Brahmamudi 17th June episode: భర్తపై అపర్ణ అసహ్యంగా.. కావ్యకు షాకిచ్చిన అత్తయ్య!
నిజాన్ని తట్టుకోలేక హాస్పిటల్ పాలవుతుంది సుమిత్ర. కోడలికి ఈ పరిస్థితి తెచ్చినందుకు కొడుకు పై ఫైర్ అవుతుంది ఇందిరా దేవి. కోలుకున్న అపర్ణను ఇంటికి తీసుకు వస్తారు. ఆ తర్వాత కోడలు చేస్తున్న సేవలకి, ఆమె పట్ల తను తప్పుగా ప్రవర్తించినందుకు అపరాధంతో కుమిలిపోతూ ఉంటుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 17వ తేదీ ఎపిసోడ్ 438 లో ఏం జరిగిందంటే..
నన్ను చావు అంచుల వరకు తీసుకువెళ్లిన ఈ మనిషి పూజలో కూర్చోవడం నాకు ఇష్టం లేదు అవసరమైతే చస్తాను కానీ ఆయన పూజ చేయడానికి వీల్లేదు అంటుంది అపర్ణ. నీ ఆరోగ్యం కోసమే కదా డాడీ ఈ పని చేస్తున్నారు కాస్త అర్థం చేసుకో అని తల్లిని రిక్వెస్ట్ చేస్తాడు రాజ్. ధాన్యలక్ష్మి కూడా అపర్ణకి నచ్చచెప్పాలని చూస్తుంది. కానీ అపర్ణ వినిపించుకోదు.

వదినని ఎందుకు అంత బలవంతం చేస్తావు, నువ్వే కదా అమ్మకి ఇష్టం లేని పని చేయొద్దు అన్నావు అయినా అంత నమ్మకద్రోహం చేసిన మనిషిని ఏ ఆడది మాత్రం క్షమించగలదు అని రాజ్ ని మందలిస్తూ అపర్ణని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది రుద్రాణి. మధ్యలో ఆద్యం పొయ్యొద్దంటూ ఆమెపై కోప్పడతాడు ప్రకాష్. అప్పుడు సీతారామయ్య మాట్లాడుతూ కోడలికి ఇష్టం లేని పని చేయవద్దు, అది ఆమె ప్రాణానికే ప్రమాదం అంటాడు.
పూజ జరిగి తీరాలి బావ, ఇది నా కోడలు ఆరోగ్యం కోసం జరుగుతున్న పూజ ఎట్టి పరిస్థితులలోనూ ఈ పూజ ఆగకూడదు అంటుంది చిట్టి. అప్పటికే అవమానంతో కుమిలిపోతున్న సుభాష్ ఈ పూజలో నేను కూర్చోవడం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అపర్ణ కొడుకుని కోడల్ని పూజలో కూర్చోబెడుతుంది. ఇకమీదట ఈ ఇంటి పెద్ద కోడలుగా నేను చేయవలసిన ప్రతి పూజలోని నా కొడుకు కోడలే కూర్చుంటారు అంటుంది.

ఆమెలో వచ్చిన మార్పుకి ఇటు రుద్రాణి తో పాటు అటు కనకం దంపతులు కూడా షాక్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో పూజ అయిపోయిన తర్వాత అనామికతో మాట్లాడుతారు ఆమె తల్లిదండ్రులు. ఆ కావ్య ని చూసావా అత్తగారిని ఎలా బుట్టలో వేసుకుందో నువ్వు కూడా అలాగే నీ భర్తని బుట్టలో వేసుకొని ఎలాగైనా నీ ఆస్తి వాటా నువ్వు రాబట్టుకోవాలి అంటారు. అది అంత తేలికైన విషయం కాదు అంటుంది అనామిక. నువ్వు చేయగలవు ఆ నమ్మకం నాకుంది అంటుంది ఆమె తల్లి.
నేను చేసిన తప్పులకి నీ మీద ప్రెషర్ తీసుకురావాల్సి వస్తుంది నాకు వేరే దారి లేదు, త్వరగా పని పూర్తి చేయు అప్పుడు మళ్ళీ వస్తాం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనామిక తల్లిదండ్రులు. మరోవైపు ఇంటికి వెళ్ళిపోతున్న కనకం దంపతులు కావ్య ని మెచ్చుకుంటారు, మీ అత్తగారిని ఏం మాయ చేసావు, నిన్ను కోడలిగా అంగీకరించడంతో పాటు ఆవిడ మమ్మల్ని కూడా వియ్యంకులుగా ఒప్పుకున్నట్లుగా ఉన్నారు అంటారు.

ఓపిక పడ్డాను అమ్మ,చావో రేవో ఈ ఇల్లే అనుకున్నాను అంటుంది కావ్య. స్వప్న కూడా మారిపోయింది నీకు సపోర్ట్ గా నిలబడింది ఇంక నీకు కష్టాలు తీరినట్లే అంటాడు కావ్య తండ్రి. ఇంకా లేదు నాన్న మా మామయ్య గారు ఎవరి దగ్గరో మోసపోతున్నారు వారిని రక్షించాలి అంటూ అప్పుతో మాయ హెల్త్ గురించి ఎంక్వయిరీ చేయమని చెప్తుంది. మొదటిసారి ఈ ఇంటి నుంచి ఆనందంగా వెళుతున్నాము అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతారు కనకం దంపతులు.
మరోవైపు అపర్ణ ప్రవర్తనకి షాక్ లో ఉండిపోతుంది రుద్రాణి. ఆమెపై నీళ్లు జల్లి స్పృహలోకి తీసుకు వస్తాడు రాహుల్. మా వదిన చేస్తున్న పనులు చూస్తుంటే నాకు హార్ట్ ఎటాక్ వచ్చి పోయేలాగా ఉన్నాను, వదినకి కావ్య మీద సాఫ్ట్ కార్నర్ పెరిగిపోతుంది, వాళ్ళిద్దర్నీ కలవనివ్వకూడదు, కావ్య మీద వదిన మనసు విరిచేస్తాను అని కొడుకుతో చెప్తుంది రుద్రాణి. మరోవైపు సుభాష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య.
అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ తో మన గురించి ఆలోచించి మావయ్య నిజం చెప్పి అత్తయ్యకి దూరమైపోతున్నారు, అలా వదిలేస్తే మరింత దూరం అయిపోతారు, పదండి మనం మావయ్యతో మాట్లాడదాము ఆయన ఒంటరితనంతో బాధపడుతున్నారు అంటుంది. రాజ్ సరే అనటంతో సుభాష్ దగ్గరికి వెళ్తారు కావ్య దంపతులు. అపరాధ భావంతో ఉన్న సుభాష్ కి ధైర్యం చెప్పి మీరు అత్తయ్యతో మాట్లాడండి మామయ్య, ఆవిడ అర్థం చేసుకుంటారు అంటూ ఒంటరిగా కూర్చున్న అపర్ణ దగ్గరికి పంపిస్తారు కావ్య దంపతులిద్దరూ.

సుభాష్ అపర్ణ దగ్గరికి వెళ్లి నీతో నేను మాట్లాడాలి అంటాడు. తనని అసహ్యించుకుంటూ దూరం జరిగిన భార్యతో నేను చెప్పేది విను,నేను నీకు నీకు ద్రోహం చేయాలనుకోలేదు, నీకోసం నేను చావుకి కూడా సిద్ధపడ్డాను అంటాడు సుభాష్. మీరు లోకానికి భయపడి ఆ పని చేశారు సమాజానికి మొఖం చూపించలేక అలా చేశారు అంటూ నిష్టూరంగా మాట్లాడుతుంది అపర్ణ.
తరువాయి భాగంలో అప్పు కావ్య కి ఫోన్ చేసి మాయా కి మెలకువ వచ్చిందంట ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పింది అంటుంది. అప్పుడు కావ్య, కళ్యాణ్, అప్పు హాస్పిటల్ కి బయలుదేరుతారు. అయితే ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి స్పృహలోకి వచ్చిన మాయని తీసుకొని వెళ్ళిపోతారు. బెడ్ మీద మాయ లేకపోవడం చూసి షాక్ అవుతారు కావ్య వాళ్ళు.


Click it and Unblock the Notifications











