Brahmamudi 11th June episode: పెళ్లిపీటల మీద రాజ్, చిత్ర.. స్పృహలోకి వచ్చిన మాయ!

దొంగ మాయ గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఆమెని బెదిరించి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోమంటాడు. కానీ మాయ తర్వాత ప్లేట్ ఫిరాయిస్తుంది. అసలు మాయని పట్టుకొని నిజం చెప్పించాలి అనుకుంటుంది కావ్య కానీ రుద్రాణి ఆ పని జరగనివ్వదు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 11వ తేదీ ఎపిసోడ్ 433 లో ఏం జరిగిందంటే..

భర్త దగ్గరికి వెళ్లిన అపర్ణ భర్తని తన పక్కన నిలబడమంటుంది. అలా చేయడం నావల్ల కాదు అంటాడు సుభాష్. ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదా, మీకు నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది అపర్ణ. లేదు జాలిగా ఉంది అంటాడు సుభాష్. ఎందుకు అంటుంది అపర్ణ. నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుందని నోరు విప్పలేకపోతున్నాను అనుకుంటాడు సుభాష్. ఇంతలో రుద్రాణి వచ్చి వదిన పక్కన నిలబడి తండ్రిగా నీ బాధ్యత నెరవేర్చు అన్నయ్య అంటుంది.

Brahmamudi serial 11th June 2024

ఈ పెళ్లి జరగాలని మీ వదిన కన్నా నువ్వే ఎక్కువగా కోరుకుంటున్నావు, కారణం తెలియటం లేదు అంటాడు సుభాష్. మరోవైపు ఐ సి యు నుంచి బయటికి వచ్చిన డాక్టర్ మాయ కోమాలోకి వెళ్ళిపోయింది అని చెప్పటంతో నిరాశ పడిపోతుంది కావ్య, ఆ నిరాశలోనే ఇంటికి వస్తుంది. పెళ్లి పీటల మీద ఉన్న రాజ్ ఏం జరిగింది అని అడుగుతాడు క్షమించండి అన్నట్లు చేతులు జోడిస్తుంది కావ్య. రాజ్ కూడా నిరాశకి గురవుతాడు. తాళి కట్టే సమయం దగ్గర పడింది అని పంతులుగారు చెప్పడంతో తాళి కట్టడానికి రెడీ అవుతాడు రాజ్.

ఇంతలో సుభాష్ పెళ్లి ఆపండి అనటంతో అందరూ షాక్ అవుతారు. ఎందుకు పెళ్లి చెప్పమంటున్నారు అంటుంది అపర్ణ. ఈ పెళ్లి జరిగితే నా కొడుకు జీవితం అన్యాయం అయిపోతుంది నా కొడుకు శ్రీరామచంద్రుడు వాడు ఎలాంటి తప్పు చేయలేదు అంటాడు సుభాష్. మరి ఆ బిడ్డ ఎవరు అని నిలదీస్తుంది అపర్ణ. సుభాష్ నిజం చెప్పబోతుంటే కావ్య, రాజ్ ఇద్దరూ వద్దు అని వారిస్తారు. ఇంక చాలు రాజ్ నిజం చెప్పవలసిన టైం వచ్చింది.

Brahmamudi serial 11th June 2024 Episode of 433 Here is full story

ఇప్పటికే నిజం చెప్పకపోతే జీవితాంతం మీ ముందు నేను దోషిగా నిలబడాలి అంటూ ఆ బిడ్డ తన బిడ్డ అన్న నిజాన్ని చెప్పేస్తాడు సుభాష్. ఈ మాయ దొంగ మాయ ఆస్తికోసం ఇంట్లో అడుగుపెట్టింది నన్ను నా కొడుకుని, కోడల్ని బ్లాక్ మెయిల్ చేసింది, ఈరోజు వరకు నేను నా కొడుకు కోడలు ఎంత నరకం అనుభవించాము మాకే తెలుసు అంటాడు సుభాష్. ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావ్ రా అంటాడు సీతారామయ్య.

అవును నాన్న నేను చెప్పేది నిజం నీ కొడుకు నువ్వు అనుకున్నంత ఉత్తముడు కాదు అంటూ జరిగిందంతా చెప్తాడు సుభాష్. అపర్ణ దగ్గరకి వెళ్లి నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను నన్ను క్షమించు అంటూ చేతులు జోడిస్తాడు. అయితే నిజాన్ని భరించలేకపోయిన అపర్ణ కుప్పకూలిపోతుంది ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు.

Brahmamudi serial 11th June 2024 Episode of 433 Here is full story

ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది బయట సుభాష్ ఇదంతా నా వల్లే జరిగింది అని గిల్టీగా ఫీల్ అవుతాడు. అతనికి ధైర్యం చెప్తుంది కావ్య. అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అసలు ఆ మాయ మన ఇంట్లో వాళ్ళ అలవాట్లు ఎలా తెలుసుకుంది, తను ఇంకా ఇంట్లోనే ఉందా అని అంటుంది. అప్పుడు రుద్రాణి చిత్రని బెదిరించి బయటికి పంపించేసిన సంగతి గుర్తు చేసుకుంటుంది.

తరువాయి భాగంలో డాక్టర్ అపర్ణకి హార్ట్ ఎటాక్ సివియర్ గా వచ్చిందని, ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్తుంది. మరోవైపు ఇదంతా నీ వల్లే జరిగింది, నిజం చెప్పే పరిస్థితి నీ వల్లే వచ్చింది, మా అమ్మకి ఏమైనా జరిగిందంటే మాత్రం నేను జీవితంలో నీ మొఖం చూడను అనే కావ్య పై ఫైర్ అవుతాడు రాజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X