Brahmamudi June 18th episode: మాయ అన్వేషణలో కావ్య బృందం.. తల్లి మనసు మార్చే ప్రయత్నంలో రాజ్!

కోడలికి ఈ పరిస్థితి తెచ్చినందుకు కొడుకు పై ఫైర్ అవుతుంది ఇందిరా దేవి. కోలుకున్న అపర్ణను ఇంటికి తీసుకు వస్తారు. ఆ తర్వాత కోడలు చేస్తున్న సేవలకి, ఆమె పట్ల తను తప్పుగా ప్రవర్తించినందుకు అపరాధంతో కుమిలిపోతూ ఉంటుంది అపర్ణ. తన ఆరోగ్యం కోసం భర్త పూజ చేయాలనుకుంటే అందుకు అంగీకరించదు అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జూన్ 18వ తేదీ ఎపిసోడ్ 439 లో ఏం జరిగిందంటే..

నేను నీకోసం చనిపోవాలనుకున్నాను అది నీ మీద ప్రేమ కాదా అని అడుగుతాడు సుభాష్. కాదు సమాజం కోసం చేశారు, సమాజానికి మొఖం చూపించలేక అలా చేశారు అని భర్తని అసహ్యించుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది అపర్ణ. కానీ సుభాష్ ఆపి పెళ్లి అయిన దగ్గర్నుంచి నీ మాటలకి విలువ ఇచ్చాను ఎందుకంటే ఇంట్లో ఎవరు నిన్ను తక్కువ చేయకూడదని.

Brahmamudi serial 18th June 2024 Episode of 439 Here is full story

అలాంటి నేను ఒకానొక బలహీన క్షణంలో ఒక స్త్రీకి లొంగిపోవలసి వచ్చింది.అందులో నా తప్పులేదు అనటం లేదు కానీ ఎదుటి వ్యక్తి నన్ను అంతగా మాయలో పడేసింది, నేను నిన్ను క్షమించమని అడగటం లేదు నీ కోపం తీరేవరకు నన్ను శిక్షించు అంతేకానీ ఇలా మౌనంగా ఉండకు నేను భరించలేను అని భార్యకి సంజాయిషి ఇచ్చుకుంటాడు సుభాష్. ఈ మాటలు అన్నీ వెనుకనుంచి రాజ్ దంపతులు వింటూ ఉంటారు.

భర్త మాటలకి కరిగినట్లే కనిపిస్తుంది అపర్ణ కానీ ఇంతలో బాబు ఏడుపు వినిపించడంతో కోపంగా మారిపోయి వెళ్లి ఆ బాబుకి ఏం సమాధానం చెప్తారో చెప్పండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అత్తమామల పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఇలాగే ఊరుకుంటే వాళ్ళిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోతుంది కానీ ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను ఇప్పుడు ఏం చేయటం అనుకుంటుంది అంతలోనే అప్పు అక్కడికి వస్తుంది.

Brahmamudi serial 18th June 2024 Episode of 439 Here is full story

ఇంత పొద్దున్నే వచ్చావ్ ఏంటి, ఫోన్ అయినా చేయలేదు అంటుంది కావ్య. మీ ఇంట్లో గోడలకే కాదు ఫోన్ల కి కూడా చెవులు ఉంటాయి. అందుకే నేరుగా వచ్చాను, ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసింది మాయకి మెలకువ వచ్చింది అంట అని చెప్తుంది అప్పు. ఎంత శుభవార్త చెప్పావు పదా ఇప్పుడే వెళదాము అని బయలుదేరబోతుంటే అనుకోకుండా ఆ మాటలు విన్న కళ్యాణ్ వాళ్ల దగ్గరికి వస్తాడు, నేను ప్రతి విషయము మీతో షేర్ చేసుకుంటాను కానీ మీరు మాత్రం నా దగ్గర అన్ని దాచేస్తున్నారు.

ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని వదినని నిలదీస్తాడు. అనామిక మీతో ఇప్పటికే గొడవలు పడుతూ ఉంది, ఇలాంటి సమయంలో మీరు మాతో వస్తే మళ్ళీ అనామిక గొడవ చేస్తుంది అందుకే చెప్పలేదు అంటుంది కావ్య. ఎవరో ఏదో అనుకుంటారని మీరు మీ మరిదిని దూరం పెట్టేస్తారా అంటాడు కళ్యాణ్. మీరిద్దరూ ఇలా ఓవర్ సెంటిమెంట్ చూపించి టైం వేస్ట్ చేయకండి అంటుంది అప్పు. కళ్యాణ్ నేను కూడా వస్తాను అంటాడు.

Brahmamudi serial 18th June 2024 Episode of 439 Here is full story

మీరు ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇబ్బంది పడతారు అంటుంది కావ్య. రానీలే ఏం కాదు అని అప్పు అనడంతో కళ్యాణ్ కూడా వాళ్లతో బయలుదేరుతాడు. మరోవైపు మాయకి మెలకువ వచ్చింది అని ఇన్ఫర్మేషన్ రుద్రాణికి వస్తుంది. విషయం రాహుల్ కి చెప్పటంతో రాహుల్ కంగారు పడతాడు కానీ అతడిని కంగారు పడవద్దు అని చెప్పి మాయని మాయం చేయమని ఒక ఐడియా ఇస్తుంది రుద్రాణి. ప్లాన్ అమలు చేయడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాహుల్.

మరోవైపు హాస్పిటల్ కి ఇద్దరు రౌడీలు మాయ దగ్గరికి వచ్చి మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేసారు కావ్య మేడం మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్తారు. ముందు మాయ అనుమాన పడుతుంది కానీ ఆలస్యం చేస్తే మీకు ప్రమాదం ఎదురవుతుంది అని చెప్పటంతో వాళ్లతో పాటు బయలుదేరుతుంది మాయ. అప్పుడే హాస్పిటల్ కి వచ్చిన కావ్య వాళ్ళకి అక్కడ మాయ కనిపించకపోవడంతో కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్లి విషయం కనుక్కుంటారు. మీరే డిశ్చార్జి చేయమని చెప్పారు కదా అంటుంది డాక్టర్.

Brahmamudi serial 18th June 2024 Episode of 439 Here is full story

వాళ్లు వెళ్లి ఎంతసేపు అయింది అని అడుగుతుంది కావ్య . ఇప్పుడే వెళ్లారు ఇంకా గేటు దాటి ఉండరు అనటంతో వాళ్ళు మెయిన్ గేటు దగ్గరికి వస్తారు. అప్పుడే రెండు కార్లు బయటికి వెళ్లడం గమనిస్తారు. మనల్ని కన్ఫ్యూస్ చేయటం కోసమే అలా రెండు కార్లలో తీసుకు వెళ్తున్నారు అంటుంది అప్పు. మీరు ఒక కారుని ఫాలో అవ్వండి నేను మరో కారుని ఫాలో అవుతాను అని కావ్య అంటుంది. సరే అంటూ అక్కడి నుంచి బయలుదేరుతారు కావ్య వాళ్ళు.

మరోవైపు తల్లికి సేవలు చేస్తూ ఇల్లు ఇల్లులా లేదు, అందరూ స్తబ్దుగా ఉండి పోయారు, ఒక మనిషిని ద్వేషించినంత కాలం మనసుకి ప్రశాంతత ఉండదు ఒకసారి క్షమించి చూడు మమ్మీ అంటాడు రాజ్. నువ్వు నా కడుపున పుట్టినా నేను నీ నుంచి చాలా నేర్చుకోవాలి. తప్పు నువ్వు చేసావ్ అనుకొని నీకు చాలా శిక్షలు వేశాను, అందులో సగ భాగం నీ భార్య కూడా అనుభవించింది అయినా ఎక్కడ బయటపడలేదు, ఇంటిగుట్టుని కాపాడుకుంటూ వచ్చారు అంటుంది అపర్ణ.

తరువాయి భాగంలో కళ్యాణ్, అప్పు ఫాలో అవుతున్న కారు ఒక హోటల్ దగ్గర ఆగటం గమనించి ఆ హోటల్ కి వెళ్తారు. రౌడీలు ఏ రూమ్ లో ఉంటున్నారో తెలుసుకొని ఆ రూమ్ కి వెళ్తారు. వాళ్ళు రూమ్ లోకి వెళ్లేసరికి రౌడీలు బయటికి వచ్చి బయట డోర్ లాక్ చేస్తారు. అప్పుడే మీడియా వాళ్ళు అక్కడికి వచ్చి పెళ్లి అయినప్పటికీ అప్పు అనే యువతి తో తిరుగుతున్న దుగ్గిరాల వారి వారసుడు అంటూ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X