపించేస్తుంది డాక్టర్.

తరువాయి భాగంలో మాయ కోమాలోకి వెళ్ళిపోయింది అని డాక్టర్ చెప్పటంతో షాక్ అవుతారు కావ్య, అప్పు. దీనంగా ఇంటికి తిరిగి వచ్చిన కావ్య అని సైగల ద్వారానే ఏమైంది అని అడుగుతాడు రాజ్. క్షమించండి అన్నట్లు దండం పెట్టేస్తుంది కావ్య. రాజ్ షాక్ అవుతాడు, చేసేది లేక మాయ మెడలో తాళి కడుతున్న సమయంలో సుభాష్ పెళ్లి ఆపమంటాడు.


Click it and Unblock the Notifications










