Brahmamudi 15th June episode: కావ్యతో అపర్ణ వింత ప్రవర్తన.. ఆశ్చర్యపోయిన కనకం
రాజ్ చిత్రల పెళ్లి పీటల మీదకి రావడంతో తప్పనిసరి పరిస్థితులలో నిజం చెప్పేస్తాడు సుభాష్. ఆ నిజాన్ని తట్టుకోలేక హాస్పిటల్ పాలవుతుంది సుమిత్ర. కోడలికి ఈ పరిస్థితి తెచ్చినందుకు కొడుకు పై ఫైర్ అవుతుంది ఇందిరా దేవి. కోలుకున్న అపర్ణను ఇంటికి తీసుకు వస్తారు. ఆ తర్వాత కోడలు చేస్తున్న సేవలకి, ఆమె పట్ల తను తప్పుగా ప్రవర్తించినందుకు అపరాధంతో కుమిలిపోతూ ఉంటుంది అపర్ణ ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 15వ తేదీ ఎపిసోడ్ 437 లో ఏం జరిగిందంటే..
తనకోసం సూప్ తీసుకువచ్చిన కావ్య పై కోప్పడుతుంది అపర్ణ. నా కళ్ళ ఎదుట పడగొద్దని తనకి రాత్రే చెప్పాను అయినా మళ్లీ ఎందుకు వచ్చింది అని కొడుకుని అడుగుతుంది. సూప్ తీసుకువచ్చాను అంటుంది కావ్య. రాజ్ కూడా సూప్ తీసుకో మమ్మీ, ఆకలి వేస్తే టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోవచ్చు అంటాడు. తను చేత్తో ఇచ్చిన సూప్ తాగను అంటుంది అపర్ణ. అందరూ నన్నే అనండి అంటుంది కావ్య. నిన్ను ఇంకెవరు అన్నారు అంటుంది అపర్ణ. మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే అని మీ అబ్బాయి అంటున్నారు అంటుంది కావ్య.వాడి తండ్రి చేసిన మోసానికి నేను చావు అంచుల వరకు వెళ్లొచ్చాను.

మధ్యలో నువ్వేం చేసావు, ఆ సూప్ వాడికి ఇచ్చి వెళ్ళిపో అంటుంది అపర్ణ. కావ్య వెళ్ళిపోయిన తర్వాత కొడుకుతో మాట్లాడుతూ నీ భార్యని కాస్త పట్టించుకో, భర్త మనసులో భార్యకు స్థానం లేకపోతే ఆ ఆడది ఎంత బాధ పడుతుందో నాకు తెలుసు అంటుంది. నెక్స్ట్ సీన్ లో భార్య దగ్గరికి వచ్చిన రాజ్ డాడీ కి మంచి చేయాలనుకుని మమ్మీ విషయం మరిచిపోయినట్లు మమ్మీకి సేవలు చేస్తూ డాడీకి మంచి చేయాలని విషయం మర్చిపోకు అంటాడు.
అందుకు సరే అంటుంది కావ్య. ఆ తర్వాత పూజ కోసం ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు సుభాష్. నువ్వు ఇంత ప్రయాస పడుతున్నావు కానీ నీ భార్య నిన్ను క్షమిస్తుందని నేను అనుకోవటం లేదు అంటూ మళ్ళీ సుభాష్ ని కోప్పడుతుంది ఇందిరా దేవి. ఆయన కోడల్ని నేను ఇక్కడే ఉన్నాను అయినా మీరు మావయ్య గారి మందలించడం ఏమీ బాగోలేదు అంటుంది కావ్య.

వాడు నా కొడుకే కానీ ఒక ఆడదానికి వాడు చేసిన అన్యాయం సహించలేకపోయాను అంటుంది ఇందిరా దేవి. నా భార్య ఆరోగ్యం కోసం ఈ పూజ చేయిస్తున్నాను అంతేగాని తను నన్ను క్షమిస్తుందన్న ఆశతో కాదు అంటూ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్. తర్వాత కావ్య ఇందిరా దేవి తో మాట్లాడుతూ మావయ్య గారు ఈ పూజ ఏర్పాట్లు చేశారంటే అత్తయ్య గారు చేయించుకోరు.
అందుకే పూజ ఏర్పాట్లు మీరే చేశారని చెప్పండి, మావయ్య చేశారని చెప్పకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత అనామిక తల్లిదండ్రులు ఇంటికి రావడంతో ధాన్యలక్ష్మి వీళ్ళు ఇప్పుడెందుకు వచ్చారు అని అనామికని అడుగుతుంది.పూజ అని నేనే పిలిచాను అంటుంది అనామిక. అంటే మా అక్కని పలకరించడానికి రాలేదా అంటుంది ధాన్యలక్ష్మి. పూజ లేకపోతే సాయంత్రం ఎలాగూ వచ్చే వారే అంటూ తల్లిదండ్రులని వెనకేసుకొస్తుంది అనామిక. ఆ తర్వాత కనకం వాళ్ళు అపర్ణని పలకరించడానికి వస్తారు.
వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుతుంది అపర్ణ. వాళ్లని పలకరించమని వాళ్లకి కాఫీ ఇమ్మని చెప్పి కావ్యకి ఆర్డర్లు వేస్తుంది, అపర్ణ లో వచ్చిన మార్పు కి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఏం జరుగుతుందా అన్నట్లు ఉండిపోతారు. తర్వాత కావ్య కట్టుకున్న చీర బాగోలేదని నా పెద్ద కోడలు ఎప్పుడూ ఖరీదైన చీరలే కట్టుకోవాలని కావ్యకి ఆర్డర్ వేస్తుంది, తర్వాత భార్యకి మంచి చీరలు కొనలేదని కొడుకుని మందలించి ఆమెని షాపింగ్ కి తీసుకువెళ్లి మంచి చీరలు కొనమని రాజ్ కి ఆర్డర్ వేస్తుంది.

ఆ తర్వాత పూజకి సిద్ధం చేసిన పూజారితో పూజలో ఎంతసేపు కూర్చోవాలి అని అడుగుతుంది అపర్ణ. గంట సేపు అని చెప్తాడు పూజారి. నేను అంత సేపు కూర్చోలేను అంటుంది అపర్ణ. మీ ఆరోగ్యం కోసం కాబట్టి మీరే కూర్చోవాలి లేదంటే మీ భర్త కూర్చోవాలి అంటాడు పూజారి. అప్పుడు సుభాష్ నేను సిద్ధమే అంటూ పూజలో కూర్చుంటాడు. కానీ తనకు నమ్మకం ద్రోహం చేసిన భర్త పూజలో కూర్చోవడం ఇష్టం లేదని మొహం మీదే చెప్తుంది అపర్ణ.
తరువాయి భాగంలో బాధపడుతున్న సుభాష్ దగ్గరికి వెళ్లి మీరు అత్తయ్య గారితో ధైర్యంగా మాట్లాడండి, మీ పరిస్థితిని వివరించండి, ఆవిడ తప్పకుండా అర్థం చేసుకుంటారు అని కావ్య దంపతులు ఇద్దరూ సుభాష్ ని అపర్ణ దగ్గరికి పంపిస్తారు. భర్త తన దగ్గరకి రావడం తో భర్త ని అసహ్యంగా చూస్తూ పక్కకి జరుగుతుంది అపర్ణ.


Click it and Unblock the Notifications











