Brahmamudi 12th June episode: తల్లికి హార్ట్ ఎటాక్..నీవల్లే.. నీ ముఖం చూడను అంటూ కావ్యపై రాజ్ ఫైర్
అసలు మాయని పట్టుకొని నిజం చెప్పించాలి అనుకుంటుంది కావ్య కానీ రుద్రాణి ఆ పని జరగనివ్వదు. కావ్య చిత్రల పెళ్లి పీటల మీదకి రావడంతో తప్పనిసరి పరిస్థితులలో నిజం చెప్పేస్తాడు సుభాష్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 12వ తేదీ ఎపిసోడ్ 434 లో ఏం జరిగిందంటే..
మనల్ని ఇంత మోసం చేసిన ఆ మాయ ఇంకా ఇంట్లోనే ఉండి ఉంటుందా అంటుంది ధాన్యలక్ష్మి. ఇంకా ఎందుకు ఉంటుంది ఎప్పుడో ఇల్లు దాటేసి ఉంటుంది అంటుంది రుద్రాణి. పెద్దమ్మ ప్రాణం మీదికి వచ్చింది కాబట్టి అందరం ఇక్కడికి వచ్చేసాము లేదంటే ఆ మాయని, దాని వెనుక ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ల అంతు చూసేవాళ్ళం అంటాడు కళ్యాణ్. ఆ మాయకి సపోర్ట్ చేసింది ఎవరై ఉంటారు అంటుంది ధాన్యలక్ష్మి. కావ్య రుద్రాణి వైపు కోపంగా చూస్తూ ఏమో వాళ్లు మన ఎదురుగా కూడా ఉండి ఉండవచ్చు బయటపడే వరకు అందరూ పెద్ద మనుషులే అంటుంది.

అవును బయటపడే వరకు అందరూ పెద్ద మనుషులే మనం పెద్దన్నయ్య గురించి ఇన్నాళ్లు అలాగే అనుకున్నాం కదా, ఇప్పుడు వాడు చేసిన పని బయటపడింది కాబట్టి దోషి లా నిలబడ్డాడు లేదంటే ఇన్నాళ్ళు శ్రీరామచంద్రుడే అనుకున్నాం కదా అంటుంది రుద్రాణి. ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది ఇందిరా దేవి వెళ్లి పెద్ద కొడుకు చెంప పగలగొడుతుంది. మొదటిసారిగా నిన్ను కన్నందుకు అసహ్యపడుతున్నాను.
నిన్ను ఎంతగా నమ్మింది నా కోడలు అలాంటి దాన్ని మోసం చేయాలని ఎలా అనిపించింది, తప్పు చేసేటప్పుడు కుటుంబం గురించి, ప్రతి పరువు ప్రతిష్టల గురించి ఆలోచించలేదా, నా కోడలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే పర్వాలేదు లేదంటే మాత్రం నిన్ను జీవితంలో ఇంటి గుమ్మం ఎక్కనివ్వను అని కొడుక్కి వార్నింగ్ ఇస్తుంది. ఆమెని ఆవేశ పడవద్దు అని ఓదార్చుతాడు రాజ్. అతడిని కూడా మందలిస్తుంది ఇందిరాదేవి. తండ్రి తప్పు చేస్తే నింద నీ మీద వేసుకున్నావు.
ఇప్పుడు మీ అమ్మకు వచ్చిన పరిస్థితి నీ భార్యకు వస్తే ఏం చేసే వాడివి మీరందరూ ఏదో పెద్ద త్యాగం చేసినట్లు మాట్లాడుతున్నారు అంటూ భోరున ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ అపర్ణ కి సీనియర్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది ట్రీట్మెంట్ చేస్తున్నాము అంటుంది. ఇక్కడ ఇంతమంది ఉండకూడదు ఒకరు ఇద్దరు ఉండి మిగతా వాళ్ళు వెళ్లిపోండి అని చెప్తుంది. రాజ్ అందరినీ పంపించేస్తాడు కావ్యని కూడా వెళ్లిపోమంటే ఆడ పేషెంట్ కి ఆడ మనిషి తోడు ఉండాలి అంటూ అక్కడ ఉండిపోతుంది.

ఆ తర్వాత కావ్య ని బయటికి తీసుకువెళ్లి అసలు ఇదంతా నీ వల్లే జరిగింది ఆ దొంగ మాయని నువ్వు ఇంటికి తీసుకు రాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు, తప్పు నేనే చేశాను అనుకొని మా అమ్మ సర్దుకునేది కానీ మా కుటుంబాన్నిఉద్ధరించేస్తాను అన్నట్లు ఏవేవో చేశావు పరిస్థితిని ఇక్కడ వరకు తీసుకువచ్చావు ఇప్పుడు మా నాన్న తలెత్తుకొని తిరగగలడా అంటూ కావ్య పై కేకలు వేస్తాడు.
ఆమె చెప్తున్నది వినిపించుకోకుండా మా అమ్మ క్షేమంగా తిరిగి వస్తే పర్వాలేదు లేదంటే జీవితంలో నీ మొఖం చూడను అని వార్నింగ్ ఇస్తాడు రాజ్. మరోవైపు ఇంటికి వచ్చిన అనామిక సుభాష్ గురించి చులకనగా మాట్లాడుతుంది అది భరించలేక పోతాడు కళ్యాణ్. అనామికపై ఫైర్ అవుతూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హాస్పిటల్ లో ఒంటరిగా కూర్చున్న సుభాష్ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు.

అటుగా వెళుతున్న నర్స్ ట్రే లోంచి చాక్ తీసుకుని మణికట్టుపై కోసుకుంటాడు. నర్స్ కేకలు వేయడంతో రాజ్ దంపతులు అక్కడికి వస్తారు. సుభాష్ దగ్గర చాక్ లాక్కుంటాడు రాజ్. నేను తలెత్తుకొని తిరగలేను కుటుంబంలో నాకు ఇంక విలువ ఉండదు అంటూ కన్నీరు పెట్టుకుంటాడు సుభాష్. రాజ్ వెంటనే డాక్టర్ని పిలవడంతో డాక్టర్ సుభాష్ కి కట్టు కట్టి పెద్దవారు మీరు ఇలా చేయడం ఏమిటి మరెప్పుడు ఇలా చేయకండి అని చెప్పి వెళ్ళిపోతాడు.
తరువాయి భాగంలో ఒక్కసారి హార్ట్ ఎటాక్ వస్తే గుండె షెడ్ కి వెళ్ళిపోయినట్లే, ఇక చిన్న సమస్య వచ్చినా మా వదిన గుండె ఆగిపోతుంది, ఇలాంటి సమస్యలు మనం క్రియేట్ చేస్తే మా వదిన డైరెక్ట్ గా పైకి పోతుంది అని కొడుకుతో చెప్తుంది రుద్రాణి. మరోవైపు అపర్ణకి ధైర్యం చెబుతుంది కావ్య. నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా నేను నిన్ను నమ్మను అంటుంది అపర్ణ.


Click it and Unblock the Notifications











