Brahmamudi 14th June episode: కుట్రలకు పదును పెట్టిన రుద్రాణి.. కావ్యను అనుమానించిన అపర్ణ
రాజ్ చిత్రల పెళ్లి పీటల మీదకి రావడంతో తప్పనిసరి పరిస్థితులలో నిజం చెప్పేస్తాడు సుభాష్. ఆ నిజాన్ని తట్టుకోలేక హాస్పిటల్ పాలవుతుంది సుమిత్ర. కోడలికి ఈ పరిస్థితి తెచ్చినందుకు కొడుకు పై ఫైర్ అవుతుంది ఇందిరా దేవి. కోలుకున్న సుమిత్రను ఇంటికి తీసుకు వస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 14వ తేదీ ఎపిసోడ్ 436 లో ఏం జరిగిందంటే..
మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా, మీరు నోరు ముయ్యకపోయారంటే నేను నోరు విప్పాల్సి వస్తుంది అని రుద్రాణిపై ఫైర్ అవుతుంది కావ్య. మీ మంచి కోసమే చెప్పాను కావాలంటే వినండి లేదంటే వదిలేయండి అంటుంది రుద్రాణి. ఇక్కడ మీ సలహాలు ఎవరికి అక్కర్లేదు వెళ్లి మీ పని చూసుకోండి లేదంటే అత్తగారు అని కూడా చూడను అని రుద్రాణి పై ఫైర్ అవుతుంది స్వప్న. దాంతో రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజ్ మాట్లాడుతూ నువ్వు ఇవేవీ మనసులో పెట్టుకోకు ప్రశాంతంగా ఉండు అని తల్లికి ధైర్యం చెప్తాడు.

నన్ను నా గదిలోకి తీసుకువెళ్ళు అంటుంది అపర్ణ. రాజ్ తల్లిని గదిలోకి తీసుకు వెళ్తుంటే సాయం చేయబోయిన కావ్యని అసహ్యించుకుంటుంది, తనకి ఎదురైన భర్తని కూడా అసహ్యించుకుంటుంది అపర్ణ. మరోవైపు గదిలో కావ్య పని చేసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన రాజ్ నువ్వు ఇకమీదట ఆ మాయ గురించి ఆలోచించడం మానేయ్, ఏదో చేస్తానని చెప్పి ఆ దొంగ మాయని తీసుకువచ్చి ఇంట్లో పెట్టావు, పెళ్లి ఆపేస్తాను అని చెప్పి ఆఖరి నిమిషంలో చేతులు ఎత్తేసావు.
అందుకే నాన్న నిజం చెప్పాల్సి వచ్చింది, ఆ నిజం ఇప్పుడు అమ్మ ప్రాణాల మీదికి తీసుకువచ్చింది ఇప్పటికైనా ఆ పిచ్చి పనులు చేయటం ఆపు అంటాడు. మొదలు పెట్టిన పనిని మధ్యలోనే వదిలేయను, ఆ మాయ ఎవరో తెలిస్తే అత్తగారికి గుండె భారం తీరుతుందేమో, అప్పుడైనా మావయ్య గారిని క్షమిస్తారేమో ఎందుకు ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తారు అంటూ భర్తని కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య.

మరోవైపు అపర్ణ కోడలు పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు పశ్చాతాపంతో కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే జ్యూస్ తీసుకుని కావ్య ఆమె గదిలో అడుగుపెట్టబోతుంది. నువ్వు నా గదిలోకి రావద్దు నాకు ఎదురు పడొద్దు అంటుంది అపర్ణ. మీకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మీ కొడుకు భార్యని ఇప్పుడు మీ ఆరోగ్యం బాగోలేదు మీరు త్వరగా కోలుకోవాలి అందుకే మీకు సేవలు చేసుకోనివ్వండి అంటుంది కావ్య.
నువ్వు ఎదురుపడితే నేను నీ మొఖం చూడలేను, నువ్వు నీ కుటుంబం కోసం చేసిన త్యాగాన్ని భరించలేను నేను నీ పట్ల దురుసుగా ప్రవర్తించాను కానీ ఎప్పటికీ ఆ విషయం ఒప్పుకోను ఎందుకంటే నేను దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిని ఎప్పటికీ నీ ముందు తలవంచను దయచేసి వెళ్ళిపో అంటుంది అపర్ణ. అత్తగారి మాటలకి ఆశ్చర్య పోతుంది కావ్య. మీరు నా ముందు తలవంచవలసిన అవసరం లేదు మీరు నా దృష్టిలో ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటారు అంటూ గదిలోకి అడుగుపెడుతుంది కావ్య.

నిన్ను వెళ్లిపోమంటే గదిలోకి వస్తావేమిటి నా మాట అంటే ఖాతరులేదా అంటుంది అపర్ణ. మీరు ఎన్నిసార్లు వెళ్లిపోమంటే అన్నిసార్లు వెళ్ళిపోతాను కానీ మీకు కావలసింది ఇచ్చి వెళ్ళిపోతాను అంటూ జ్యూస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు కనకం కావ్యకి ఫోన్ చేసి ఈరోజు మీ ఇంట్లో పూజ పెట్టుకున్నారు అంట కదా ఇప్పటికే మీ ఇంట్లో చాలా గొడవలు అవుతున్నాయి.
మళ్ళీ మేము వస్తే ఏం జరుగుతుందో అని భయం గా ఉంది అందుకే ఏదో వంక చెప్పి రావటం మానేస్తాను అంటుంది కనకం. మా అత్తగారికి బాగోలేనప్పుడు మీరు రాకపోతేనే బాగోదు, అందుకే రండి అని తల్లికి చెప్తుంది కావ్య. సరే అంటుంది కనకం. మరోవైపు అపర్ణ చేత వాకింగ్ చేయించాలనుకుంటాడు రాజ్. కానీ అపర్ణ మోసగాళ్లతో మాట్లాడను అంటుంది అయినా ఆమెని బుజ్జగించి వాకింగ్ చేయిస్తూ ఉంటాడు రాజ్.ఆ సమయంలో భర్త పట్ల తన అసహ్యన్ని వెళ్లగకుతుంది అపర్ణ.

నా భార్యకి నా మీద ఉన్న నమ్మకం నీ భర్త మీద నీకు ఎందుకు లేకుండా పోయింది అని తల్లిని అడుగుతాడు రాజ్. తండ్రిని వెనకేసుకొస్తున్నందుకు కొడుకుని కోప్పడుతుంది అపర్ణ. సరేలే ఇప్పుడు ఆ విషయాలు ఏమీ వద్దు ముందు నీ ఆరోగ్యం కుదుటపడనీ అంటాడు రాజ్. నీరసంతో నడవలేక ఒక దగ్గర కూర్చుండిపోతుంది అపర్ణ. అక్కడికి కావ్య సూప్ తీసుకుని వస్తుంది. నీ భార్య చేత్తో ఇచ్చిన సూప్ నేను తాగనని చెప్పు అంటుంది అపర్ణ.
తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన కనకం వాళ్ళని పలకరిస్తుంది అపర్ణ, తల్లిదండ్రులని పలకరించలేదని కావ్యని కోప్పడుతుంది. ఆపర్ణ ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు కనకం, కావ్య వాళ్ళు. పూజలో నేను అంత సేపు పీటల మీద కూర్చోలేను, పూజ నా కొడుకు కోడలు చేస్తారు అని పూజారితో చెప్తుంది అపర్ణ.


Click it and Unblock the Notifications










