Brahmamudi 13th June episode: మా వదిన డైరెక్టుగా పైలోకానికే.. రుద్రాణి హైడ్రామా.. కావ్యపై రాజ్ ఫైర్

అసలు మాయని పట్టుకొని నిజం చెప్పించాలి అనుకుంటుంది కావ్య కానీ రుద్రాణి ఆ పని జరగనివ్వదు. కావ్య చిత్రల పెళ్లి పీటల మీదకి రావడంతో తప్పనిసరి పరిస్థితులలో నిజం చెప్పేస్తాడు సుభాష్. ఆ నిజాన్ని తట్టుకోలేక హాస్పిటల్ పాలవుతుంది సుమిత్ర. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 13వ తేదీ ఎపిసోడ్ 435 లో ఏం జరిగిందంటే..

మీరు ఇలా చేస్తే మేమందరం ఏమైపోతాం అనుకున్నారు అని తండ్రితో అంటాడు రాజ్. ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి ఇలాంటి పని చేశానంటే నాకు చాలా గిల్టీగా ఉంది ఇప్పుడు ఇంటిలో ఏ తప్పు జరిగినా నిలదీసే అర్హత పోగొట్టుకున్నాను అంటాడు సుభాష్. కావ్య కూడా సుభాష్ కి ధైర్యం చెబుతుంది. రాజ్ మాట్లాడుతూ అమ్మ ఎప్పటికైనా మిమ్మల్ని క్షమిస్తుంది డాడీ, మరెప్పుడూ ఇలాంటి పని చేయకండి రెస్ట్ తీసుకోండి అని చెప్పి బయటకు వచ్చేస్తారు రాజ్, కావ్య.

Brahmamudi serial 13th June 2024

తర్వాత కావ్య అపర్ణ దగ్గరికి వెళ్లి ఆమెకి ధైర్యం చెప్తుంది. నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా అని అడుగుతుంది అపర్ణ. ఇప్పుడు మీరు ఉన్న పరిస్థితులలో మీకు నేను మాత్రమే ధైర్యం చెప్పగలను, ఒకప్పుడు నేను కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాను కానీ నా భర్త మీద నాకు ఉన్న నమ్మకంతో నేను స్థిరంగా ఉన్నాను.

మీరు మావయ్య గారిని పెళ్లి చేసుకుని ఎన్నో సంవత్సరాలు అయింది, మీకు ఆయన మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆయన మిమ్మల్ని మోసం చేసే మనిషి కాదు ఆయనే మోసపోయే అవకాశం ఉంది కదా.. ఏ తల్లి బిడ్డను వదిలేసి ఇన్ని రోజులు ఉండలేదు. బిడ్డను వదిలేసి ఉన్నందుకు ఆవిడా నెలకు 10 లక్షలు తీసుకుంటుంది అంటే దీని వెనుక ఏదో ఉంది ఆ నిజమేంటో తెలుసుకునే వరకు మీరు ఓపిక పట్టండి ధైర్యంగా ఉండండి అని చెప్తుంది.

నేను నీ మాటలు నమ్మను అంటూ నిద్రలోకి జారుకుంటుంది అపర్ణ. మరోవైపు అపర్ణ చచ్చిపోలేదు అని చాలా బాధపడతాడు. ఒకసారి హార్ట్ ఎటాక్ వచ్చిన గుండె షెడ్ కి వెళ్ళిపోయినట్టే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆగిపోతుంది, అందుకే అలాంటి ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేద్దాం మా వదినని పైకి పంపించేద్దాం అంటుంది రుద్రాణి ఆ మాటలకి ఆనందపడతాడు రాహుల్. మరోవైపు ఊరు నుంచి ఇంటికి వచ్చిన కనకం దంపతులు దిగులుగా ఉన్న అప్పుని చూసి ఏం జరిగింది అని అడుగుతారు.

Brahmamudi serial 13th June 2024 Episode of 435 Here is full story

జరిగిందంతా చెప్తుంది అప్పు. భర్తకు పెళ్లి చేయమని సంతకం చేయడం ఏమిటి దానికి ఏమైనా పిచ్చి పట్టిందా అని కూతుర్ని మందలిస్తుంది కనకం. తను ఏ పరిస్థితుల్లో ఉండి అలాంటి పని చేసిందో అని కూతుర్ని వెనకేసుకొస్తాడు కావ్య తండ్రి. ఇతరుల మంచి గురించి ఆలోచిస్తూ దాని గురించి అది ఆలోచించదు,అందుకే తల్లిగా నేనే దాని గురించి ఆలోచించాలి కదా అని బాధపడుతుంది కనకం.

మరోవైపు డాక్టర్ రాజ్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీ అత్తగారికి మేము ట్రీట్మెంట్ మాత్రమే చేసాము కానీ మీ భార్య ఆమెకు ఏం చెప్పిందో తెలియదు కానీ ఆమె చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. మేము ఇంటికి ఆమెతో పాటు ఒక నర్స్ ని పంపించాలి అనుకున్నాము కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు, మీ కోడలు ఉంటే ఆవిడా రెండు రోజుల్లో లేచి తిరుగుతుంది ఆమెకి టెన్షన్ పడే వార్తలు చెప్పకండి అని జాగ్రత్తలు చెప్పే వెళ్ళిపోతుంది డాక్టర్. రాజ్ డాక్టర్ కి థాంక్స్ చెప్పబోతుంటే మీ భార్యకి చెప్పండి అంటుంది.

Brahmamudi serial 13th June 2024 Episode of 435 Here is full story

నెక్స్ట్ సీన్ లో ఇంటికి వచ్చిన అపర్ణ కి ధైర్యం చెప్తాడు రాజ్. ఇంట్లో గొడవలు ఏమీ పట్టించుకోవద్దు గురించి నేను కేర్ తీసుకుంటాను అంటాడు. అప్పుడు రుద్రాణి మాట్లాడుతూ అలా ఎలా వదిలేస్తాం ఇప్పుడు ఆ బిడ్డ తల్లి వచ్చి వారసత్వం కావాలి హక్కులు కావాలి అంటూ ఇంట్లోకి వేస్తే ఈ వయసులో మా వదినకి సమితి పోరు అవసరమా ముందు ఆ విషయం తేల్చాలి అంటుంది. ఆమె మాటలకి ఇంట్లో అందరూ చివాట్లు పెడతారు.

అత్త ని ఏ కాశీయో రామేశ్వరం మూడు నెలలు పంపించెయ్ కళ్యాణ్, ఈ సమయంలో ఆమె అమ్మ దగ్గర ఉండకూడదు అంటాడు రాజ్. ఫామ్ హౌస్ కి పంపించేద్దాం అన్నయ్య అక్కడ ఆ పని మనుషులు ఉండరు, పాములు కూడా ఉంటాయి అంటాడు కళ్యాణ్. నేనేమన్నానని నన్ను వెళ్ళిపోమంటున్నారు, తప్పు చేసింది అన్నయ్య అయితే అందరూ నామీద అరుస్తున్నారేంటి అంటుంది రుద్రాణి. ఆవిడ మీద ఫైర్ అవుతుంది కావ్య.

తరువాయి భాగంలో కనకం దంపతులు సుమిత్రని పరామర్శించడానికి వస్తారు. వాళ్ళని కావ్య పలకరించకపోవడంతో కావ్యని మందలిస్తుంది సుమిత్ర. ఆమెలో వచ్చిన మార్పు కి అందరూ ఆశ్చర్యపోతారు. సుమిత్ర పంతులు గారితో పూజలో అంతసేపు కూర్చోలేను నా కొడుకు కోడలు కూర్చొని పూజ చేస్తారు అనటంతో ఇంట్లో వాళ్ళందరూ మరింత ఆశ్చర్యపోతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X